Mammootty's Bramayugam: ప్రేక్షకుల వెన్నులో వణుకు పుట్టిస్తోన్న మమ్ముటి 'భ్రమయుగం' - ఆ సీన్స్ చాలా టెర్రిఫిక్!
Mammootty's Bramayugam: మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన 'భ్రమయుగం' చిత్రానికి ఆడియన్స్ నుంచి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ హారర్ థ్రిల్లర్ అద్భుతంగా ఉందని రివ్యూలు పేర్కొన్నాయి.

Mammootty's Bramayugam: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'భ్రమయుగం'. రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి 'ది ఏజ్ ఆఫ్ మ్యాడ్ నెస్' అనేది ట్యాగ్ లైన్. ప్రమోషనల్ కంటెంట్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా నిన్న ఫిబ్రవరి 15న థియేటర్లలోకి వచ్చింది. ఇది పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్‌లో చిత్రీకరించబడిన హారర్ థ్రిల్లర్. దీనికి తొలి రోజే ఆడియన్స్ నుంచి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. సినిమా చూసిన జనాలు సోషల్ మీడియాలో తమ రివ్యూలను పోస్ట్ చేస్తున్నారు.
'భ్రమయుగం' మూవీ ప్రేక్షకుల వెన్నులో వణుకు పుట్టిస్తోందని ట్విట్టర్ రివ్యూలు చూస్తుంటే అర్థమవుతోంది. ఇటీవలి కాలంలో తాము చూసిన అత్యంత భయంకరమైన చిత్రం ఇదేనని, మమ్ముట్టి నుంచి ఇలాంటి సినిమా వస్తుందని ఊహించలేదని అంటున్నారు. థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు భయంతో చాలాసార్లు అరిచామని కొందరి ట్వీట్లు కనిపిస్తుంటే, మినీ హార్ట్ ఎటాక్ వచ్చినంత పనైందని మరికొందరు అంటున్నారు. ఈ మూవీ చాలా టెర్రిఫిక్ గా ఉంది. సాంకేతికంగా ఇది అద్భుతం. అట్మాస్ సౌండ్, సంగీతం, సినిమాటోగ్రఫీ మొదలైనవన్నీ అమేజింగ్ గా ఉన్నాయని ఓ నెటిజన్ ట్వీట్ చేసారు. కొన్ని సీన్లు కేకలు పెట్టించేలా ఉన్నాయని అంటున్నారు.
'భ్రమయుగం' సినిమా మైండ్ బ్లోయింగ్ గా ఉంది. పవర్ కరప్షన్, ఇది మానవ దురాశపై తీసిన ఒక అద్భుతమైన జానపద హార్రర్ మూవీ. మమ్ముట్టి మరోసారి తన అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో బీస్ట్ ని చూపించారు. రాహుల్ సదాశివన్ భారతదేశం గర్వించదగ్గ దర్శకుడు.. హాలీవుడ్ ఫిలిం మేకర్స్ జోర్డాన్ పీలేకు సమాధానం అని ఓ నెటిజన్ పోస్ట్ చేసారు. మమ్ముట్టి ఈ స్థాయికి చేరుకున్నాక, ఇక నటుడిగా నిరూపించకోడానికి ఏమీ లేదని నేను భావిస్తున్నప్పుడు.. అతను రోర్‌షాచ్, భ్రమయుగం వంటి ప్రయోగాత్మక సినిమాలతో ఆశ్చర్యపరిచారు అని ఓ అభిమాని పేర్కొన్నారు.
Also Read: ఏంటీ.. 'మట్కా' హోల్డ్ లో పడిందా?, మెగా హీరో మూవీకి బడ్జెట్ ఇష్యూనా?
"ప్రస్తుతం ఇండియన్ సినిమాలో మమ్ముట్టికి ఎవరూ పోటీ లేరని అనుకుంటున్నాను. నేను ఆయనకు అభిమానిని కాదు.. కానీ భ్రమయుగం చూసిన తర్వాత అతని పట్ల నా రెస్పెక్ట్ పెరిగింది. అతను మన చిత్ర పరిశ్రమకు చెందినవాడు అవడం మనందరం గర్వించదగ్గ విషయం'' అని మమ్ముట్టిని ఉద్దేశిస్తూ ఓ నెటిజన్ రాసుకొచ్చారు. ''దర్శకుడు రాహుల్ సదాశివన్ మలయాళంలోనే భారీ బడ్జెట్ బ్లాక్ అండ్ వైట్ హర్రర్ మూవీని ప్రయత్నించడం అభినందనీయం. 'భ్రమయుగం' ద్వారా మమ్ముట్టిలోని డెవిల్ కోణాన్ని బయటపెట్టడం నిజంగా ప్రశంసనీయం" అని మరొకరు అభిప్రాయపడ్డారు.
'భ్రమయుగం' కథేంటంటే?
కేరళలో మాయలు, మంత్రాలు, తంత్రాలు వాస్తవిక ప్రపంచంలో ఉన్న రోజుల్లో.. పానన్ కులానికి చెందిన తేవన్ అనే జానపద గాయకుడు భగవంతుడిని కీర్తిస్తూ పాటలు పాడుతుంటాడు. ఆ రోజుల్లో బానిసల క్రయ విక్రయాలు సర్వసాధారణం. అలా తేవన్ కూడా బానిసగా అమ్ముడుపోయే క్రమంలో, ఆ బానిసత్వం నుండి తప్పించుకొని అనుకోకుండా ఒక ప్రదేశంలోకి వెళ్తాడు. అక్కడ విధిని మార్చే ఒక పురాతన రహస్య మార్గంలో పయనించడం మొదలుపెడతాడు. మరి ఆ మార్గం అతడిని ఎటువైపు తీసుకెళ్లింది? దాని నుంచి బయటపడ్డాడా లేదా? అన్నదే ఈ కథ.
విభిన్నమైన హారర్ థ్రిల్లర్ గా రూపొందిన 'భ్రమయుగం' చిత్రంలో మమ్ముట్టితో పాటుగా అర్జున్ అశోకన్, సిద్దార్థ్, భరతన్, అమల్దా లిజ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీతం సమకూర్చారు. షెహనాద్ జలాల్ సినిమాటోగ్రాఫర్ గా, జోతిష్ శంకర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేశారు. షఫీక్ మహమ్మద్ అలీ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. నైట్ షిఫ్ట్ స్టూడియోస్ & వైనాట్ స్టూడియోస్ బ్యానర్స్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. చక్రవర్తి రామచంద్ర, ఎస్. శశికాంత్ నిర్మాతలుగా వ్యవహరించారు.
Also Read: పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో వెళ్తున్న బుచ్చిబాబు, RC16 టైటిల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడంటే?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

