అన్వేషించండి

Emraan Hashmi: నా భార్య నన్ను వదిలేయాలని చూస్తోంది - ‘OG’ విలన్ ఇమ్రాన్ హష్మీ

Emraan Hashmi Wife: బాలీవుడ్ రొమాంటిక్ హీరో అయిన ఇమ్రాన్ హష్మీ ఎక్కువగా తన పర్సనల్ లైఫ్ గురించి బయటపెట్టడు. కానీ తాజాగా తన భార్య తనను వదిలేస్తా అని బెదిరిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు.

Emraan Hashmi about Wife Parveen Shahani: బాలీవుడ్‌లో రొమాంటిక్ హీరో అనగానే ఇప్పటికీ చాలామంది గుర్తొచ్చే పేరు ఇమ్రాన్ హష్మీ. ఈ హీరోలాగా మరే హీరో.. హీరోయిన్‌తో కెమిస్ట్రీని వర్కవుట్ చేయలేరని చాలామంది ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. అయితే ఆన్ స్క్రీన్ ఈ హీరో ఎలా ఉన్నా.. ఆఫ్ స్క్రీన్ మాత్రం పూర్తిగా ఫ్యామిలీ మ్యాన్ అనే విషయం కొంతమంది ప్రేక్షకులకు మాత్రమే తెలుసు. పర్వీన్ షాహనీని పెళ్లి చేసుకొని తనతో హ్యాపీగా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు ఇమ్రాన్. తన పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా బయటపెట్టని ఈ హీరో.. తాజాగా తన భార్య ఊరికే తనను వదిలేసి వెళ్లిపోతానని బెదిరిస్తుందని చెప్తూ.. దాని వెనుక కారణాన్ని కూడా బయటపెట్టాడు.

విడాకులు ఇస్తానని బెదిరింపులు..

2006లో ఇమ్రాన్ హష్మీ, పర్వీన్ షాహనీల పెళ్లి జరిగింది. వీరిద్దరూ పెద్దగా కలిసి బయట కనిపించరు. సోషల్ మీడియాలో కూడా ఎక్కువ యాక్టివ్‌గా ఉండరు. దీంతో అసలు వీరి పర్సనల్ లైఫ్ గురించి ప్రేక్షకులకు తెలిసే అవకాశం చాలా తక్కువ. ఎప్పుడో ఒకసారి తప్పా తాను కూడా ఎక్కువగా పర్సనల్ లైఫ్ గురించి ఇంటర్వ్యూలో మాట్లాడడు ఇమ్రాన్. అలాంటిది ఒక విషయంలో తన భార్య.. తనకు ఊరికే విడాకులు ఇస్తానని బెదిరిస్తుందంటూ బయటపెట్టాడు. పర్వీన్ అలా అనడానికి తన ఆహారపు అలవాట్లే కారణమని చెప్పుకొచ్చాడు ఇమ్రాన్. గత రెండేళ్లుగా తను ఒకే రకమైన ఆహారాన్ని తింటున్నానని రివీల్ చేశాడు. అది తన భార్యకు నచ్చడం లేదట.

తనకు నచ్చదు..

‘‘నా భార్య నన్ను వదిలేయాలని చూస్తోంది. ఎప్పుడూ వదిలేస్తా అని చెప్తుంది కానీ ఇప్పటివరకు వదలలేదు. తనకు నేను తినేది నచ్చదు. కానీ నేను మాత్రం ఇదే డైట్‌ను రెండేళ్ల నుండి ఫాలో అవుతున్నాను’’ అంటూ తన డైట్ గురించి చెప్పుకొచ్చాడు ఇమ్రాన్ హష్మీ. ఈ ఫన్నీ కారణాన్ని విని ప్రేక్షకులు నవ్వుకున్నారు. అదే డైట్‌ను తాను ఉదయం, మధ్యహ్నం, రాత్రి తింటానని తెలిపాడు. ఇదే విషయం పర్వీన్‌కు అస్సలు నచ్చదని అన్నాడు. మంచి ఫిజిక్ కోసం ఇదే డైట్‌ను ఫాలో అవ్వక తప్పడం లేదన్నాడు. సలాడ్, స్వీట్ పొటాటో, చికెన్ కీమా మాత్రమే తన డైట్‌లో ఉంటుందని, ఇంకా ఏ ఆహార పదార్థాలు తాను తినను అని తెలిపాడు ఇమ్రాన్.

