Ajith Birthday: స్టార్ హీరో అజిత్ బర్త్‌డే - ఊహించని గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్ చేసిన శాలిని, వీడియో వైరల్
Ajith Birthday: తమిళ్ స్టార్ హీరో అజిత్ బర్త్‌డే సందర్భంగా ఆయన భార్య శాలిని ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. మే 1న అజిత్ పుట్టిన రోజు. నేటితో ఆయన 53వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు.
Shalini Surprise Gift to Ajith Kumar: తమిళ్ స్టార్ హీరో అజిత్ బర్త్‌డే సందర్భంగా ఆయన భార్య శాలిని ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. మే 1న అజిత్ పుట్టిన రోజు. నేటితో ఆయన 53వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. తమిళ నాట అయితే ఫ్యాన్స్ అంతా ఓ పండగలా అజిత్ బర్త్‌డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో అజిత్ పుట్టిన రోజును ఆయన భార్య, నటి శాలిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. అంతేకాదు ఈ సందర్భంగా భర్త అజిత్‌కు ఊహించని గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇంతకి ఆ గిఫ్ట్ ఏంటంటే. అజిత్ నటుడు మాత్రమే మంచి రేసర్ కూడా అనే విషయం తెలిసిందే. బైక్,కారు రేసింగ్ పోటీలోనూ పాల్గొని అవార్డ్సు కూడా అందుకున్నాడు. ఈ క్రమంలో ఆయనకు ఇష్టమైన కాస్ట్లీ స్పోర్ట్స్ డుకాటీ బైక్‌ను భర్తకు బహుమతిగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను అజిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మురిసిపోతున్నారు. 'తల' అజిత్‌కు శాలిని మేడం స్పోర్ట్స్ బైక్ గిఫ్ట్ ఇచ్చారని, ఆయన బర్త్‌డే చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారంటూ అభిమానులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అజిత్‌కు శాలిని ఇచ్చిన బైక్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇప్పటికే అజిత్ దగ్గర రకరకాల స్పోర్ట్స్, రేసింగ్ బైక్స్ కలెక్షన్ ఉన్నాయి. ఇప్పుడు ఆయన రేసింగ్ గ్యాలరీలో డుకాటీ బైక్ కూడా యాడ్ అయ్యింది.
Shalini Ajith gifted Ducati bike for Thala #Ajith 🥰#HBDAjithKumar 🎉🎂#VidaaMuyarchi .. #AjithKumar#GoodBadUgly #Ajithkumar𓃵 pic.twitter.com/aWYnXAI5CU
— 𒆜Harry Billa𒆜 (@Billa2Harry) May 1, 2024
కాగా అజిత్ చివరిగా 'తునివు' మూవీలో నటించారు. ఈ సినిమాను తెలుగులో 'తెగింపు' పేరుతో విడుదల చేశారు. తమిళనాట ఈ చిత్రం భారీ విజయం సాధించింది. తెలుగులోనూ ఈ సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం అజిత్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి మాగిజ్ తిరుమనేని డైరెక్షన్‌లో 'విడా ముయార్చి' అనే మూవీ ఉంది. ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటుంది. మరొకటి ద్విభాష చిత్రం. ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇటీవల దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ సినిమాకు'గుడ్ బ్యాడ్ అగ్లీ' అని టైటిల్ ఫిక్స్ చేశారు. దీనిని అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించనున్నారు.
ఇటీవల అజిత్‌కు యాక్సిడెంట్‌కు గురైన సంగతి తెలిసిందే. విడా ముయార్చి సినిమా షూటింగ్ చేసిన ఓ స్టంట్ సీన్‌లో ఆయన ప్రమాదానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో అజిత్ మేనేజర్ షేర్ చేస్తూ అజిత్‌కు ప్రాణాపాయం తప్పిందని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేశారు. ఈ వీడియోలో అజిత్ కారు నడుపుతున్న యాక్షన్ సీన్‌ని షూట్ చేస్తున్నారు. ఈ క్రమంలో కారు అదుపుతప్పడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో వెంటనే స్పందించిన సిబ్బంది కారు దగ్గరికి వెళ్లి అజిత్ సహా మరో నటుడిని బయటకు తీసి ఆస్పత్రికి తరలిచారు. దీనికంటే ముందు అజిత్‌కు బ్రెయిన్ సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. అజిత్ చెవి నుంచి బ్రెయిన్‌కు కనెక్ట్ అయ్యి ఉన్న ఒక నరం వాపు వల్ల తనకు సర్జరీ జరిగిందని ఆయన మేనేజర్ సురేశ్ చంద్ర వెల్లడించారు. అంతేకాదు ఇది బ్రెయిన్ సర్జరీ కాదని, సాధారణ చికిత్స అని అతడు స్పష్టం చేశారు.
Also Read: మే డే, 22 ఏళ్ల క్రితం వీడియో షేర్ చేసిన చిరంజీవి - ఆకట్టుకుంటున్న స్పెషల్ పోస్ట్