అన్వేషించండి

Prabhas : 'సరిహద్దులు చెరిగిపోతున్నాయి.. ఇండియన్ ఫిల్మ్ రేంజ్ పెరుగుతోంది' ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Prabhas: ప్రభాస్ తాజా చిత్రం ‘సలార్’ అద్భుత విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

Prabhas On Salaar : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘సలార్’. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. భారత్ తో పాటు ఓవర్సీస్ లోనూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తొలి రోజు గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ. 144 కోట్లు వసూళు చేసింది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ మీద విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతి బాబు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

అంచనాలను అందుకున్న ‘సలార్‘  

S.S. రాజమౌళి ‘బాహుబలి’ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ప్రభాస్ ప్రశాంత్ నీల్ తో కలిసి ఈ సినిమా చేశారు. ‘KGF’తో సెన్సేషనల్ హిట్స్ అందుకు ప్రశాంత్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, సంచనల దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ఈ చిత్రంపై సహజంగా దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.  అంచనాలకు తగినట్లుగానే ఈ సినిమా ప్రేక్షకులను ఓ రేంజిలో ఆకట్టుకుంది. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తుతున్నారు.

సరికొత్త, సవాల్ తో కూడిన క్యారెక్టర్ చేశా!

‘సలార్’ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ నేపథ్యంలో ప్రభాస్ హాలీవుడ్ మీడియాకు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ‘సలార్’, ‘సలార్ 2’తో పాటు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి పలు కీలక విషయాలు వెల్లడించారు. అద్భుతమైన  స్క్రిప్ట్, టాలెంటెడ్ టీమ్ తో కలిసి పని చేసే అవకాశం రావడంతోనే ఈ ప్రాజెక్టు చేయాలని భావించినట్లు వెల్లడించారు. ‘సలార్’లోని కథనం, క్యారెక్టర్ బాగా ఆకర్షించినట్లు చెప్పారు. తన కెరీర్ లోనే భిన్న కథాశంతో ఈ సినిమా తెరకెక్కినట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో సరికొత్త, సవాల్ తో కూడిన క్యారెక్టర్ చేసినట్లు వివరించారు. ఈ సినిమాతో అద్భుతమైన ఎక్స్​పీరియన్స్ కలిగినట్లు వెల్లడించారు.        

‘సలార్ 2’ మరో లెవల్!

అటు ప్రశాంత్ నీల్ లాంటి ప్రతిభావంతుడైన దర్శకుడితో కలిసి పని చేయడం మంచి అనుభవం కలిగించిందన్నారు ప్రభాస్. ఆయనలో ఉన్న స్పష్టత, కథ చెప్పడం పట్ల ఉన్న మక్కువ, చిత్ర నిర్మాణ ప్రక్రియ చాలా ఆసక్తికలిగిస్తాయన్నారు. తమ మధ్య ఉన్న చక్కటి రిలేషన్ షిప్ సినిమాలో తన క్యారెక్టర్ కు, కథకు జీవం పోయడానికి చక్కగా ఉపయోగపడినట్లు తెలిపారు. ‘సలార్’ సినిమాకు పార్ట్ 2 ఉంటుందని పార్ట్ 1 చివరిలోనే చెప్పినట్లు వివరించారు. పార్ట్ 1తో పోల్చితే పార్ట్ 2 మరింత అద్భుతంగా ఉంటుందన్నారు.  

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రేంజ్ పెరిగింది!

‘బాహుబలి’ సినిమా తన కెరీర్ కు ఓ బెంచ్ మార్క్ సెట్ చేసిందని చెప్పిన ప్రభాస్, ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ అత్యుత్తమంగా రావాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. గత చిత్రాలను దృష్టిలో పెట్టుకుని, నటుడిగా మరింతగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే సవాల్​తో కూడిన పాత్రలు ఎంచుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దేశంలో సినిమా పరిశ్రమలు ప్రాంతీయ సరిహద్దులను దాటుతున్నాయని వెల్లడించారు. విభిన్న కథలు, కథనాలతో అద్భుత సినిమాలు తెరకెక్కుతున్నాయని తెలిపారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అని కాకుండా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుందన్నారు. ప్రస్తుతం భారతీయ ప్రేక్షకులు వైవిధ్యమైన కంటెంట్‌ను ఎక్కువగా ఆస్వాదిస్తున్నారని చెప్పారు. అర్థవంతమైన కథలు, తాజా కథనాలు, వినూత్నమైన చిత్ర నిర్మాణానికి డిమాండ్ ఉందన్నారు. రాజమౌళి, ప్రశాంత్ నీల్ వంటి దర్శకులతో కలిసి పనిచేయడం చాలా అద్భుతంగా ఉందన్న ప్రభాస్, ప్రస్తుతం నాగ్ అశ్విన్ తో కలిసి ‘కల్కి 2898 AD’, సందీప్ వంగాతో ‘స్పిరిట్’ సినిమాలు చేస్తున్నట్లు వెల్లడించారు.

  

Read Also: 90 రోజులు, 600 మంది హాలీవుడ్ టెక్నీషియన్లు, ‘కన్నప్ప’ కోసం అంత కష్టపడ్డారా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandra Babu: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
ఏపీలో పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Upcoming 5G Smartphones: వచ్చే వారం మార్కెట్లోకి మూడు బడ్జెట్ ఫోన్లు - రూ.9 వేలలోపే 5జీ మొబైల్ కూడా!
వచ్చే వారం మార్కెట్లోకి మూడు బడ్జెట్ ఫోన్లు - రూ.9 వేలలోపే 5జీ మొబైల్ కూడా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandra Babu: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
ఏపీలో పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Upcoming 5G Smartphones: వచ్చే వారం మార్కెట్లోకి మూడు బడ్జెట్ ఫోన్లు - రూ.9 వేలలోపే 5జీ మొబైల్ కూడా!
వచ్చే వారం మార్కెట్లోకి మూడు బడ్జెట్ ఫోన్లు - రూ.9 వేలలోపే 5జీ మొబైల్ కూడా!
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Cycle Yatra Beyond Borders: సైక్లింగ్ ద్వారా ప్రపంచాన్ని అన్వేషిస్తున్న యువకుడు- తండ్రి కలను నెరవేరుస్తున్న వరంగల్ వాసి
సైక్లింగ్ ద్వారా ప్రపంచాన్ని అన్వేషిస్తున్న యువకుడు- తండ్రి కలను నెరవేరుస్తున్న వరంగల్ వాసి
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Embed widget