Devara Movie: నార్త్‌లో ‘దేవర’ మూవీ మేనియా... ముంబై బీచ్‌లో భారీ కటౌట్ ఏర్పాటు
ఎన్టీఆర్ చిత్రం ‘దేవర’ కోసం నార్త్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది. అందులో భాగంగా ముంబై బీచ్ లో పెద్ద కటౌట్ ఏర్పాటు చేసింది.
Devara Cutout Installed In Mumbai Beach: ఎన్టీఆర్ ప్రతిష్టాత్మక చిత్రం ‘దేవర’ మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనెల 27న ప్రపంచ వ్యాప్తంగా అట్టహాసంగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర, పాటలు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సుమారు 2 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ హీరోగా వస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ముంబై బీచ్ లో ‘దేవర’ కటౌట్..
‘RRR’ సినిమా తర్వాత ఎన్టీఆర్ కు నార్త్ లో మాంచి క్రేజ్ పెరిగింది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తుండటంతో అక్కడి ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నార్త్ లో ఈ సినిమా ప్రమోషన్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు మేకర్స్. అందులో భాగంగానే మూవీ ట్రైలర్ ను ముంబై వేదికగా రిలీజ్ చేసి, ప్రమోషన్ కార్యక్రమాలను అధికారికంగా ప్రారంభించారు. ఇప్పటికే నార్త్ లో పలు టీవీ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పాటు కపిల్ కామెడీ షోలోనూ పాల్గొని సినిమాకు హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు మేకర్స్. తాజాగా ముంబైలోని దాదర్ చౌపాటీ బీచ్ లో భారీ ‘దేవర’ కటౌట్ ఏర్పాటు చేశారు. త్వరలో వినాయక నిమజ్జనోత్సవం జరగనుడటంతో ఈ కటౌట్ పెట్టారు. ముంబైలోని ప్రధాని గణపతులన్నీ చౌపాటీ బీచ్ లోనే నిమజ్జనం చేస్తారు. ఈ నేపథ్యంలో సినిమాకు మంచి ప్రమోషన్ లభిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ కటౌట్ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎన్టీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
A #Devara cutout installed on the Dadar Chowpatty beachfront…
— .... (@ynakg2) September 14, 2024
All the major Ganesh Visarjan processions of #Mumbai take place at this spot. pic.twitter.com/tZm25iioe3
‘దేవర’ సినిమా గురించి..
ఎన్టీఆర్ తో కలిసి ‘జనతా గ్యారేజ్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కొరటాల శివ... ‘దేవర’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తీరప్రాంతాల కథాంశంతో రూపొందుతోంది. ఈ యాక్షన్ డ్రామాగా తొలి భాగంగా ఈనెల సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ క్లియరెన్స్ వచ్చింది. సినిమాలో సుమారు నాలుగు కట్స్ చెప్పిన బోర్డు సభ్యులు యు/ఎ సర్టిఫికేట్ ను జారీ చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్స్ పోషిస్తున్నారు. నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ‘దేవర’ రెండో భాగం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకురానుంది.
Read Also: ‘దేవర’ను ఇంటర్వ్యూ చేసిన టిల్లు, దాస్- ప్రమోషన్స్ లో జోరు పెంచిన యంగ్ టైగర్ ఎన్టీఆర్