అన్వేషించండి

Chaari 111 Trailer: ‘చారి 111’ ట్రైలర్: సీరియస్ ఆపరేషన్‌ను కామెడీగా మార్చేసిన ఏజెంట్ - కితకితలు పెడుతోన్న వెన్నెల కిశోర్

Chaari 111 Trailer: వెన్నెల కిశోర్‌ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘చారి 111’. మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజీ కీర్తికుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ట్రైలర్ యూట్యూబ్‌లో విడుదలైంది.

Vennela Kishore Chaari 111 Trailer Out: టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ హీరోగా న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ‘చారి 111’. టీజీ కీర్తికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త‌మిళ బ్యూటీ సంయుక్త విశ్వనాథన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం మార్చి 1న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. విడుదలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో మేక‌ర్స్  ప్ర‌మోష‌న్స్ ముమ్మరం చేశారు. ఇప్ప‌టికే ఈ సినిమా విడుదలైన పోస్టర్లు, కాన్సెప్ట్‌ టీజర్‌ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. 

ఫన్నీగా అలరిస్టున్నన ‘చారి 11’ ట్రైలర్

‘చారి 111’ ట్రైలర్ ఫుల్ ఫన్నీగా ఆకట్టుకుంది. ఎటువంటి కెమికల్, బయలాజికల్ వెపన్స్ తయారు చేయకూడదని 1992లో ఇండియా పాకిస్తాన్ జాయింట్ అగ్రిమెంట్ చేసుకున్నాయని మురళీ శర్మ చెప్పే మాటలతో 'చారి 111' ట్రైలర్ ప్రారంభమైంది. రుద్రనేత్ర సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీకి ఆయన హెడ్. ఈ ఏజెన్సీలోనే చారి పని చేసేది. చారి అసిస్టెంట్ పాత్రలో తాగుబోతు రమేష్ కనిపించారు. మూడు రోజుల్లో ఏడు బ్లాస్టులు చేయాలని టెర్రరిస్టులు ప్లాన్ చేస్తారు. వాళ్లను రుద్రనేత్ర సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ ఎలా అడ్డుకుంది? చారి ఏం చేశాడు? మ్యాడ్ సైకో సైంటిస్ట్ ఏం చేశాడు? ఈ జన్మలో నువ్వు ఏజెంట్ కాలేవని చారిని మురళీ శర్మ ఎందుకు తిట్టారు? అనే విషయాలను ట్రైలర్ ఫన్నీగా చూపించారు.

సీరియస్ ఆపరేషన్, కామెడీ ఏజెంట్

ఈ ట్రైలర్ లో సీరియస్‌గా కనిపిస్తూ నవ్వించే గూఢచారిగా వెన్నెల కిశోర్ కనిపించారు. సైలెంట్‌గా హ్యాండిల్ చేయాల్సిన కేసును వయొలెంట్‌గా హ్యాండిల్ చేయడం చారి నైజం. 'బాండ్... జేమ్స్ బాండ్' టైపులో తనను తాను 'చారి.. బ్రహ్మచారి' అని పరిచయం చేసుకోవడం అలవాటు. 'చారి 111' ట్రైలర్ చివరలో “వయలెన్స్... వయలెన్స్... వయలెన్స్... ఐ లైక్ ఇట్! ఐ డోంట్ అవాయిడ్. బట్, వయొలెన్స్ డజెంట్ లైక్ మి. అందుకే అవాయిడ్ చేస్తున్నా” అంటూ 'కెజియఫ్'లో రాకీ భాయ్ టైపులో 'వెన్నెల' కిశోర్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది.

ఒక సీరియస్ ఆపరేషన్‌ను కామెడీగా మార్చేస్తాడు చారి. ఆ తర్వాత ఏమైందనేది సిల్వర్ స్క్రీన్ మీద చూడాలి. హీరోయిన్ సంయుక్తా విశ్వనాథన్ అందంగా కనిపించారు. యాక్షన్ సీన్లు అదరగొట్టారు. “నువ్వు ఎప్పటికీ కమెడియనే. హీరో కాదు” అంటూ వెన్నెల కిశోర్ మీద పంచ్ కూడా నవ్విస్తుంది.  రాహుల్ రవీంద్రన్, గోల్డీ నిస్సి ఇతర పాత్రల్లో కనిపించిన ట్రైలర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ సినిమాను బర్కత్‌ స్టూడియెస్‌ బ్యానర్‌పై అదితి సోని నిర్మిస్తుంది.

ట్రైలర్ జస్ట్ శాంపిల్ మాత్రమేనని, సినిమాలో దీనికి మరింత వినోదం ఉంటుందని దర్శకుడు టీజీ కీర్తి కుమార్, నిర్మాత అదితి సోనీ తెలిపారు. ప్రేక్షకుల్ని 'చారి 111' కడుపుబ్బా నవ్విస్తుందని చెప్పారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా 'చారి 111' పాటలు విడుదల కానున్నాయి. ఇక ఈ చిత్రానికి సైమన్‌ కె.కింగ్‌ సంగీతం అందించగా, కషిష్‌ గ్రోవర్‌ సినిమాటోగ్రఫీ,  రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.

Read Also: మురళీమోహన్ నా శత్రువు - రాజమౌళి షాకింగ్ కామెంట్స్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Rolls Royce: కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Embed widget