హనుమంతుడు దేవుడు కాదు, భక్తుడు మాత్రమే: ‘ఆదిపురుష్’ డైలాగ్ రైటర్
ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆదిపురుష్'.. తీవ్ర దుమారం చెలరేగుతోంది. ఈ సందర్భంగా మాటల రచయిత మనోజ్ ముంతాషిర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. హనుమాన్ కేవలం భక్తుడేనని, దేవుడు కాదనడం వైరల్ గా మారింది
Manoj Muntashi: ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన 'ఆదిపురుష్(Adi Purush)' సినిమా విడుదలైనప్పటి నుంచి వార్తల్లో నిలుస్తోంది. 'ఆదిపురుష్'.. రామాయణాన్ని అపహాస్యం చేసేలా ఉందని విమర్శలు వెల్లువెత్తుతోన్న వేళ.. ఇది కేవలం రామాయణం నుంచి ప్రేరణ పొందింది మాత్రమే తీశారనని మాటల రచయిత మనోజ్ ముంతాషిర్(Manoj Muntashir) తమ వాదనను వినిపించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో అతను హనుమంతుడు 'భగవాన్ నహీ భక్త్ హై' అని చెప్పడాన్ని వినవచ్చు. ఇది ఇప్పుడు అభిమానులకు విపరీతమైన కోపం తెప్పిస్తోంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మనోజ్ ముంతాషిర్.. 'ఆదిపురుష్' సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హనుమంతుడు దేవుడు కాదని పేర్కొన్నాడు. హనుమంతుడు దేవుడు కాదు, కేవలం భక్తుడు. మనం వారిని దేవుడిగా చేసుకున్నాం అని తెలిపారు. సినిమాలోని తన డైలాగ్‌ను సమర్థిస్తూ, శ్రీరాముడిలా హనుమంతుడు కమ్యూనికేట్ చేయలేడని, రాముడిలా తాత్వికంగా మాట్లాడలేడు అని మనోజ్ ముంతాషిర్ చెప్పాడు.
మనోజ్ ముంతాషీర్ చేసిన ఈ కాంట్రవర్శియల్ ప్రకటన అభిమానులకు కోపం తెప్పిస్తోంది. ఆయనపై మండిపడుతూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతను ఇంటర్వ్యూలు ఇవ్వడం మానేయాలని వారు కోరుతున్నారు. ఆ ఇంటర్వ్యూ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. "అతను చేయవలసిన మొదటి పని ఇంటర్వ్యూలు ఇవ్వడం మానేయడం" అంటూ ఒకరు కామెంట్ చేశారు. "మీరే చెక్ చేసుకోండి" అని ఒకరు అనగా.."హనుమాన్ శివుని అవతారం. ఈ తెలివితక్కువ వ్యక్తికి మెదడు లేదు. ఇతను రామాయణానికి డైలాగ్స్ రాశాడట" అంటూ మరొకరు సెటైరికల్ కామెంట్ చేశారు. "ఎవరైనా దయచేసి అతనిని మాట్లాడడం ఆపేయమనండి" అని మరొక యూజర్ వ్యాఖ్యానించారు.
ఓం రౌత్ రూపొందించిన 'ఆదిపురుష్'లో హనుమంతుని 'డైలాగ్స్'వల్ల మనోజ్ ముంతాషిర్ హైలెట్ అయ్యాడు. సినిమాలోని డైలాగ్‌లను రివైజ్ చేయాలన్న ఆడియెన్స్ సలహాతో ఇటీవలే.. దాన్ని పరిగణలోకి తీసుకోనున్నట్టు క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలో మేకర్లు చెప్పిన డైలాగ్‌లను నెటిజన్లు మరోసారి తిరగేస్తున్నారు. ఈ చేంజ్ లేదా చేర్చబడిన డైలాగ్స్ తో మరో కొద్ది రోజుల్లో థియేటర్‌లలో 'ఆదిపురుష్'ను చూడనున్నామని నెటిజన్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
బెదిరింపు కాల్స్ వస్తున్నాయి : మనోజ్ ముంతాషిర్
ఇక 'ఆదిపురుష్' సినిమాకు మాటలు రాసిన మనోజ్ ముంతాషిర్.. ఇటీవలే భద్రతను కోరుతూ ముంబై పోలీసు (Mumbai Police)లను ఆశ్రయించారు. త్వరలో ఈ సినిమాలోని డైలాగ్స్‌ను మార్చబోతున్నామని చెప్పినా వివాదం సద్దుమణిగేలా కనిపించడం లేదని మనోజ్ ముంతాషిర్ పోలీసులకు వివరించినట్లు తెలుస్తోంది. ఈ సమయంలోనే తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నానయని చెప్పాడని సమాచారం. ఈ నేపథ్యంలో వివాదం ముగిసేవరకు మనోజ్ ముంతాషిర్‌కు రక్షణ కల్పిస్తామని ముంబయి పోలీసులు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ‘ఆదిపురుష్’ విమర్శలపై ఓం రౌత్, ప్రభాస్‌లు ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్నారు. ఏదైనా మాట్లాడితే వివాదం అవుతుందనే ఉద్దేశంతో నిశబ్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.