Rohit Sharma vs Gautam Gambhir । రోహిత్ కి షాకింగ్ కౌంటర్ ఇచ్చిన గంభీర్ | AbBP Desam
టీం ఇండియాలో coach Gautam Gambhir, మాజీ కెప్టెన్ Rohit Sharma మధ్య.. ఇంటర్నల్ గా చాలా స్ట్రాంగ్ cold war నడుస్తున్నట్లుంది. రీసెంట్ గా జరిగిన ceat cricket awards event లో hit man Rohit Sharma.. 2025 champions trophy గెలిచిన క్రెడిట్ మొత్తం టీమిండియా మాజీ head coach Rahul Dravid కి ఇచ్చి.. ఆ టోర్నీ గెలిచిన టైం లో జట్టు head coach గా ఉన్న గౌతమ్ గంభీర్ కి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక దీనికి tit-for-tat అన్నట్లు ఇప్పుడు గంభీర్.. అటు హిట్ మన్ తో పాటు ఇటు రాహుల్ ద్రావిడ్ కి కలిపి solid counter వేశాడు. West Indies తో జరుగుతున్న టెస్ట్ సీరీస్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గంభీర్.. టెస్టుల్లో టీమిండియా lowest point అంటే 2024 India vs New Zealand సీరీసేనని, ఆ ఓటమిని టీమిండియా ఎప్పటికీ మర్చిపోకూడదని అన్నాడు. ఆ సీరీస్ లో new Zealand team ని India ఒడిస్తుందని అంతా అనుకున్నా.. దారుణంగా 3-0 తో భారత్ ఓడిపోయిందని.. అలాంటి పరిస్థితి మళ్లీ తెచ్చుకోకూడదని.. గంభీర్ అనడం ఆ సిరీస్ కి కెప్టెన్ గా ఉన్న రోహిత్ కే కౌంటర్ వేసినట్లుంది. రోహిత్ కెప్టెన్సీని తక్కువచేయడమే కాకుండా.. 2025 champions trophy credit Rahul Dravid కి ఇచ్చినప్పుడు 2024 లో జరిగిన ఈ టెస్ట్ సిరీస్ ఓటమి క్రెడిట్ కూడా ద్రావిడ్ దే కదా అన్నట్లు గంభీర్ మాట్లాడాడు. అయితే ఆ టెస్ట్ సిరీస్ కి కూడా గంభీరే కోచ్ గా ఉండటం గమనార్హం. ఏది ఏమైనా ఇప్పుడు గంభీర్ రోహిత్ మధ్య నడుస్తున్న ఈ కోల్డ్ వార్ ఎక్కడివరకు వెళ్తుందో చూడాలి.





















