IND vs SA 1st ODI: వరుసగా 19వ టాస్ ఓడిన భారత్.. పంత్‌కు నో ఛాన్స్.. తెలుగు క్రికెటర్లకు తప్పని నిరాశ
భారత్ దక్షిణాఫ్రికా మొదటి వన్డే రాంచీలో నవంబర్ 30న మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం అవుతుంది.

IND vs SA 1st ODI Live Streaming: రాంచీ వేదికగా జరగనున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాంతో టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది. వాస్తవానికి ఈ పిచ్ మీద టాస్ నెగ్గితే కచ్చితంగా బౌలింగ్ తీసుకుంటారు. ఛేజింగ్ చేసే జట్టుకు కలిసొస్తుంది. సెకండ్ ఇన్నింగ్సులో బౌలర్లకు పిచ్ నుంచి సహకారం అందదు.
నేడు భారత్, దక్షిణాఫ్రికా మధ్య ODI సిరీస్ ప్రారంభం అవుతుంది. టెస్ట్ సిరీస్‌లో నిరాశపరిచిన తర్వాత టీమ్ ఇండియా తిరిగి పుంజుకోవాలని ఎదురుచూస్తోంది. గిల్ గాయం కారణంగా దూరం కావడంతో KL రాహుల్ ODIలకు తాత్కాలిక కెప్టెన్సీ చేపట్టాడు. అయితే భారత్ వరుసగా 19వ వన్డేలో టాస్ ఓడిపోయింది. 2023 World Cup final నుంచి టీమిండియా వరుస వన్డే మ్యాచులలో టాస్ ఓడిపోతుంది.
🚨 Toss 🚨#TeamIndia have been put into bat first.
— BCCI (@BCCI) November 30, 2025
Updates ▶️ https://t.co/MdXtGgRkPo#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/yjLCRSzARZ
దక్షిణాఫ్రికా ప్లేయింగ్ XI: ర్యాన్ రికెల్టన్, క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), మాథ్యూ బ్రీట్జ్కే, టోనీ డి జోర్జి, డెవాల్డ్ బ్రీవిస్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, ప్రెనెలన్ సుబ్రాయెన్, నాండ్రే బర్గర్, ఒట్నీల్ బార్ట్‌మన్
భారత్ ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, KL రాహుల్(కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ
ఈ వన్డేలో తెలుగు క్రికెటర్లకు నిరాశే ఎదురైంది. ఏపీకి చెందిన నితీష్ కుమార్ రెడ్డితో పాటు హైదరాబాదీ తిలక్ వర్మలకు తుది జట్లులో చోటు దక్కలేదు. డాషింగ్ బ్యాటర్ రిషబ్ పంత్ సైతం తుది జట్టులో చోటు దక్కించేకోలేకపోయాడు.
IND vs SA 1వ ODIని ప్రత్యక్షంగా చూడండి.
IND vs SA 1వ ODI నవంబర్ 30న రాంచీలో జరుగుతుంది, మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. రాంచీ భారత్‌కు మంచి వేదికగా ఉంది. అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేయనుండటం భారత్‌కు మైనస్ కానుంది. భారీ స్కోరు చేస్తే తప్పా గెలిచే అవకాశాలు తక్కువ. తొలి వన్డే మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్షంగా చూడవచ్చు. Jio Hotstar యాప్‌లో, వెబ్‌సైట్‌లో మ్యాచ్ లైవ్ వీక్షించదచ్చు.
హెడ్-టు-హెడ్ రికార్డ్: భారత్ vs దక్షిణాఫ్రికా
ఇప్పటివరకు జరిగిన 94 ODI సమావేశాలలో, భారత్ 40 మ్యాచ్‌లు గెలిచింది. అయితే దక్షిణాఫ్రికా 51 మ్యాచ్‌లు నెగ్గింది. మూడు మ్యాచ్‌లు ఫలితం తేలలేదు. ఎక్కువగా ప్రోటీస్ విజయాలు సాధించింది. అయితే రాంచీ స్లో పిచ్.. స్పిన్-అనుకూలం. భారత్ తమ రికార్డును మెరుగుపరచుకోవాలని చూస్తుంది.
యువ ప్రతిభకు గొప్ప అవకాశం
శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ వంటి సీనియర్ ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో, ఈ సిరీస్ యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్ వంటి వారికి నిరూపించుకోవడానికి అవకాశం ఇచ్చింది.





















