అన్వేషించండి

Thangalaan: 'తంగలాన్‌'కు పార్ట్‌ 2 కూడా ఉంది - కన్‌ఫాం చేసిన హీరో విక్రమ్‌

Chiyaan Vikram: ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన తంగలాన్‌ మూవీ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. తెలుగులోనూ ఈ సినిమా మంచి రెస్పాన్స్‌, కలెక్షన్స్‌ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూవీ టీం క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చింది. 

Thangalaan Part 2 Confirmed by Movie Team: చియాన్ విక్రమ్ నటించని లేటెస్ట్‌ మూవీ 'తంగలాన్‌'. పా రంజిత్ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్‌ తెరకెక్కిన ఈ సినిమా నిన్న ఆగస్టు 15న థియేటర్లోకి వచ్చింది. అన్ని దక్షిణాది భాషల్లో విడుదలైన ఈ సినిమా అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమా పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు.

అన్ని భాషల్లోనూ తంగలాన్‌ మూవీ ఆడియన్స్‌ నుంచి పాజిటివ్‌ రివ్యూస్‌ తెచ్చుకుంది. ముఖ్యంగా విక్రమ్‌ లుక్‌, నటనపై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. ప్రాణం పెట్టి నటించాడంటూ విక్రమ్‌ నటనని కొనియాడుతున్నారు. ఇక తంగలాన్ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ పట్ల చిత్ర బృందం సంతోషంగా ఉంది. మూవీ మెగా హిట్‌ అందుకున్న నేపథ్యంలో శుక్రవారం చిత్ర బృందం హైదరాబాద్‌లో థ్యాంక్స్‌ మీట్‌ నిర్వహించింది. ఈ వెంట్‌కి తంగలాన్ డైరెక్టర్‌, నిర్మాత, విక్రమ్‌తో పాటు పలువుకు పాల్గొన్నారు.

తెలుగు ఆడియన్స్ పై నమ్మకం ఉంది..

ఈ సందర్భంగా హీరో విక్రమ్‌ తంగలాన్‌ చిత్రంపై అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చాడు. దీంతో ఫ్యాన్స్‌ అంతా ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. ఈ సందర్బంగా అనంతరం హీరో విక్రమ్ మాట్లాడుతూ.. తెలుగులో తంగలాన్ సినిమాను వస్తున్న రెస్పాన్స్‌ చూస్తుంటే సర్‌ప్రైజింగ్‌గా ఉంది.. మా సినిమాని ఆదరిస్తున్న తీరు చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. ఇది మట్టి కథ అని, తెలుగు ఆడియన్స్‌కి ఇది తప్పక నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నామన్నారు. అదే ఇప్పుడు ప్రూవ్‌ అయ్యిందన్నారు. ఇదంతా డైరెక్టర్ రంజిత్‌ వల్లే  సాధ్యమైందన్నారు.

తంగలాన్ పార్ట్ 2 కూడా వస్తుంది

జీవీ ప్రకాశ్‌ తన సంగీతంతో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాడని, మాళవిక, పార్వతి తిరువోతు, పశుపతి.. అందరూ తమ తమ పాత్రకు న్యాయం చేశారన్నారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ.. మీ అందరి ప్రేమతో ఈ తంగలాన్‌ సెకండ్‌ పార్ట్‌ వస్తుందంటూ విక్రమ్‌ క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు.  జ్ఞానవేల్ రాజా, రంజిత్, నేను కలిసి సెకండ్ పార్ట్ గురించి చర్చించామని, త్వరలో పార్ట్ 2పై ప్రకటన ఉండబోతుందని హీరో విక్రమ్ వెల్లడించారు. తంగలాన్‌కు పార్ట్ 2 కూడా ఉంటుందని స్వయంగా విక్రమ్‌ చెప్పడంతో ఆయన అభిమానులు ఫుల్‌ ఖుష్ అవుతున్నారు. 

ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ అధ్బుతమైన సంగీతం అందించారు.  అనంతరం నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ..  ఒక మంచి సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకాన్ని 'తంగలాన్' నిలబెట్టిందని, ఈ స్థాయిలో భారీ ఒపెనింగ్స్‌ని తెలుగులో ఊహించలేదన్నారు. మేము అనుకున్న దానికంటే రెట్టింపు కలెక్షన్స్ వస్తున్నాయని, అన్ని సెంటర్స్‌లోనూ తంగలాన్‌ మంచి వసూళ్లు రాబడుతోందని ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాదు ఫస్ట్‌డే కలెక్షన్స్‌ చూసి తాము ఆశ్చర్యపోయామని అన్నారు.

