అన్వేషించండి

Animal OTT : త్వరలో ఓటీటీలోకి 'యానిమల్' - మరిన్ని అదనపు సన్నివేశాలతో స్ట్రీమింగ్!

Animal : యానిమల్ ఓటీటీ వెర్షన్ లో సుమారు 7 నుంచి 8 నిమిషాల సన్నివేశాలను యాడ్ చేస్తున్నట్లు సమాచారం.

Animal OTT Update : సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా నటించిన 'యానిమల్' మూవీ ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ తో అదరగొడుతోంది. ఈ వీకెండ్ డంకీ, సలార్ వంటి పెద్ద సినిమాలు రిలీజ్ అయిన కూడా యానిమల్ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ.850 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని రూ.1000 కోట్ల దిశగా పరుగులు పెడుతున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కి సంబంధించి ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. థియేటర్స్ లో 3 గంటల 21 నిమిషాలకు పైగా రన్ టైం తో రిలీజ్ అయిన యానిమల్ మూవీ ఓటీటీ వెర్షన్ మరింత ఎక్కువ నిడివితో ఉండబోతున్నట్లు సినీ వర్గాల ద్వారా సమాచారం వినిపిస్తోంది.

ఆమధ్య ఓటీటీలో యానిమల్ మూవీని నాలుగు గంటల నిడివితో సందీప్ రెడ్డి వంగా విడుదల చేయబోతున్నట్లు కొన్ని వార్తలు వినిపించాయి. కానీ ఆ తర్వాత అందులో ఎలాంటి వాస్తవం లేదని తెలిసింది. అయితే తాజా సమాచారం ప్రకారం థియేటర్ వెర్షన్ రన్ టైం కంటే ఓటీటీలో రిలీజ్ చేసినప్పుడు అదనంగా మరో 7 నుంచి 8 నిమిషాల కీలక సన్నివేశాలను యాడ్ చేస్తున్నట్లు తెలిసింది. నిజానికి ఈ కీలక సన్నివేశాలను థియేటర్లోనే చూపించాలని అనుకున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. కానీ అప్పటికే ఓవర్ రన్ టైం అవ్వడంతో ఆ ఫుటేజ్ ని ఎడిటింగ్ లో తీసేసారట. ఇప్పుడు ఆ సన్నివేశాలని ఓటీటీ వెర్షన్ లో యాడ్ చేస్తున్నారు.

ఆ సన్నివేశాలతో కలిపి యానిమల్ ఓటీటీ వెర్షన్ సుమారు మూడున్నర గంటల రన్ టైంతో ఉంటుందని అంటున్నారు. యానిమల్ ఓటీటీ రిలీజ్ కోసం చూస్తున్న ఆడియన్స్ కి ఇది క్రేజీ న్యూస్ అనే చెప్పాలి. కాగా ‘యానిమల్’ మూవీ త్వరలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. థియేటర్స్ లో ఆల్మోస్ట్ రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా జనవరిలో ఓటీటీ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది. ఫాదర్ అండ్ సన్ బాండింగ్ నేపథ్యంలో రివేంజ్ డ్రామాగా రూపొందింన ఈ సినిమాలో రణ్ బీర్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. అనిల్ కపూర్ తండ్రి పాత్రలో కనిపించగా, బాబీ డియోల్ విలన్ గా అదరగొట్టాడు.

బాలీవుడ్ నటి త్రిప్తి దిమ్రి మరో కీలక పాత్రలో నటించి మెప్పించింది. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్, ప్రణయ్ రెడ్డి వంగాలు ఈ చిత్రాన్ని నిర్మించారు. దీనికి ప్రీతమ్, విశాల్ మిశ్రా, హర్షవర్ధన్ రామేశ్వర్ తదితరులు సంగీతాన్ని అందించారు. డిసెంబర్ 1వ తేదీన గ్రాండ్ గా విడుదల అయిన చిత్రం ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ.862 కోట్ల గ్రాస్ అందుకుంది. కేవలం హిందీలోనే రూ.480కోట్ల నెట్ సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

Also Read : 'సరిహద్దులు చెరిగిపోతున్నాయి.. ఇండియన్ ఫిల్మ్ రేంజ్ పెరుగుతోంది' ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Embed widget