అన్వేషించండి
Advertisement
Ram Charan: నాన్నతో అలా ఉండడానికి 13 ఏళ్లు పట్టింది - రామ్ చరణ్ ఎమోషనల్ కామెంట్స్
'ఆచార్య' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో రామ్ చరణ్ ఏం మాట్లాడారంటే..?
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు కొరటాల శివ 'ఆచార్య' అనే సినిమాను రూపొందించారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది కానీ కొన్ని కారణాల వలన ఆలస్యమవుతూ వస్తోంది. ఎట్టకేలకు ఏప్రిల్ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో తాజాగా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కి రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అలానే దర్శకుడు బాబీ, మెహర్ రమేష్, రామజోగయ్య శాస్త్రి, రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఇలా చాలా మంది గెస్ట్ లుగా వచ్చారు. ముందుగా సినిమాలో ఒక్కో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఆ తరువాత చిరంజీవి, రామ్ చరణ్, కొరటాల శివలను స్టేజ్ పైకి పిలిచి.. ఫ్యాన్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు అడిగింది సుమ. ఈ సంభాషణ మొత్తం చాలా ఫన్నీగా సాగింది.
ఆ తరువాత రామ్ చరణ్ మాట్లాడుతూ.. ''ఈ సినిమా కోసం ప్రతి టెక్నీషియన్ ఎంతో కష్టపడి పని చేశారు. ఈ మెమొరబుల్ ఫిల్మ్ లో నాతో కలిసి పని చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. ఇరవై ఏళ్లుగా మా నాన్నను చూసి నేర్చుకున్నదానికంటే ఈ సినిమా షూటింగ్ సమయంలో చాలా ఎక్కువ నేర్చుకున్నాను. 'ఆర్ఆర్ఆర్' సినిమా సెట్స్ నుంచి నన్ను 'ఆచార్య' సినిమా షూటింగ్ కి పంపించిన రాజమౌళి గారికి ధన్యవాదాలు. మా నాన్నగారితో కలిసి కొరటాల శివ దర్శకత్వంలో పని చేయాలని రాసి ఉంది. అందుకే ఇంతకముందు ఆయనతో సినిమా కుదరలేదు. శివ గారి రైటింగ్ అద్భుతంగా ఉంటుంది. ఆయన రైటింగ్ లో నేను నటించాలనుకున్నాను కానీ నాన్నగారితో కలిసి చేయడం డబుల్ బొనాంజా. ఎంతో ఇష్టంతో ఫ్యాషనేట్ గా చేసిన సినిమా ఇది. నా మనసుకి చాలా దగ్గరైన క్యారెక్టర్ ఇది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సినిమాల్లోకి రాకుండా ఏదైనా బిజినెస్ లోకి వెళ్లి ఉంటే ఎక్కువ డబ్బు సంపాదించేవాడినేమో కానీ ఇంత మంది అభిమానం, ఇన్ని మంచి సినిమాలు చేసే అవకాశం రాదు. నాన్ కారెప్ట్ ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది సినిమా ఇండస్ట్రీనే. స్కూల్ లో సరిగ్గా చదువుకోలేదు.. ఆచార్యులకు దూరంగా ఉన్నాను. కానీ ఇంట్లో మా ఆచార్య నాకు అన్నీ నేర్పించారు. నన్ను ఎంతో ఎంకరేజ్ చేసే ఫాదర్ కి పుట్టడం బ్లెస్సింగ్. చెడు చెప్పినా కూడా స్వీట్ కోటింగ్ తో చెబుతారు. 20 రోజులు మా నాన్నతో రోజంతా కలిసి ఉన్నాను. కలిసి జాగింగ్ చేశాం.. రైడ్ కి వెళ్లాం. అలా ఉండడానికి నాకు 13 ఏళ్లు పట్టింది. ఆయన చాలా బిజీగా ఉండేవారు. ఉదయం షూటింగ్ కి వెళ్తే సాయంత్రానికి వచ్చేవారు. ఇన్నేళ్లకు ఆయనతో రోజంతా ఉండే ఛాన్స్ వచ్చింది. మళ్లీ ఇలాంటి అవకాశం వస్తుందో రాదో తెలియదు. కానీ ఈ ఛాన్స్ నాకు చాలు'' అంటూ ఎమోషనల్ గా మాట్లాడారు.
Acharya & Siddha ♥️
— Konidela Pro Company (@KonidelaPro) April 23, 2022
Watch the Grand #AcharyaPreReleaseEvent Live Now!
- https://t.co/Ff0hE36FSR#AcharyaOnApr29
Megastar @KChiruTweets @AlwaysRamCharan #Sivakoratala @hegdepooja @SonuSood #Manisharma @NavinNooli @DOP_Tirru @MatineeEnt @KonidelaPro @adityamusic pic.twitter.com/0BCjq1NTO1
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion