By: ABP Desam | Updated at : 09 Jul 2023 12:58 PM (IST)
Image Credit: Vaishnavi/Instagram
హీరో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన తారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘బేబీ’. సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ జులై 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ ప్రమోషన్స్‌లో బిజీబిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల వివాదాస్పద ప్రశ్నలతో వైరల్ అవుతోన్న ఓ జర్నలిస్ట్ ‘బేబీ’ టీమ్‌ను ఇంటర్వ్యూ చేశారు. అయితే, ఇందులో ఒక ప్రశ్నకు వైష్ణవి చైతన్య ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇంటర్వ్యూలో భాగంగా ఆ జర్నలిస్ట్ ‘‘వైష్ణవి ముద్దు పెట్టుకుంటా’’ అని అన్నారు. దీంతో ఆ వైష్ణవికి ఆయన మాట అర్థమైనా.. అర్థం కానట్లు చూసింది. కాసేపు ఆమె అయోమయంలో ఉన్న తర్వాత.. ఆ జర్నలిస్ట్ అసలు విషయాన్ని చెప్పారు. ‘‘ఫస్ట్ టీజర్‌లో హీరో వైష్ణవి ముద్దు పెట్టుకుంటా అంటాడు. దానికి మీ సమాధానం ఏమిటి?’’ అనే ప్రశ్నతో కవర్ చేశారు. అందుకు తగినట్లుగానే.. వైష్ణవి ‘‘చెప్పు తెగుద్ది’’ అని కాసేపు గ్యాప్ ఇచ్చింది. ఆ తర్వాత ‘‘చెప్పు తెగుతుందని చెబుతా’’ అని సమాధానం ఇచ్చింది. అయితే, వైష్ణవి కావాలనే అలా సమాధానం చెప్పిందో.. లేకపోతే సినిమాలో ఆ డైలాగ్‌కు ఆమె చెప్పే సమాధానం గురించి తెలిపిందా అనేది ఆమెకే తెలియాలి. అయితే, అవకాశం కోసం ఎదురు చూస్తున్న ట్రోలర్స్‌కు ఆ జర్నలిస్ట్ మరోసారి దొరికిపోయినట్లయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీమ్ క్రియేటర్స్ ఓ ఆట ఆడుకుంటున్నారు.
హ్యాపీ అవ్వండి 🤗😋#BabyTheMovie #Baby #sureshkondeti #Tollywood #Telugu #TeluguNews #TeluguFilmNagar @ananddeverkonda @SKNonline @harish2you pic.twitter.com/poC9lqQeN5
— Kiran Mahesh (@kiranmahesh026) July 8, 2023
ఇటీవల విడుదలైన ‘బేబీ’ ట్రైలర్ యూత్‌ను ఆకట్టుకుంటోంది. ‘‘మొదటి ప్రేమకు మరణం లేదు, మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది’’ అనే లైన్ ఒక్క డైలాగ్‌తో కాన్సెప్ట్ మొత్తం చెప్పేశారు. కాలేజీలో చేరక ముందు ఎంతో ప్రాణంగా ప్రేమించి అమ్మాయి.. ఆ తర్వాత పూర్తిగా అపరిచితురాలిగా మారిపోవడంతో.. దేవదాసుగా మారే ప్రేమికుడి కథే ‘బేబీ’. మరి, ఆమె ఎందుకలా మారుతుంది? ఎలాంటి పరిస్థితులు వల్ల ఆమె మీరోకు దూరమవుతుందనేది తెరపైనే చూడాలి. ట్రైలర్‌కు ఇప్పటికే పాజిటివ్ బజ్ వచ్చింది. సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఆనంద్‌కు ఈ మూవీ హిట్ ఇచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎందుకంటే.. టాలీవుడ్ ఇప్పటికే మంచి లవ్ స్టోరీస్‌కు దూరమైంది. కాబట్టి, యూత్‌కు ఈ మూవీ నచ్చే అవకాశాలున్నాయి.
ఇటీవల ‘బేబీ’ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్ ఒక్కసారిగా వివాదంలో చిక్కుకుంది. 'బేబీ' సినిమా రిలీజ్ డేట్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే వివాదానికి గురైంది. ఈ పోస్టర్ స్త్రీల మనోభావాలను కించపరిచే విధంగా ఉండడంతో ఈ పోస్టర్ పై సోషల్ మీడియాలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఓ వ్యక్తి మిడిల్ ఫింగర్ పై హీరోయిన్‌ని నిలబడి ఉన్నట్లుగా ఆ పోస్టర్‌ను డిజైన్ చేశారు. నిజానికి రీసెంట్‌గా విడుదలైన పాటలు, టీజర్ తో డీసెంట్ లవ్ స్టోరీగా ప్రచారంలో ఉన్న 'బేబీ' లాంటి సినిమాకి కూడా మేకర్స్ ప్రమోషన్ కోసం ఇలాంటి అభ్యంతరకర పోస్టర్లను వాడుకోవడం చాలామంది ఆడియన్స్ కి ఆశ్చర్యం కలిగిందని చెప్పాలి. అయితే 'బేబీ' రిలీజ్ డేట్ పోస్టర్ పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న వేళ సినిమా దర్శకుడు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాడు. అంతేకాకుండా ఆ పోస్టర్ ని తొలగించారు.
హ్యాపీ అవ్వండి 🤗😋#BabyTheMovie #Baby #sureshkondeti #Tollywood #Telugu #TeluguNews #TeluguFilmNagar @ananddeverkonda @SKNonline @harish2you pic.twitter.com/poC9lqQeN5
— Kiran Mahesh (@kiranmahesh026) July 8, 2023
Also Read: మీకు Project K టీ షర్ట్ ఉచితంగా కావాలా? ఇదిగో ఇలా బుక్ చేసుకోండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Vijay Antony: పాన్ ఇండియా రేంజ్‌లో విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం ‘హిట్లర్’, ఆసక్తికరంగా మోషన్ పోస్టర్
Sapta Sagaralu Dhaati: ‘సప్త సాగరాలు దాటి’ సినిమాకు సీక్వెల్ - తెలుగు, కన్నడలో ఒకేసారి రిలీజ్
Vijay Sethupathi: అందుకే కృతి శెట్టిని తిరస్కరించాడట - విజయ్ సేతుపతిలా మన హీరోలు చేయగలరా?
Vijay Antony: మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టిన విజయ్ ఆంటోనీ, నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్
Shiva Rajkumar: హీరో సిద్ధార్థ్‌కు క్షమాపణలు చెప్పిన కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్
RK Roja: ఆటో డ్రైవర్ అవతారంలో మంత్రి రోజా, లోకేశ్‌పై తీవ్ర వ్యాఖ్యలు - ముందస్తు బెయిల్ ఎందుకు?
Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
ODI World Cup 2023: అక్షర్ పటేల్ సంచలన పోస్టులు, కావాలనే తప్పించారా! అతడి బాధ వర్ణనాతీతం
/body>