అన్వేషించండి

Kerala: కేరళ సర్కార్ సరికొత్త ప్రయత్నం - ఏకంగా ‘ఓటీటీ’ యాప్‌ను లాంచ్ చేస్తున్న ప్రభుత్వం

Kerala OTT App: కేరళ ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించి మొదటిసారి ఒక ఓటీటీ యాప్‌ను తన చేతుల మీదుగా లాంచ్ చేయడానికి సిద్ధమయ్యింది. దీనికోసం 60 మంది ప్యానెల్ సభ్యులను కూడా ఏర్పాటు చేసింది.

CSpace OTT App By Kerala Government: ప్రస్తుతం ఎంటర్‌టైన్మెంట్ లవర్స్ కోసం ఎన్నో ఓటీటీ యాప్స్ రెడీగా ఉన్నాయి. ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీ  థియేటర్ల కంటే ఓటీటీపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. అందుకే కేరళ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. సొంతంగా ఒక ఓటీటీ యాప్‌ను తయారు చేయడానికి సిద్ధమయ్యింది. మార్చి 7న ఈ యాప్‌ను లాంచ్ చేస్తున్నట్టు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. 

ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు ఇన్ఫర్మేషన్..

కేవలం కంటెంట్ ఉన్న కథలను అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించి ప్రతీ ఇండియన్ భాషకు సంబంధించిన ఇండస్ట్రీకి పోటీనిస్తోంది మాలీవుడ్. మలయాళం నుంచి తెలుగులోకి డబ్ అయిన చిత్రాలు.. ఇప్పటికే ప్రేక్షకాధరణతో దూసుకెళ్తున్నాయి. అంతేకాదు.. కొందరైతే ఏకంగా సబ్ టైటిల్స్‌తో మలయాళం సినిమాలు చూసేస్తున్నారు. అలా ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది కేరళ. అందుకే డిజిటల్ ఎంటర్‌టైన్మెంట్‌లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేయడానికి కేరళ సిద్ధమయ్యింది. ‘సీస్పేస్’ అనే ఓటీటీ యాప్‌ను స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే క్రియేట్ చేసి ఎంటర్‌టైన్మెంట్ లవర్స్ ముందుకు తీసుకురానుంది. ఈ యాప్‌లో ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుందని సమాచారం.

60 మందితో ప్యానెల్ ఏర్పాటు..

మార్చి 7 ఉదయం 9.30 గంటలకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేతుల మీదుగా ‘సీస్పేస్’ యాప్ లాంచ్ అవ్వనుంది. కైరళి థియేటర్‌లో జరగనున్న ఈ లాంచ్ కార్యక్రమానికి మంత్రి సజీ చెరియన్ కూడా హాజరు కానున్నారు. ఓటీటీ సెక్టార్ విషయంలో ఎదురవుతున్న సమస్యలకు సీస్పెస్ అనేది ఒక పరిష్కారాన్ని ఇస్తుందని కేరళ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (కేఎస్ఎఫ్డీసీ) చైర్మన్, డైరెక్టర్ షాజీ ఎన్ కరుణ్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. కేరళ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న కేఎస్ఎఫ్డీసీ.. ఈ ‘సీస్పేస్’ యాప్‌ను రన్ చేయనుంది. ఇప్పటికే ఈ యాప్‌లో పనిచేయడం కోసం కల్చరల్స్‌పై అవగాహన ఉన్న 60 మందిని సెలక్ట్ చేసింది కేఎస్ఎఫ్డీసీ.

ఆ ముగ్గురు సమ్మతిస్తేనే..

బెన్యమిన్, ఓవీ ఉషా, సంతోష్ శివన్, శ్యామప్రసాద్, సన్నీ జోసెఫ్, జియో బేబీ వంటి సీనియర్లతో ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది కేఎస్ఎఫ్డీసీ. వీరంతా కలిసి ‘సీస్పేస్’ యాప్‌ కార్యకలాపాలను చూసుకోనున్నారు. ఈ యాప్‌లో ఎలాంటి సమాచారం స్ట్రీమ్ అవ్వాలి అనేది పూర్తిగా ముగ్గురు వ్యక్తుల చేతుల్లో ఉంటుంది. ఇప్పటికే సీస్పేస్ లాంచ్ కోసం మొదటి ఫేజ్‌లో భాగంగా 35 సినిమాలు, 6 డాక్యుమెంటరీలు, ఒక షార్ట్ ఫిల్మ్ సెలక్ట్ చేశామని, లాంచ్ అవ్వగానే అవి స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంటాయని కరుణ్ తెలిపారు. ఈ యాప్‌లో సినిమాలు చూడాలనుకుంటే రూ.75 చెల్లించాలని తెలుస్తోంది. అలా ‘పే పర్ వ్యూ’ స్కీమ్‌తో ‘సీస్పేస్’ రన్ అవ్వనుంది. ప్రస్తుతానికి ఈ యాప్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా సినిమాలు ఏమీ అందుబాటులోకి రావడం లేదని, త్వరలోనే అలాంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయని కరుణ్ అన్నారు.

Also Read: అతడు నా జీవితాన్ని నాశనం చేశాడు, చనిపోతున్నా.. ఇదే చివరి వీడియో: ‘హనుమాన్‌ జంక్షన్‌’ నటి విజయ లక్ష్మి

టాప్ హెడ్ లైన్స్

Azadi 501 Series OTT : ఇండియాలోనే బిగ్గెస్ట్ స్కామ్ స్టోరీ - 6 ఎపిసోడ్స్‌తో 'ఆజాదీ 501' సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
ఇండియాలోనే బిగ్గెస్ట్ స్కామ్ స్టోరీ - 6 ఎపిసోడ్స్‌తో 'ఆజాదీ 501' సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
Korean Horror Thriller OTT : దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
ZEE5 OTT Movies : 7 భాషల్లో అప్‌కమింగ్ కంటెంట్ లైనప్ - టాలీవుడ్ స్టార్స్ మూవీస్ To ఎక్స్‌క్లూజివ్ వెబ్ సిరీస్... జీ5 స్పెషల్ ప్రాజెక్ట్
7 భాషల్లో అప్‌కమింగ్ కంటెంట్ లైనప్ - టాలీవుడ్ స్టార్స్ మూవీస్ To ఎక్స్‌క్లూజివ్ వెబ్ సిరీస్... జీ5 స్పెషల్ ప్రాజెక్ట్
Horror Thriller OTT : రాక్షస చేపతో ఐదుగురి ఫ్రెండ్స్ పోరాటం - డైరెక్ట్‌గా ఓటీటీలోనే సర్వైవల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
రాక్షస చేపతో ఐదుగురి ఫ్రెండ్స్ పోరాటం - డైరెక్ట్‌గా ఓటీటీలోనే సర్వైవల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Birbhum Police Raid: బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Ram Charan : ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
Vaibhav Sooryavanshi News: వైభవ్ సూర్యవంశీకి ప్ర‌మోష‌న్.. ఆజ‌ట్టుకు  వైస్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్న 15 ఇయ‌ర్స్ కిడ్
వైభవ్ సూర్యవంశీకి ప్ర‌మోష‌న్.. ఆ జ‌ట్టుకు  వైస్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్న 15 ఇయ‌ర్స్ కిడ్
Maruti Suzuki Victoris EMI calculator: హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Korean Horror Thriller OTT : దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
Embed widget