Also Read: 'హరి హర వీరమల్లు'లోని నిధి అగర్వాల్‌ కొత్త లుక్‌ - బంగారు చీరలో మహారాణిలా మెరిసిపోతున్న బర్త్‌డే గర్ల్‌

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Dacoit Collection : డెకాయిట్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - అడివి శేష్ మాస్ జాతర కంటిన్యూ అవుతోందిగా...
డెకాయిట్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - అడివి శేష్ మాస్ జాతర కంటిన్యూ అవుతోందిగా...
Mrunal Thakur Wedding: తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిలవ్వు... మృణాల్‌కి అల్లు అరవింద్ సలహా
తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిలవ్వు... మృణాల్‌కి అల్లు అరవింద్ సలహా
Adivi Sesh: సుప్రియా... నువ్వు నాకెంతో ముఖ్యం - ఓపెన్‌గా చెప్పిన అడివి శేష్
సుప్రియా... నువ్వు నాకెంతో ముఖ్యం - ఓపెన్‌గా చెప్పిన అడివి శేష్
Godari Gattupaina Release Date: గోదారి గట్టుపైన రిలీజ్ డేట్ ఫిక్స్... సుమంత్ ప్రభాస్ సినిమా థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందంటే?
గోదారి గట్టుపైన రిలీజ్ డేట్ ఫిక్స్... సుమంత్ ప్రభాస్ సినిమా థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందంటే?

వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం
Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్
CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ
IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: ఇరాన్‌కు ఆయుధాలిస్తే చైనాపై 50 శాతం టారిఫ్.. కోపంతో రగిలిపోతున్న డొనాల్డ్ ట్రంప్
ఇరాన్‌కు ఆయుధాలిస్తే చైనాపై 50 శాతం టారిఫ్.. కోపంతో రగిలిపోతున్న డొనాల్డ్ ట్రంప్
Revanth Plan With KK: ఇంటర్ ఫలితాలను కేకే రిలీజ్ చేయడం వెనుక రాజకీయం - రేవంత్ ప్రాధాన్యత దేనికి సంకేతం?
ఇంటర్ ఫలితాలను కేకే రిలీజ్ చేయడం వెనుక రాజకీయం - రేవంత్ ప్రాధాన్యత దేనికి సంకేతం?
Palnadu Crime News: లాయర్ హత్య కేసులో ట్విస్ట్.. వివాహేతర సంబంధం కోసం కానిస్టేబుల్ దారుణం!
పల్నాడులో లాయర్ హత్య కేసులో ట్విస్ట్.. వివాహేతర సంబంధం కోసం కానిస్టేబుల్ దారుణం!
Inter Student Suicide: ఫెయిల్ భయంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య, రిజల్ట్స్ చూస్తే పాస్.. ఖమ్మం జిల్లాలో ఘటన
ఫెయిల్ భయంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య, రిజల్ట్స్ చూస్తే పాస్.. ఖమ్మం జిల్లాలో ఘటన
బీఆర్ఎస్‌ను మళ్లీ TRS గా పేరు మార్చడంపై ఆలోచిస్తున్నాం.. పాదయాత్ర చేస్తా: కేటీఆర్
బీఆర్ఎస్‌ను మళ్లీ TRS గా పేరు మార్చడంపై ఆలోచిస్తున్నాం.. పాదయాత్ర చేస్తా: కేటీఆర్
Khajipet Inter Girl Murder Case: నా కొడుకు అమాయకుడు.. నన్ను హత్తుకుని ఏడ్చాడు: ఖాజీపేట హత్య కేసు నిందితుడి తల్లి ఆవేదన
నా కొడుకు అమాయకుడు.. నన్ను హత్తుకుని ఏడ్చాడు: ఖాజీపేట హత్య కేసు నిందితుడి తల్లి ఆవేదన
TS Inter Supplementary Exam Date 2026: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు వచ్చేసింది.. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ప్రకియ వివరాలు
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు వచ్చేసింది.. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ప్రకియ వివరాలు
Adivi Sesh: సుప్రియా... నువ్వు నాకెంతో ముఖ్యం - ఓపెన్‌గా చెప్పిన అడివి శేష్
సుప్రియా... నువ్వు నాకెంతో ముఖ్యం - ఓపెన్‌గా చెప్పిన అడివి శేష్
Embed widget