తెలుగులో డెబ్యూకు సిద్ధం..

ఒకప్పుడు బాలీవుడ్‌లో రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న ఇమ్రాన్ హష్మీ.. ఇప్పుడు విలన్‌గా మారాడు. గతేడాది సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘టైగర్ 3’లో భయంకరమైన విలన్ రోల్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంతే కాకుండా చాలామంది బాలీవుడ్ యాక్టర్లలాగా ఇమ్రాన్ కూడా తెలుగులో డెబ్యూకు సిద్ధమయ్యాడు. సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఓజీ’లో మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు ఇమ్రాన్. ఇప్పటికే ఈ సినిమా నుండి తన ఫస్ట్ లుక్ కూడా విడుదలయ్యింది. ఇందులో ఇమ్రాన్ రోల్ బాగుంటుందని ఇప్పటికే టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు ఇమ్రాన్ లీడ్ రోల్ చేసిన ‘షో టైమ్’ అనే వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది. 

Also Read: కేరళ సర్కార్ సరికొత్త ప్రయత్నం - ఏకంగా ‘ఓటీటీ’ యాప్‌ను లాంచ్ చేస్తున్న ప్రభుత్వం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chiranjeevi Rajyasabha:  రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
Avanthi Srinivas Resign To YSRCP: వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
Manchu Mohan Babu Attack News: మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
Sai Pallavi: సీత పాత్ర కోసం నాన్ వెజ్ మానేసిన సాయి పల్లవి? - లీగల్‌గా ఆన్సర్ ఇస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్
సీత పాత్ర కోసం నాన్ వెజ్ మానేసిన సాయి పల్లవి? - లీగల్‌గా ఆన్సర్ ఇస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sana Satish Babu TDP Rajyasabha | టీడీపీ రాజ్యసభకు పంపిస్తున్న ఈ వివాదాస్పద వ్యక్తి ఎవరంటే..? | ABP Desamగూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ ప్లేస్‌లో పవన్ కల్యాణ్కొడుకుతో గొడవ తరవాత హాస్పిటల్‌లో చేరిన మోహన్ బాబుతమిళనాడులో ఘోర ప్రమాదం, బస్‌ని ఢీకొట్టిన ట్రక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chiranjeevi Rajyasabha:  రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
Avanthi Srinivas Resign To YSRCP: వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
Manchu Mohan Babu Attack News: మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
Sai Pallavi: సీత పాత్ర కోసం నాన్ వెజ్ మానేసిన సాయి పల్లవి? - లీగల్‌గా ఆన్సర్ ఇస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్
సీత పాత్ర కోసం నాన్ వెజ్ మానేసిన సాయి పల్లవి? - లీగల్‌గా ఆన్సర్ ఇస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్
PF Withdraw: ATM నుంచి పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా! - ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌
ATM నుంచి పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా! - ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌
Tiger Attack In Kakinada District: కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో పెద్దపులి సంచారం- వణికిపోతున్న ప్రజలు
కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో పెద్దపులి సంచారం- వణికిపోతున్న ప్రజలు
Ponguleti Srinivas Reddy: ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
India Alliance YSRCP: మమతా బెనర్జీ నేతృత్వంలోకి ఇండియా కూటమి - చేరేందుకు వైఎస్ఆర్‌సీపీ సిద్దమని  సంకేతాలు ?
మమతా బెనర్జీ నేతృత్వంలోకి ఇండియా కూటమి - చేరేందుకు వైఎస్ఆర్‌సీపీ సిద్దమని సంకేతాలు ?
Embed widget