Sharanya Pradeep: నా భర్త ప్రోత్సాహంతోనే అలాంటి సీన్‌లో నటించాను, చాలా బాధేసింది: శరణ్య ప్రదీప్
Sharanya Pradeep : 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' సినిమాలో న్యూ సీన్ చేయడంపై నటి శరణ్య తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Actress Sharanya Pradeep Interview : 'కలర్ ఫోటో' హీరో సుహాస్ నటించిన 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు' మూవీ రీసెంట్ గా విడుదలై మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో హీరో సోదరిగా నటించిన శరణ్య ప్రదీప్ తన నటనతో ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. సినిమాలో హీరో కి సమానంగా ఉండే పాత్రలో నటించి అందరి ప్రశంసలు అందుకుంది. 'ఫిదా' సినిమాలో హీరోయిన్ అక్కగా నటించి లైమ్ లైట్ లోకి వచ్చిన శరణ్య ఇప్పుడు 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు' సినిమాతో మరింత క్రేజ్ తెచ్చుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శరణ్య 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు' సినిమాలో నగ్న సన్నివేశంలో నటించడంపై పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
ఆ సీన్ చేసినప్పుడు భయం వేసింది.. కానీ నా భర్త ఎంతో సపోర్ట్ చేశారు
"సినిమాలో న్యూడ్ సీన్ గురించి డైరెక్టర్‌ను అడిగాను. ఆయన తాట్ ప్రాసెస్ ఆయన చెప్పారు. చెప్పడం వరకు ఓకే.. కాని తీసిన తర్వాత మనం చూసినట్టే ఆడియన్స్ చూడాలని లేదు. దాన్ని ఆడియన్స్ ఎలా తీసుకుంటారో అని భయపడ్డా. జనాలు దాన్ని వీరే విధంగా తీసుకుంటారేమో అని ఆందోళన చెందా. ఆ తర్వాత నా భర్తను కూడా అడిగాను. అప్పుడు ఆయన ఓకే, డైరెక్టర్‌కు ఎలా తీయాలో క్లారిటీ ఉన్నప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు అని నన్ను ఎంతో సపోర్ట్ చేశారు. తను ఈ సీన్‌కు సపోర్ట్ చేయకపోతే అసలు ఈ ప్రాజెక్ట్ ఏమయ్యేదో, డైరెక్టర్ ఆ సీన్‌ను తీసేవాడు కాదేమో? చివరికి ఏమయ్యేదో తెలియదు కానీ మా హస్బెండ్ సపోర్ట్ చేయడం, ఆడియన్స్ కూడా వేరే విధంగా తీసుకోకపోవడం వల్లే ఈరోజు సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది" అని చెప్పింది.
ఆ విషయంలో బాధేసింది
సినిమా రిలీజ్ ముందు వరకు ఆ సీన్ విషయంలో కొంత టెన్షన్ ఉండేది. కానీ ప్రీమియర్స్ చూసిన తర్వాత ఆ టెన్షన్ నుంచి పూర్తిగా బయటికి వచ్చేసా. ఎవరు కూడా నా సీన్ ని వల్గర్ గా, నెగిటివ్ గా చూడడం జరగలేదు. దాంతో నాకు చాలా సంతోషం అనిపించింది. సో టోటల్ గా నా పాత్ర విషయంలో కంప్లీట్ సాటిస్ఫై అయ్యాను. అయితే కొన్ని చానల్స్ ఆ సీన్‌ను వేరే రకంగా థంబ్‌నెయిల్ పెట్టి రాస్తున్నారు. నిజానికి ఆ వీడియో ఓపెన్ చేస్తే ఏం ఉండదు కానీ ఆ తంబ్ నెయిల్ చూస్తే ఆడియన్స్‌కు వ్యూ మారిపోతుంది. అది కొంచెం బాదేసింది. సినిమాలో అలా చేసిందానికి కూడా బాధపడలేదు. ఆ సీన్ చూసినప్పుడు నాకే సెకండ్ థాట్ రాలేదు. కానీ మనుషులకు ఇన్ఫినిటీ థర్డ్స్ వచ్చేలా రాసి థంబ్ నెల్స్ పెడుతున్నారు. ఈ డిస్కషన్ నాకు, మా హస్బెండ్ మధ్య కూడా వచ్చింది. ఆయన మాత్రం అలాంటి లైట్ తీసుకో అని చెప్పారు. దాంతో నేను కూడా లైట్ తీసుకున్నా" అంటూ చెప్పుకొచ్చింది.
Also Read : వెంకటేష్ 'సైంధవ్' టీవీలోకి వచ్చేస్తోంది - ఎప్పుడంటే?