War 2 Movie: 'వార్ 2'పై అదిరిపోయే అప్ డేట్ - 500 మంది డ్యాన్సర్ల మధ్య ఎన్టీఆర్, హృతిక్ డ్యాన్స్, ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తుందిగా..
NTR Hrithik Roshan: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ క్రేజీ ప్రాజెక్ట్ 'వార్ 2'పై తాజా అప్ డేట్ ఫ్యాన్స్‌కు కిక్ ఇస్తోంది. మూవీలో వీరిద్దరి మధ్య ఓ పాట ఉంటుందని.. ప్రస్తుతం అది షూటింగ్ దశలో ఉందని తెలుస్తోంది.

NTR Hrithik Roshan Power Packed Dance With 500 Dancers In War 2 Movie: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ (NTR), బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న అవెయిటెడ్ మూవీ 'వార్ 2' (War 2). అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతుండగా.. ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. మూవీలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య డ్యాన్స్ సీక్వెన్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పాట కోసమే ఏకంగా 500 మంది డ్యాన్సర్లను రంగంలోకి దించినట్లు సమాచారం. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఓ సరికొత్త గీతాన్ని ఎన్టీఆర్, హృతిక్ కోసం రూపొందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
యష్‌రాజ్ స్టూడియోస్‌లో వేసిన సెట్‌లో ప్రస్తుతం ఈ సాంగ్ షూటింగ్ జరుగుతోందని వార్తలు వస్తున్నాయి. ప్రీతమ్ మ్యూజిక్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ పాటను బాస్కో మార్టిస్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. ఈ క్రేజీ న్యూస్ నిజమైతే 500 మంది డ్యాన్సర్ల మధ్య ఎన్టీఆర్, హృతిక్ డ్యాన్స్‌తో థియేటర్లు దద్దరిల్లుతాయని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
'రా' ఏజెంట్‌గా ఎన్టీఆర్..?
హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం 'వార్'. స్పై థ్రిల్లర్ తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. దీనికి సీక్వెల్‌గా 'వార్ 2' (War 2) రూపొందుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. ఎన్టీఆర్ రా ఏజెంట్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఏజెంట్ పాత్రలన్నింటి కంటే ఈ మూవీలో ఆయన రోల్ డిఫరెంట్‌గా ఉండనున్నట్లు సమాచారం. ఈ సినిమా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.
Also Read: 'ది ప్యారడైజ్'లో ల****.. డైలాగ్స్‌పై విమర్శలు - ఫ్యాన్స్ వర్సెస్ నెటిజన్స్
ఈ షూటింగ్ పూర్తైతే ప్రశాంత్ నీల్ ప్రాజెక్టులో..
'వార్ 2' (War 2) మూవీ షూటింగ్ పూర్తైతే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ చిత్రం షూటింగ్‌లో భాగం కానున్నారని తెలుస్తోంది. 'ఎన్టీఆర్‌నీల్' (NTRNeel) వర్కింగ్ టైటిల్‌తో ముస్తాబవుతోన్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers), ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవల్ అని.. ఇప్పటివరకూ ఇండియన్ సినిమాలో చూడని యునిక్ స్క్రిప్ట్ అంటూ నిర్మాత రవిశంకర్ తాజాగా ఓ ఈవెంట్‌లో తెలిపారు. ఎన్టీఆర్ నీల్ మూవీకి ఆకాశమే హద్దు అని.. సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లు రాబడుతుందో మీ ఊహకు కూడా అందదని అన్నారు. 'ఇది హై ఓల్టేజ్ యాక్షన్‌తో కూడిన డ్రాగన్. ఎన్టీఆర్ నీల్ ఫిల్మ్ వేరే లెవల్. డ్రాగన్ టైటిల్ హిట్ కావడం ఇంకా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ ఆ పెద్ద డ్రాగన్ వచ్చి మొత్తాన్ని చుట్టేస్తుంది.' అంటూ కామెంట్ చేయడంతో ఈ సినిమా టైటిల్ డ్రాగన్ అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
Also Read: నితిన్ 'రాబిన్ హుడ్'లో క్రికెటర్ డేవిడ్ వార్నర్ - ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో తెలుసా?





















