News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Sridevi Shoban Babu Trailer: ‘శ్రీదేవి శోభన్ బాబు’ ట్రైలర్ - నోటి వాటానికి చేతి వాటానికి పోటీ, వీరి ప్రేమకథలో ఆ ట్వీస్ట్ ఏమిటీ?

సిద్ధ, ఆచార్యలు కలిసి.. సుశ్మిత కొణిదెల నిర్మించిన ‘శ్రీదేవి శోభన్ బాబు’ సినిమా ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు.

FOLLOW US: 
Share:

Sridevi Shoban Babu Trailer | శ్రీదేవి, శోభన్ బాబు అనగానే మనకు అలనాటి చిత్రాలే గుర్తుకొస్తాయి. అతిలోక సుందరి శ్రీదేవి, రొమాంటిక్ హీరో శోభన్ బాబు జంటగా అప్పట్లో విడుదలైన సినిమాలు మాంచి హిట్ కొట్టాయి. ఇప్పుడు ఆ జంట పేరు మీద ‘శ్రీదేవి శోభన్ బాబు’(Sridevi Shoban Babu) అనే చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో సంతోష్ శోభన్(Santosh Shoban), ‘96’ ఫేమ్(సమంత ఫ్లాష్‌బ్యాక్ క్యారెక్టర్) గౌరి జి.కిషన్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మితా కొణిదెల ‘గోల్డ్ బ్యాక్స్ ఎంటర్‌టైన్మెంట్’ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శనివారం రాత్రి ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి, రామ్ చరణ్ చేతుల మీదుగా ‘శ్రీదేవి శోభన్ బాబు’ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. 

ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. కొద్ది రోజుల కిందట విడుదల చేసిన టీజర్‌గా కొనసాగింపుగా రేడియో ప్రోగ్రామ్‌తో మొదలవుతుంది. నోటి వాటంతో బూతులు తిట్టే శోభన్ బాబును, చేతి వాటంతో గొడవలకు దిగే శ్రీదేవికి మధ్య వైరాన్ని చూపించాడు. కాసేపు శ్రీదేవి, శోభన్ బాబుల మధ్య సరదా సన్నివేశాలతో సాగిపోయే కథ.. ఒక్కసారే ‘లవ్’ టర్న్ తీసుకుంటుంది. ఆ తర్వాత కథ మరో మలుపు తిరుగుతుంది. ఇంతకీ ఆ శ్రీదేవి ఎవరు? ఆమె ఎవరికి అతిథిగా ఆ ఊరికి వస్తుంది? శ్రీదేవి, శోభన్ బాబుల ప్రేమకు వచ్చే ఆటంకాలు ఏమిటనేది తెరపైనే చూడాలి. ట్రైలర్ చూస్తుంటే.. రొటీన్ లవ్ స్టోరీకే కొన్ని హంగులు అద్దినట్లుగా కనిపిస్తుంది. ముఖ్యంగా యూత్‌కు ఈ చిత్రం బాగా నచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. ‘శ్రీదేవి శోభన్ బాబు’ ట్రైలర్‌ను ఇక్కడ చూసేయండి. 

Also Read: నాన్నతో అలా ఉండడానికి 13 ఏళ్లు పట్టింది - రామ్ చరణ్ ఎమోషనల్ కామెంట్స్

‘శ్రీదేవి శోభన్ బాబు ట్రైలర్’: 

Also Read: చిరంజీవి గారి కంటే నా హీరోనే బెటర్ - రాజమౌళి స్పీచ్ విన్నారా?

View this post on Instagram
 
A post shared by Gold Box Entertainments (@goldboxent)

Published at : 23 Apr 2022 11:33 PM (IST) Tags: chiranjeevi ram charan Santosh Shoban Gouri G Kishan Sridevi Sobhan Babu Trailer Sridevi Sobhan Babu

ఇవి కూడా చూడండి

Baby Movie: ‘బేబీ’ నిర్మాత సంతోషం - దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్, భలే బాగుంది.. మీరూ చూడండి

Baby Movie: ‘బేబీ’ నిర్మాత సంతోషం - దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్, భలే బాగుంది.. మీరూ చూడండి

Vijay Antony: పాన్ ఇండియా రేంజ్‌లో విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం ‘హిట్లర్’, ఆసక్తికరంగా మోషన్ పోస్టర్

Vijay Antony: పాన్ ఇండియా రేంజ్‌లో విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం ‘హిట్లర్’, ఆసక్తికరంగా మోషన్ పోస్టర్

Sapta Sagaralu Dhaati: ‘సప్త సాగరాలు దాటి’ సినిమాకు సీక్వెల్ - తెలుగు, కన్నడలో ఒకేసారి రిలీజ్

Sapta Sagaralu Dhaati: ‘సప్త సాగరాలు దాటి’ సినిమాకు సీక్వెల్ - తెలుగు, కన్నడలో ఒకేసారి రిలీజ్

Vijay Sethupathi: అందుకే కృతి శెట్టిని తిరస్కరించాడట - విజయ్ సేతుపతిలా మన హీరోలు చేయగలరా?

Vijay Sethupathi: అందుకే కృతి శెట్టిని తిరస్కరించాడట - విజయ్ సేతుపతిలా మన హీరోలు చేయగలరా?

Vijay Antony: మూవీ ప్రమోషన్స్‌ మొదలుపెట్టిన విజయ్ ఆంటోనీ, నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్

Vijay Antony:  మూవీ ప్రమోషన్స్‌ మొదలుపెట్టిన విజయ్ ఆంటోనీ, నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్

టాప్ స్టోరీస్

అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!

అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!

Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి

Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి

IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!

IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?