Rajkumar Santoshi: చెక్ బౌన్స్ కేసులో దర్శకుడికి రెండేళ్లు జైలుశిక్ష, రూ.2 కోట్లు ఫైన్
Rajkumar Santoshi: బాలీవుడ్‌లో సీనియర్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజ్‌కుమార్ సంతోషికి జామ్‌నగర్ కోర్టు రెండేళ్ల జైలు శిక్షను విధించడం బీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Director Rajkumar Santoshi: బాలీవుడ్‌కు చెందిన సీనియర్ దర్శకుడు తన అప్‌కమింగ్ మూవీలో బిజీగా ఉన్న సమయంలోనే అనుకోని షాక్ ఎదురయ్యింది. మామూలుగా సినీ పరిశ్రమలో చెక్ బౌన్స్ కేసులు కామన్. అలాంటి ఒక కేసులోనే ఈ దర్శకుడికి జామ్‌నగర్ కోర్టు ఊహించని షాకిచ్చింది. ఆయన మరెవరో కాదు రాజ్‌కుమార్ సంతోషి. బాలీవుడ్‌లో పలు సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన రాజ్‌కుమార్ సంతోషికి చెక్ బౌన్స్ కేసులో రెండేళ్లు జైలు శిక్షతో పాటు భారీగా ఫైన్‌ను కూడా విధించింది. ఈ విషయం ప్రస్తుతం బీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం రాజ్‌కుమార్ సంతోషి ‘లాహోర్ 1947’ మూవీతో బిజీగా ఉన్నారు.
10 చెక్‌లు బౌన్స్..
రాజ్‌కుమార్ సంతోషి తెరకెక్కిస్తున్న ‘లాహోర్ 1947’లో సన్నీ డియోల్, ప్రీతి జింతా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారని సమాచారం. ప్రముఖ పారిశ్రామిక వేత్త అశోక్ లాల్.. రాజ్‌కుమార్ సంతోషిపై జామ్‌నగర్‌లో చెక్ బౌన్స్ కేసును నమోదు చేశారు. అశోక్ లాల్ చెప్పినదాని ప్రకారం రాజ్‌కుమార్ సంతోషి.. తనకు రూ.1 కోటి విలువ చేసే 10 చెక్‌లు ఇచ్చారని.. అవన్నీ ఒకటి తర్వాత ఒకటి బౌన్స్ అవుతూ వచ్చాయని ఆయన ఫిర్యాదు తెలిపారు. ఆయన తరపున లాయర్‌గా వ్యవహరించిన పీయుష్ భోజనీ కూడా ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. అశోక్ లాల్.. రాజ్‌కుమార్ సంతోషి కోసం రూ.1 కోటి రూపాయలు ఇచ్చారని లాయర్ చెప్పుకొచ్చారు.
డబుల్ అమౌంట్..
అశోక్ లాల్ దగ్గర తీసుకున్న రూ.1 కోటి రూపాయలను తిరిగి ఇవ్వడం కోసం రూ.10 లక్షలు విలువ చేసే 10 చెక్‌లను రాసిచ్చారట రాజ్‌కుమార్ సంతోషి. అవి బ్యాంకులో డిపాసిట్ చేయగానే బౌన్స్ అయ్యాయని.. ఈ విషయంపై రాజ్‌కుమార్‌ను సంప్రదించాలని ప్రయత్నించినా తను స్పందించలేదని అశోక్ లాల్ ఆరోపించారు. ఎంత ప్రయత్నించినా దర్శకుడు స్పందించకపోవడంతో నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం కేసును నమోదు చేశానని అన్నారు. దీంతో ఇటీవల కోర్టులో ఈ కేసు హియరింగ్ జరిగింది. రాజ్‌కుమార్ సంతోషికి రెండేళ్ల జైలు శిక్షను విధిస్తున్నట్టుగా కోర్టు తీర్పునిచ్చింది. అంతే కాకుండా అశోక్ లాల్‌కు చెల్లించాల్సిన మొత్తాన్ని డబుల్ చేసి ఇవ్వాలని చెప్పింది. అంటే మొత్తంగా రూ.2 కోట్లు ఇవ్వాలని అర్థం.
మూడు సూపర్ హిట్లు..
అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్‌తో చేతులు కలిపి రాజ్‌కుమార్ సంతోషి ‘లాహోర్ 1947’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. సన్నీ డియోల్, అమీర్ ఖాన్, రాజ్‌కుమార్ సంతోషి.. ఈ ముగ్గురు ఎన్నో ఏళ్లుగా బాలీవుడ్‌లో ఉన్నా వీరంతా కలిసి సినిమా చేయడం ఇదే మొదటిసారి. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ సంస్థపై తెరకెక్కుతున్న 17వ చిత్రం ఇది. ఇప్పటికే రాజ్‌కుమార్ సంతోషి, సన్నీ డియోల్ కాంబినేషన్‌లో ‘ఘాయల్’, ‘దామిని’, ‘ఘాటక్’ అనే మూడు బ్లాక్‌బస్టర్ చిత్రాలు తెరకెక్కాయి. చివరిగా 2023లో ‘బ్యాడ్ బాయ్’ అనే సినిమాను డైరెక్ట్ చేశారు రాజ్‌కుమార్ సంతోషి. ‘లాహోర్ 1947’తో పాటు ‘ఆన్ మెన్ ఎట్ ఖాకీ’ అనే మరో సినిమాను కూడా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
Also Read: నెట్‌ఫ్లిక్స్‌పై కోర్టులో కేసు - ఆ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ ఆపేయలని ఫిర్యాదు