అన్వేషించండి

RC 16 Update: పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో వెళ్తున్న బుచ్చిబాబు, RC16 టైటిల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడంటే?

RC 16 Update: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ న్యూస్ మీకోసం...

RC 16 Update: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం లెజెండరీ డైరెక్టర్ శంకర్ షణ్ముగం దర్శకత్వంలో 'గేమ్ ఛేంజ‌ర్‌' సినిమాలో నటిస్తున్నారు. దీని తర్వాత తన 16వ చిత్రాన్ని ప్రారంభించనున్నారు. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో ఈ పాన్ ఇండియా సినిమా తెరకెక్కనుంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి సోషల్ మీడియాలో 'RC 16' హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. దీనికి కారణం ఈరోజు దర్శకుడి పుట్టినరోజు కావడమే.

బుచ్చిబాబుకు బర్త్ డేకి విషెస్ తెలియజేస్తూ చిత్ర బృందం ట్విట్టర్ 'ఎక్స్'లో ఓ పోస్ట్ పెట్టారు. #RC16 కోసం దర్శకుడు సృష్టించే రా అండ్ రస్టిక్ వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను కనువిందు చేస్తుందని పేర్కొన్నారు. రామ్ చరణ్ కోసం బుచ్చిబాబు ఓ రూరల్ స్పోర్ట్స్ డ్రామా కథని రాసుకున్నట్లు తెలుస్తోంది. ఈ స్క్రిప్టు మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న డైరెక్టర్.. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఈ ప్రాజెక్ట్ ను కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నారు.

'RC 16' చిత్రాన్ని మార్చిలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నారని సమాచారం. మే నెలలో రెగ్యులర్ షూట్ కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్ళినా, 240 రోజుల్లో షూటింగ్ అంతా పూర్తి చెయ్యాలని భావిస్తున్నారట. అంతేకాదు 2025 మార్చి లాస్ట్ వీక్ లో రిలీజ్ చేసే విధంగా బుచ్చిబాబు అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారట. ఈ నెల 27న రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ గా ఫస్ట్ లుక్ లేదా టైటిల్ అనౌన్స్ మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. 

'ఉప్పెన' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బుచ్చిబాబు నుంచి రాబోతున్న సినిమా ఇది. RRR తో రామ్ చరణ్ కు గ్లోబల్ స్టార్ డమ్ వచ్చిన తరువాత చేస్తున్న మూవీ కావడంతో, దర్శకుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మూడేళ్లుగా ఈ కథ మీద వర్క్ చేస్తున్నారు. సెంటిమెంట్ గా హైదరాబాద్ లో 'రంగస్థలం' విలేజ్ సెట్ వేసిన ప్లేస్ లోనే RC 16 కోసం సెట్లు వేస్తున్నారు. ఇప్పటికే స్టార్ట్ కావాల్సిన ఈ ప్రాజెక్ట్ 'గేమ్ ఛేంజ‌ర్‌' కారణంగా కాస్త ఆలస్యంగా ప్రారంభం కానుంది. చెర్రీ డిఫరెంట్ మేకోవర్ అవ్వాలి కాబట్టి, ఒకేసారి రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లే పరిస్థితి లేకుండా పోయిందని టాక్ వినిపిస్తోంది.

బుచ్చిబాబు సినిమాలో రామ్ చరణ్ ఉత్తరాంధ్ర యువకుడిగా కనిపించనున్నారు. అతని స్లాంగ్ నుంచి గెటప్ వరకూ అంతా కొత్తగా ఉండబోతోంది. ఇందులో జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా ఫైనలైజ్ చేసినట్లు టాక్. మ‌రికొన్ని ముఖ్య‌మైన పాత్ర‌ల్లో ప్ర‌ముఖ న‌టీన‌టులను ఎంపిక చేయటం కోసం క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది. మరోవైపు ఉత్తరాంధ్రలోని పలు ఏరియాల్లో ఆడిషన్స్ నిర్వహించి నటీనటులను సెలెక్ట్ చేస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై వెంకట సతీష్ కిలారు అత్యంత భారీ బడ్జెట్‌తో లార్జ్ స్కేల్ లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే రెండు సాంగ్స్ కంపోజ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. రత్నవేలు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తారు. రానున్న రోజుల్లో RC 16 కు సంబంధించిన క్రేజీ అప్డేట్స్ వెలువడనున్నాయి.

Read Also: రూ. 170 కోట్లకు మించి ఇచ్చినా రాజీపడను, ‘శ్రీమంతుడు’ కేసుపై శరత్ చంద్ర హాట్ కామెంట్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Embed widget