అన్వేషించండి
Advertisement
Rajamouli: చిరంజీవి గారి కంటే నా హీరోనే బెటర్ - రాజమౌళి స్పీచ్ విన్నారా?
'ఆచార్య' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో దర్శకధీరుడు రాజమౌళి ఏం మాట్లాడారంటే..?
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు కొరటాల శివ 'ఆచార్య' అనే సినిమాను రూపొందించారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది కానీ కొన్ని కారణాల వలన ఆలస్యమవుతూ వస్తోంది. ఎట్టకేలకు ఏప్రిల్ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో తాజాగా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కి రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అలానే దర్శకుడు బాబీ, మెహర్ రమేష్, రామజోగయ్య శాస్త్రి, రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఇలా చాలా మంది గెస్ట్ లుగా వచ్చారు. ముందుగా సినిమాలో ఒక్కో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఆ తరువాత చిరంజీవి, రామ్ చరణ్, కొరటాల శివలను స్టేజ్ పైకి పిలిచి.. ఫ్యాన్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు అడిగింది సుమ. ఈ సంభాషణ మొత్తం చాలా ఫన్నీగా సాగింది.
ఆ తరువాత ముఖ్య అతిథిగా వచ్చిన రాజమౌళి మాట్లాడుతూ.. ''ఆకాశమంత ఎత్తు ఎదిగిన చిరంజీవి గారు ఎంతో హంబుల్ గా ఉంటారు. ఎంత ఎదిగినా నేల మీద నుంచోవాలని ఆయన నుంచి నేర్చుకోవాలి. డైరెక్టర్ కి ఎంత విజన్ ఉన్నా.. టెక్నిషన్స్ హెల్ప్ లేకపోతే ఏ డైరెక్టర్ కూడా తను అనుకున్నది చేయలేరు. ఈ సినిమా కోసం ప్రతి టెక్నీషియన్ ఎంతో కష్టపడి పని చేశారు. మణిశర్మ గారి మ్యూజిక్ మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉంది. 'మగధీర' సినిమా సమయంలో చిరంజీవి గారు కథ వింటే చరణ్ కి సంబంధించినవన్నీ ఆయన చూసుకుంటారేమో అనుకున్నా. కానీ చిరంజీవి గారు ఎందులో ఇన్వాల్వ్ అవ్వరు. రామ్ చరణ్ తన హార్డ్ వర్క్ తో ఈ స్థాయికి ఎదిగారు. చిరంజీవి గారిలో నాకు నచ్చే మరో విషయం ఆయన కాంపిటిషన్ గా ఫీల్ అవుతుంటారు. పక్కన కొడుకే ఉన్నప్పటికీ అతడిని డామినేట్ చేయాలనుకుంటారు చిరంజీవి. ఒక ఫ్యాన్ గా నాకు చిరంజీవి గారే బాగున్నారనిపిస్తాది కానీ ఒక దర్శకుడిగా నా హీరో(రామ్ చరణ్) మీకంటే(చిరంజీవి) బెటర్. కొరటాల శివ గారి గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. ఆయన చాలా అబ్సర్వ్ చేస్తుంటారు. ఆయన మనసులో ఉన్న మాస్ ఎలిమెంట్స్ ఇంకెవరిలో చూడలేం'' అంటూ చెప్పుకొచ్చారు.
Our Mighty SIDDHA & @ssrajamouli Grand Entry at #AcharyaPreReleaseEvent 🔥
— Konidela Pro Company (@KonidelaPro) April 23, 2022
Watch Live now!
- https://t.co/Ff0hE36FSR#Acharya #Siddha#AcharyaOnApr29
Megastar @KChiruTweets @AlwaysRamCharan #Sivakoratala @hegdepooja @SonuSood #Manisharma @MatineeEnt @KonidelaPro pic.twitter.com/bxwPj9stIc
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
సినిమా
ఆట
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement