Virat Kohli : కొత్త లుక్‌లో 'కింగ్ కోహ్లీ'- విరాట్ స్టైల్‌కు అభిమానులు ఫిదా
Virat Kohli : ఆస్ట్రేలియా సిరీస్ కోసం విరాట్ కోహ్లీ విదేశాల నుంచి ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌కు తిరిగి వచ్చారు. త్వరలో ఆస్ట్రేలియా వెళ్లనున్నారు.

Virat Kohli : భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ప్రారంభానికి వారం రోజుల కంటే తక్కువ సమయం ఉంది. అంతకుముందు, విరాట్ కోహ్లీ భారతదేశానికి తిరిగి వచ్చాడు, ఇక్కడి నుంచి అతను ఇతర భారత ఆటగాళ్లతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్తాడు. కింగ్ కోహ్లీని మంగళవారం నాడు న్యూఢిల్లీ విమానాశ్రయంలో చూశారు, అక్కడ అతనిని ఘనంగా స్వాగతించారు. విమానాశ్రయంలో విరాట్ నల్లటి చొక్కా, తెలుపు ప్యాంటులో కనిపించాడు, అతని ఈ లుక్ ఫోటో బాగా వైరల్ అవుతోంది.
విరాట్ కోహ్లీ న్యూఢిల్లీ విమానాశ్రయంలో కనిపించగానే అభిమానులు ఎగబడ్డారు. అందుకే అతని నల్ల చొక్కా, తెలుపు ప్యాంటు ఫోటోను ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. IPL 2025 ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ తన పిల్లలు, భార్యతో కలిసి లండన్ వెళ్లారు. ఇప్పుడు ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లేందుకు టీంతో కలిసేందుకు లండన్ నుంచి వచ్చారు. అతను గత సంవత్సరం T20 ఫార్మాట్ నుంచి,టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు.
నివేదిక ప్రకారం, భారత జట్టు 2 వేర్వేరు ఫార్మాట్‌లలో ఆస్ట్రేలియాకు బయలుదేరుతుంది. కొంతమంది ఆటగాళ్ళు ఉదయం, మిగిలిన ఆటగాళ్ళు సాయంత్రం టిక్కెట్లు దొరికాయి. వారు వేర్వరు టైంలలో ఆస్ట్రేలియా విమానాన్ని పట్టుకుంటారని చెప్పారు. టీమ్ ఇండియా ఇక్కడి నుంచి నేరుగా పెర్త్ వెళ్తుంది, అక్కడ అక్టోబర్ 19న భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మొదటి వన్డే మ్యాచ్ జరగనుంది.
Virat Kohli clicked at Delhi Airport Today. 📸🖤 pic.twitter.com/CAQkdrSxEL
— Virat Kohli Fan Club (@Trend_VKohli) October 14, 2025
రిటైర్మెంట్ ఊహాగానాల మధ్య, విరాట్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత మొదటిసారిగా వన్డే మ్యాచ్ ఆడుతున్నాడు. కొద్ది రోజుల క్రితం చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత జట్టును ప్రకటించినప్పుడు, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే ప్రపంచ కప్ 2027లో ఆడటంపై ఎటువంటి స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.
ఈ వన్డే సిరీస్‌కు శుభ్‌మన్‌గిల్ భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. చాలా కాలం తర్వాత రోహిత్ శర్మ ఈ వన్డే సిరీస్‌లో బ్యాట్స్‌మెన్‌గా కనిపిస్తాడు. గిల్ వన్డే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం ఇదే మొదటిసారి. ఇటువంటి పరిస్థితిలో 2027 ప్రపంచ కప్ కోసం విరాట్- రోహిత్ పట్ల చీఫ్ సెలెక్టర్ల వైఖరి ఇద్దరు సీనియర్ ఆటగాళ్ల కెరీర్‌కు మంచి సంకేతం కాదని విశ్లేషకులు అంటున్నారు.




















