News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

తమిళ దర్శకుడితో నాని సినిమా?

టాలీవుడ్ హీరో నాని త్వరలో 'డాన్' ఫేమ్ శిబి చక్రవర్తి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. 'స్కంధ' నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ చేస్తున్నారని అంటున్నారు.

FOLLOW US: 
Share:

'దసరా' సినిమాతో నేచురల్ స్టార్ నాని తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. హిట్టు కొట్టిన జోష్ లో ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తున్నాడు. ప్రస్తుతం శౌర్యువ్‌ అనే కొత్త డైరెక్టర్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ, #Nani30 సినిమా చేస్తున్నాడు. ఇదే క్రమంలో నాని మరికొన్ని ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యాడు. ఇందులో భాగంగా ఓ తమిళ దర్శకుడిని టాలీవుడ్ కు తీసుకురానున్నట్లు టాక్ నడుస్తోంది. 

నాని 30వ సినిమా తర్వాత 'అంటే సుందరానికీ' ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. RRR నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తారని సమాచారం. అయితే సెకండాఫ్ స్టోరీ ఇంకా సెట్ కాకపోవడంతో, నాని మరో కొత్త ప్రాజెక్టు కూడా టేకప్ చేసే ఆలోచనలో వున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో ఓ చిత్రానికి కమిట్ అయ్యాడని, దీని కోసం కోలీవుడ్ డైరెక్టర్ శిబి చక్రవర్తిని తీసుకుంటున్నారని నివేదికలు పేర్కొన్నాయి. 

Also Read: తెలుగు వద్దు, తమిళం ముద్దు - టాలీవుడ్‌లో కోలీవుడ్ సంగీత దర్శకుల హవా, ఈ మూవీలకు తంబీలదే మ్యూజిక్కు!

ఇటీవల కాలంలో నిర్మాత శ్రీనివాస చిట్టూరి తన బ్యానర్ లో పలు క్రేజీ కాంబినేషన్లు సెట్ చేస్తున్నారు. అక్కినేని నాగార్జున, రామ్ పోతినేని వంటి హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో నానితో మూవీ ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇప్పటికే లింగుస్వామి, వెంకట్ ప్రభు వంటి తమిళ దర్శకులతో సినిమాలు నిర్మించిన ఆయన.. ఇప్పుడు శిబి చక్రవర్తి - నాని కాంబోలో ఓ ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నారని అంటున్నారు. 

శివ కార్తికేయన్ తో కలిసి 'కాలేజ్ డాన్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన శిబి చక్రవర్తి.. ఇంత వరకూ తన నెక్స్ట్ చిత్రాన్ని అనౌన్స్ చేయలేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ తో ఓ మూవీ చేయనున్నారని, లైకా ప్రొడక్షన్ లో ఈ ప్రాజెక్ట్ ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ దీని గురించి అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. అయితే ఇప్పుడు నానితో సినిమా కోసం శిబి ని తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. ఇందులో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.

జులై 13న #Nani30 టైటిల్ & ఫస్ట్‌ లుక్‌:
ఇదిలా ఉంటే జులై 13న #Nani30 అప్డేట్ తో రానున్నట్లు నాని తాజాగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అది ఏంటనేది చెప్పనప్పటికీ, ఫస్ట్‌ లుక్‌ తో పాటుగా టైటిల్ అనౌన్స్ మెంట్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఎమోషనల్‌ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'హలో డాడీ', 'హలో నాన్న', 'హాయ్ నాన్న' 'హాయ్ డాడీ' వంటి టైటిల్స్ ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరి వీటిల్లో ఏది ఫిక్స్ చేస్తారో చూడాలి.

నాని 30 సినిమాలో 'సీతారామం' ఫేం మృణాళ్‌ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. కూతురి పాత్రలో బేబి కైరా ఖన్నా కనిపించనుంది. 'దసరా'లో రా అండ్ మాస్ లుక్ తో అందరినీ ఆశ్చర్యపరిచిన నాని.. ఈసారి క్లాస్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన అనౌన్స్‌మెంట్‌ వీడియో ఆకట్టుకుంది. వైరా ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి (CVM), విజేందర్‌ రెడ్డి తీగల, మూర్తి కేఎస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'హృదయం' ఫేం హెశమ్‌ అబ్దుల్‌ వహబ్‌ సంగీతం సమకూరుస్తుండగా, సాను జాన్‌ వర్గీస్‌ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. 2023 డిసెంబర్ 21న ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు.

Also Read: సుందరం మాస్టర్ ఇంగ్లీష్ కష్టాలు - ఆ ఊరిలో 'వైవా' హర్షను ఆడేసుకున్నారుగా!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Published at : 12 Jul 2023 09:10 AM (IST) Tags: Nani 30 Nani Don Director Cibi Chakravarthi Nani New Movie

ఇవి కూడా చూడండి

వరుణ్ తేజ్ మూవీకి భారీ డీల్ -  'ఆపరేషన్ వాలెంటైన్' నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా?

వరుణ్ తేజ్ మూవీకి భారీ డీల్ - 'ఆపరేషన్ వాలెంటైన్' నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా?

Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ

Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ

BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

BhagavanthKesari:  గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

Vijay Deverakonda - Rashmika: డార్లింగ్ అంటూ దేవరకొండ ట్వీట్ - నువ్వు ఎప్పటికీ బెస్ట్ అంటూ రష్మిక రిప్లై!

Vijay Deverakonda - Rashmika: డార్లింగ్ అంటూ దేవరకొండ ట్వీట్ - నువ్వు ఎప్పటికీ బెస్ట్ అంటూ రష్మిక రిప్లై!

Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, తమిళోడివి అంటూ వేదికపై ఉండగానే..

Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, తమిళోడివి అంటూ వేదికపై ఉండగానే..

టాప్ స్టోరీస్

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Kotamreddy : చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత - కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !

Kotamreddy :  చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత -  కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !