అన్వేషించండి

Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు - చీఫ్ ఫోన్ పోలీసులకు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశం

Surpreme Court : ఫోన్ ట్యాపింగ్ కేసులో తన ఫోన్ డేటాను సిట్ కు ఇవ్వాలని సుప్రీంకోర్టు.. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును ఆదేశించింది.

Phone tapping case Surpreme Court:  తెలంగాణలో  ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) చీఫ్ టి. ప్రభాకర్ రావుపై కొనసాగుతున్న విచారణలో సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభాకర్ రావు తన iCloud అకౌంట్ పాస్‌వర్డ్‌ను రీసెట్ చేసి, రాష్ట్ర పోలీస్ ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో అందించాలని బెంచ్ ఆదేశించింది.  జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఆర్. మహాదేవన్‌లతో కూడిన బెంచ్, ప్రభాకర్ రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణలో ఈ తీర్పు ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం అరెస్టు నుంచి ఇచ్చిన తాత్కాలిక రక్షణను రద్దు చేయాలంటూ దాఖలు చేసిన  అప్లికేషన్‌పై వాదనలు విన్న తర్వాత, బెంచ్ రక్షణను మళ్లీ పొడిగించింది. తదుపరి విచారణ నవంబర్ 18న జరగనుంది.
 
తెలంగాణలో బీఆర్ఎస్ పాలిత ప్రభుత్వ హయాంలో అక్రమంగా ట్యాప్ చేసిన కేసులో ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడు (A1). ఈ కేసు 2024 మార్చిలో హైదరాబాద్ పోలీస్‌లు దర్యాప్తు ప్రారంభించాయి. మొత్తం నలుగురు  పోలీస్ అధికారులు  అరెస్ట్ అయ్యారు. వీరు ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల నుంచి డిలీట్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.  ప్రభాకర్ రావు అమెరికాలో ఉండటంతో, తెలంగాణ హైకోర్టు అతని అంటిసిపేటరీ బెయిల్ పిటిషన్‌ను మే 3, 2025న తిరస్కరించింది.   'ప్రోక్లెయిమ్డ్ ఆఫెండర్'గా ప్రకటించి, ఆస్తులపై ఆర్డర్ చేస్తామని హెచ్చరించింది. పాస్‌పోర్ట్ క్యాన్సిల్ చేసి, రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు. మే 29న సుప్రీంకోర్టు తాత్కాలిక రక్షణ ఇచ్చి, పాస్‌పోర్ట్ వచ్చిన 3 రోజుల్లో భారత్‌కు తిరిగి రావాలని ఆదేశించింది.
 
సోమవారం విచారణలో ప్రభాకర్ రావు సహకరించడం లేదు. విచారణ ముందుకు సాగడం లేదని ప్రభుత్వం  తరపు లాయర్ వాదించారు.  కోర్టు రక్షణలో ఉండగానే ఆయన ఎలక్ట్రానిక్ డివైజ్‌లు iPhones, అధికారిక ల్యాప్‌టాప్ ఫార్మాట్ చేసి, కీలక సాక్ష్యాలను నాశనం చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.   ప్రైవేట్ iCloud, ఇతర క్లౌడ్ బ్యాకప్‌ల ID, పాస్‌వర్డ్‌లు, ఫార్మాటింగ్‌కు ముందు ఉపయోగించిన డివైసెస్ వివరాలు అందించాల్సి ఉందన్నారు. అయితే ప్రభాకర్ తరపు లాయర్ మాత్రం  పాత iCloud పాస్‌వర్డ్ మర్చిపోయారు. దానిని పోలీస్ ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో రీసెట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.  అది సెన్సిటివ్ డేటా ప్రోటోకాల్ ప్రకారం ఫార్మాటింగ్ చేశారని  డిపార్ట్‌మెంట్ కంప్యూటర్ నిపుణులే చేశారని ప్రభాకర్ రావు   తెలిపారు. 
 
వాదనలు విన్న బెంచ్, జస్టిస్ నాగరత్న "మీరు డివైస్‌లు డిలీట్ చేశారుగా?" అని ప్రభాకర్ రావు తరఫు లాయర్‌ ప్రశ్నించారు.  తాత్కాలిక రక్షణను నవంబర్ 18 వరకు పొడిగించి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముందు హాజరు కావాలని, సహకరించాలని ఆదేశించింది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కోరిన iCloud, క్లౌడ్ బ్యాకప్‌ల వివరాలు, ఫార్మాటింగ్ ముందు డ్రైవ్‌లు అందించాలని కూడా చెప్పింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణ మరింత ముందుకు సాగనుంది. ప్రభాకర్ రావు ఫోరెన్సిక్ సమక్షంలో పాస్‌వర్డ్ రీసెట్ చేస్తే, కీలక సాక్ష్యాలు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Kalvakuntla Kavitha Uppal Bhagayat Protest: ఉప్పల్ భగాయత్ లో తీవ్ర ఉద్రిక్తత.. తెలంగాణ రక్షణ సేన భూపోరాటంలో కవితకు గాయాలు.. అరెస్ట్!
ఉప్పల్ భగాయత్ లో తీవ్ర ఉద్రిక్తత.. తెలంగాణ రక్షణ సేన భూపోరాటంలో కవితకు గాయాలు.. అరెస్ట్!
KTR Latest News:సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
BRS Leader Harish Rao Arrest: తెలంగాణలో గురుకులాల టెండర్లపై రగడ! మంత్రులతో చర్చకు సిద్ధమైన బీఆర్‌ఎస్‌ నేతలు! పోలీసుల అడ్డగింత, అరెస్టు!
తెలంగాణలో గురుకులాల టెండర్లపై రగడ! మంత్రులతో చర్చకు సిద్ధమైన బీఆర్‌ఎస్‌ నేతలు! పోలీసుల అడ్డగింత, అరెస్టు!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Latest News:సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
Amarnath Yatra 2026 : అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
Telangana Police vs AP Police:హైదరాబాద్‌లో ఏపీ పోలీసులపై క్రిమినల్‌ కేసు! కేవీ రెడ్డి అరెస్టుతో రేగిన వివాదం!
హైదరాబాద్‌లో ఏపీ పోలీసులపై క్రిమినల్‌ కేసు! కేవీ రెడ్డి అరెస్టుతో రేగిన వివాదం!
Super Subbu OTT : ఓటీటీలోకి వచ్చేసిన సందీప్ కిషన్ కామెడీ సిరీస్ - సూపర్ సుబ్బు ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి వచ్చేసిన సందీప్ కిషన్ కామెడీ సిరీస్ - సూపర్ సుబ్బు ఎందుకు చూడాలంటే?
Jana Nayagan Release Date : జన నాయగన్‌కు సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ - సీఎం విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
జన నాయగన్‌కు సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ - సీఎం విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Gurthukosthunnayi Web Series Review - 'గుర్తుకొస్తున్నాయి' రివ్యూ: ETV Winలో కొత్త వెబ్ సిరీస్... నవ్వుల నోస్టాల్జియా బావుందా?
'గుర్తుకొస్తున్నాయి' రివ్యూ: ETV Winలో కొత్త వెబ్ సిరీస్... నవ్వుల నోస్టాల్జియా బావుందా?
Isakapatnam Web Series Review - 'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
Embed widget