Game Changer: 'గేమ్ ఛేంజర్'లో ఒక్క పాటకు రూ. 20 కోట్లా - శంకర్ మూవీ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి!
రామ్ చరణ్ తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’పై దేశ వ్యాప్తంగా భారీగా అంచనాలు నెలకొన్నాయి. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలోని పాటలను భారీ బడ్జెట్ తో కళ్లు చెదిరేలా తెరకెక్కిస్తున్నారట.
Game Changer Songs: ‘RRR’ సినిమా తర్వాత రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. భారత్ తో పాటు ఇతర దేశాల్లోనూ ఆయన ఫ్యాన్స్ ను తయారు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ‘భారతీయుడు 2’తో పాటు ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టినా, ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. లేట్ గా వచ్చినా లేటెస్టుగా వస్తుందంటున్నారు చెర్రీ అభిమానులు.
ఒక్క పాటకు రూ. 20 కోట్లు ఖర్చు
శంకర్ సినిమాల్లో పాటలు అద్భుతంగా ఉంటాయి. వెండితెరపై ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఎన్ని రోజులైనా ఆయన తెరకెక్కించిన పాటలు ప్రేక్షకుల మదిలో అలాగే నిలిచిపోతాయి. ‘గేమ్ ఛేంజర్’ మూవీ సాంగ్స్ విషయంలోనూ శంకర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోని ఓ మెలోడీ సాంగ్ కోసం ఏకంగా రూ. 20 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కియారా అద్వానీ, రామ్ చరణ్ పైన పాటను చిత్రీకరించారట. అద్భుతమైన లొకేషన్స్ లో తెరకెక్కించిన ఈ పాట గ్రాండ్ విజువల్ ట్రీట్ అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఇంకా విశేషం ఏంటంటే.. ఈ సినిమాలోని పాటల కోసమే సుమారు రూ. 80 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. తమన్ అందించిన మ్యూజిక్ సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.
ప్రేక్షకులను ఆకట్టుకున్న రెండు సాంగ్స్
ఇప్పటికే ‘గేమ్ ఛేంజర్’కు సంబంధించి రెండు పాటలను మేకర్స్ విడుదల చేశారు. అందులో ఒకటి ‘జరగండి’ సాంగ్ కాగా, మరొకటి ‘రా మచ్చా’. ఈ రెండు పాటలు చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు నెలకొల్పాయి. ఇంకా ఈ సినిమాలో మూడు పాటలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేసిన తెరకెక్కించిన మెలోడీ సాంగ్ ను వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుక మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. మిగతా రెండు పాటలను కూడా సినిమా విడుదలయ్యే సరికి రిలీజ్ చేయనున్నారు.
పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ‘గేమ్ ఛేంజర్’
‘గేమ్ ఛేంజర్’ సినిమాలో బాలీవుడ్ నటి కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నది. పొలిటికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కుతోంది. ఈ సినిమాలో శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, అంజలి, సునీల్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. 'గేమ్ ఛేంజర్'ను అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, 'దిల్' రాజు ప్రొడక్షన్స్ సంస్థలపై 'దిల్' రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్, ఈ సినిమా అదే స్థాయిలో విజయాన్ని అందుకుంటుందని మేకర్స్ వెల్లడించారు.
Read Also: కంగనా ‘ఎమర్జెన్సీ’కి సెన్సార్ క్లియరెన్స్... మరీ అన్ని కట్స్ అంటే అసలు మ్యాటర్ ఉంటుందా?