అన్వేషించండి

Nayak Re-Release : మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - రీ రిలీజ్ కాబోతున్న 'నాయక్', ఎప్పుడంటే?

Naayak Re Release : రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా 'నాయక్' మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు.

Ram Charan’s “Nayak” to Re-Release : టాలీవుడ్ లో గత కొంతకాలంగా రన్ అవుతున్న రీ రిలీజ్ ట్రెండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న సినిమాలు, కల్ట్ క్లాసిక్ మూవీస్ ని 4K రెజల్యూషన్ తో మళ్లీ థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు నిర్మాతలు. హీరోల బర్త్డే స్పెషల్, ఏదైనా ఇతర ప్రత్యేక రోజుల్లో ఈ సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఆ మధ్య రీ రిలీజ్ సినిమాల హవా బాగా తగ్గిపోయింది. దాంతో ఇకనుంచి రీ రిలీజ్ ట్రెండ్ కి ఎండ్ కార్డు పడిందని అంతా అనుకున్నారు. కానీ అలా కాకుండా మళ్లీ కొద్ది రోజుల నుంచి థియేటర్స్ లో రీ రిలీజ్ సినిమాల సందడి మొదలైంది. సిద్ధార్థ్ నటించిన 'ఓయ్' ఇటివలే రీ రిలీజ్ అయ్యి భారీ రెస్పాన్స్ అందుకున్న విషయం తెలిసిందే. గతవారం రవితేజ 'కిక్' మూవీ కూడా రిలీజ్ అయింది. ఇక ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఓ బ్లాక్ బస్టర్ మూవీ రీ రిలీజ్ కి రెడీ అవుతోంది.

రామ్ చరణ్ బర్త్ డే కానుకగా 'నాయక్' రీ రిలీజ్

రామ్ చరణ్ కెరియర్ లో కమర్షియల్ గా భారీ సక్సెస్ అందుకున్న సినిమాల్లో 'నాయక్' కూడా ఒకటి. మాస్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2013 లో విడుదలై మంచి సక్సెస్ అందుకుంది. మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో అదరగొట్టేసాడు. దానికి తోడు బ్రహ్మానందం, జయప్రకాశ్ రెడ్డి కామెడీ.. కాజల్ అగర్వాల్, అమలాపాల్ గ్లామర్, థమన్ సంగీతం.. ఇవన్నీ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక మళ్ళీ ఇన్నేళ్లకు ఈ సినిమా రీ రిలీజ్ కి రెడీ అవుతోంది. రామ్ చరణ్ బర్త్ డే కానుకగా మార్చి 23న ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు.

కన్ఫర్మ్ చేసిన నిర్మాత నట్టి కుమార్

'నాయక్' రీ రిలీజ్ గురించి నిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతూ.." మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజుని పురస్కరించుకుని కాస్త ముందుగా మార్చి 23న నాయక్ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నాం. ఇందులో రామ్ చరణ్ తన పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేశారు. హీరోయిన్లు సైతం పోటీపడి మరి నటించారు. మిగతా పాత్రధారులు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సినిమాలో అన్ని అంశాలు ఉన్నాయి. కామెడీకి కూడా పెద్దపీట వేశారు. తమన్ సంగీతం అందించిన ప్రతీ పాట హైలెట్ గా ఉంటుంది. అలాగే చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ మరో ఆకర్షణగా నిలుస్తుంది" అని అన్నారు.

చరణ్ బర్త్ డే కి మరో సర్ప్రైజ్

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న 'గేమ్ చేంజర్' సినిమా నుంచి చెర్రీ బర్త్డే సందర్భంగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. 'జరగండి జరగండి' అంటూ సాగే ఈ పాటని మార్చి 27న విడుదల చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుందని అంటున్నారు. నిజానికి ఈ 'జరగండి' అనే ఆడియో సాంగ్ రిలీజ్ కి ముందే ఎప్పుడో సోషల్ మీడియాలో లీక్ అయింది. దాంతో గత ఏడాది దీపావళికి ఈ పాటను రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఆరోజు కూడా రిలీజ్ చేయకుండా పోస్ట్ పోన్ చేశారు. అయితే ఈసారి రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మూవీ టీమ్ కచ్చితంగా 'జరగండి' సాంగ్ ని రిలీజ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది.

Also Read : నా భర్త ప్రోత్సాహంతోనే అలాంటి సీన్‌లో నటించాను, చాలా బాధేసింది: శరణ్య ప్రదీప్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Revanth Reddy: మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Revanth Reddy: మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
OLA EV Showroom: ఓలా ఈవీ షోరూంకు చెప్పులదండ - కస్టమర్ వినూత్న నిరసన
ఓలా ఈవీ షోరూంకు చెప్పులదండ - కస్టమర్ వినూత్న నిరసన
Bloody Beggar Review: బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
Telangana: కేటీఆర్ అరెస్టు ఖాయమా ? ఆ రూ.55 కోట్లు ఎక్కడికి వెళ్లాయి ?
కేటీఆర్ అరెస్టు ఖాయమా ? ఆ రూ.55 కోట్లు ఎక్కడికి వెళ్లాయి ?
Minister Atchannaidu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
Embed widget