Most Sixes In ODIs Rohit Sharma: సిక్సర్ల కింగ్ రోహిత్ శర్మ.. వన్డేలలో అత్యధిక సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డు
Rohit Sharma Most Sixes In ODIs | రోహిత్ శర్మ 60వ అర్ధ సెంచరీ సాధించాడు. వన్డేలలో అత్యధిక సిక్సర్లు కొట్టి షాహిద్ అఫ్రిది రికార్డును బద్దలు కొట్టాడు.

Most Sixes In ODIs | రాంచీ: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఇప్పుడు వన్డే ఇంటర్నేషనల్స్ (ODI)లో చరిత్రలో అరుదైన ఘనత సాధించాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా నిలిచాడు. రోకో వన్డే కెరీర్ ఏంటని ప్రశ్నించే వారికి దిగ్గజాలు వారి బ్యాటుతోనే సమాధానం చెబుతున్నారు. కుర్రాళ్ల కంటే వేగంగా, నిలకడగా పరుగులు సాధిస్తున్నారు.
ఆఫ్రిది రికార్డు బద్దలు.. వన్డేల్లో నెంబర్ వన్ బ్యాటర్ రోహిత్ శర్మ..
రాంచీలోని JSCA ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఈ ఘనత సాధించాడు. 19.4వ బంతిని రోహిత్ సిక్సర్ కొట్టాడు. మార్కో జాన్సన్ వేసిన బంతిని సిక్సర్ గా మలచడంతో ఇది రోహిత్ కెరీర్ లో 352వ సిక్స్. తద్వారా షాహిద్ ఆఫ్రిది రికార్డును బద్దలుకొడుతూ భారత ఓపెనర్ సిక్సర్ల కింగ్ గా మారాడు.
సిక్సర్ల కింగ్ హిట్ మ్యాన్..
అభిమానులు ముద్దుగా పిలుచుకునే 'హిట్‌మన్' తొలి వన్డేలో సఫారీ బౌలర్ మార్కో జాన్సెన్‌పై తన 352వ సిక్స్ కొట్టాడు. ఇటీవల జరిగిన IND vs SA టెస్ట్ సిరీస్‌లో భారత బ్యాటింగ్ లైనప్‌ను బాగా ఇబ్బంది పెట్టిన జాన్సెస్ బౌలింగ్ లో బౌండరీ దాటించి వన్డే చరిత్రలో అరుదైన బ్యాటర్ అయ్యాడు.
🚨 Record Alert 🚨
— BCCI (@BCCI) November 30, 2025
Rohit Sharma now holds the record for most sixes in ODI cricket history! 🙌
TAKE. A. BOW 🙇♂️
Updates ▶️ https://t.co/MdXtGgRkPo#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/apcmS1UACG
14.2 ఓవర్
సుబ్రాయెన్ బౌలింగ్ లో రోహిత్ వరుసగా రెండో సిక్సర్ కొట్టాడు. దాంతో రోహిత్ ఇప్పుడు వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన అఫ్రిది రికార్డును సమం చేశాడు. డీప్ మిడ్-వికెట్ వైపు నెయిల్ స్లాగ్-స్వీప్‌తో సిక్సర్ బాదేశాడు.
14.1 ఓవర్
సుబ్రాయెన్ బౌలింగ్ లో ఓవర్ తొలి బంతిని రోహిత్ సిక్సర్ గా మలిచాడు. ఆఫ్ స్టంప్ నుండి బాగా దూరంగా వెళ్తున్న బంతిని రోహిత్ స్లాగ్-స్వీప్‌లోకి చేరుకుని మిడ్ వికెట్ మీదుగా సిక్స్ కొట్టాడు. వన్డేల్లో రోహిత్ కిది 350వ సిక్స్.
ODIలలో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్లు
352 - రోహిత్ శర్మ (దక్షిణాఫ్రికాతో తొలి వన్డే వరకు)
351 - షాహిద్ అఫ్రిది, పాకిస్తాన్
331 - క్రిస్ గేల్, వెస్టిండీస్
270 - సనత్ జయసూర్య, శ్రీలంక
229 - MS ధోని, భారత్
ఈ మ్యాచులో హిట్ మ్యాన్ తన ఫాం కొనసాగించాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన చివరి రెండు వన్డేలో కీలక ఇన్నింగ్సులు ఆడిన రోహిత్ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలోనూ వరుస హాఫ్ సెంచరీతో రాణించాడు. కేవలం 43 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో ఔటయ్యాడు. మార్కో జాన్సెన్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 51 బంతుల్లో 57 పరుగులు చేసి రెండో వికెట్ రూపంలో హిట్ మ్యాన్ నిష్క్రమించాడు. అయితే కోహ్లీతో కలిసి రెండో వికెట్ కు శతక (136 పరుగుల) భాగస్వామ్యం నెలకొల్పాడు.





















