Akhanda 2: గంజాయిపై బాలకృష్ణ ఉక్కుపాదం... 'అఖండ 2'లో మెసేజ్ & పొలిటికల్ సెటైర్?
Balakrishna: 'గంజాయి' మీద గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ ఉక్కుపాదం మోపినట్టు తెలుస్తోంది. ఆయన హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'అఖండ 2'లో మెసేజ్ ఇచ్చారట.

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడు మాత్రమే కాదు... సామాజిక బాధ్యత కలిగిన ప్రజా ప్రతినిధి కూడా! ఆయన హిందూపూర్ శాసన సభ్యుడు. సినిమాల ద్వారా ప్రేక్షకులకు వినోదం అందిస్తూ... శాసన సభ్యుడిగా సేవ చేస్తున్నారు. వీలైనప్పుడు తన సినిమాలలో ప్రజలకు సందేశం అందిస్తున్నారు. తాజా సినిమా 'అఖండ 2'లో ఒక పొలిటికల్ మెసేజ్ ఇచ్చారట.
గంజాయిపై బాలకృష్ణ ఉక్కుపాదం!
ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు... వైసిపి ప్రభుత్వంలో రాష్ట్రంలో గంజాయి సాగు, వాడకం విచ్చలవిడిగా జరిగిందని విమర్శలు ఉన్నాయి. మరి ముఖ్యంగా విశాఖతో పాటు ఏజెన్సీ ప్రాంతాల మీదుగా ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి గంజాయి రావడం, పోలీసులు కొందరిని అరెస్టు చేయడం వంటి విషయాలు తెలిసినవే. ఇప్పుడు ఈ గంజాయి మీద 'అఖండ 2'లో బాలకృష్ణ ఉక్కు పాదం మోపినట్లు తెలిసింది.
Also Read: కూలీ Vs వార్ 2... ఓపెనింగ్ డే రజనీ టాప్... ఎన్టీఆర్ మూవీ కలెక్షన్స్ ఎంత - తేడా తెలిస్తే షాక్!
'అఖండ 2' సినిమాలో గంజాయికి వ్యతిరేకంగా సందేశం ఇచ్చే ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని దర్శకుడు బోయపాటి శ్రీను డిజైన్ చేశారట. ఆ పార్ట్ చిత్రీకరణ బాగా వచ్చిందట. సామాజిక సందేశం ఇవ్వడంతో పాటు పొలిటికల్ సెటైర్ వెయ్యడంలో బోయపాటి శ్రీను స్పెషలిస్ట్. గత సినిమాలలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఆయన ప్రజలకు సందేశం ఇచ్చారు. ఇప్పుడు కూడా అటువంటి విధంగా యువతకు సందేశం ఇచ్చేలా, గంజాయి వద్దని చెప్పేలా సన్నివేశాలు రాశారట.
సెప్టెంబర్ 25న సినిమా వస్తుందా?
Akhanda 2 Release Date: 'అఖండ 2' చిత్రీకరణ పూర్తి అయింది. అయితే సెప్టెంబర్ 25న ఈ సినిమా థియేటర్లలోకి వస్తుందా? లేదా? అనే సందేహం నెలకొంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మించిన 'ఓజీ' సైతం సెప్టెంబర్ 25న విడుదల చేసేలా సిద్ధం చేస్తున్నారు. రెండు సినిమాలలో ఏదో ఒకటి వాయిదా పడే అవకాశం ఉందని వినబడుతుంది. మరి ఏ సినిమా థియేటర్లలోకి వస్తుంది? ఏ సినిమా వెనక్కి వెళుతుంది? అనేది చూడాలి.
Also Read: కూలీ vs వార్ 2... బిజినెస్‌లో ఎవరిది అప్పర్ హ్యాండ్? మార్కెట్టులో ఎవరి సినిమా క్రేజ్ ఎక్కువ?





















