అన్వేషించండి

మీకు Project K టీ షర్ట్ ఉచితంగా కావాలా? ఇదిగో ఇలా బుక్ చేసుకోండి

మీకు ‘ప్రాజెక్ట్ కె’ టీ షర్టులు ఉచితంగా కావాలా? అయితే, ఇలా చేయండి. అయితే, వాటిని పొందాలంటే మీకు లక్ ఉండాలి.

‘ప్రాజెక్ట్ -K’... ప్రభాస్ నటిస్తోన్న మరో భారీ చిత్రం ఇది. ఈ మూవీని ప్రటించిన రోజు నుంచే విపరీతమైన హైప్ ఉంది. దానికి తగినట్లే.. చిత్రయూనిట్ కూడా అప్‌డేట్స్‌తో అంచనాలు పెంచేస్తోంది. ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ఈ మూవీ.. ప్రేక్షకుల ముందుకు రావడానికి కాస్త టైమ్ పట్టే అవకాశాలున్నాయి. అయితే, అప్పటివరకు అభిమానులను వెయిట్ చేయించి బోరు కొట్టించకుండా ‘ప్రాజెక్ట్-కె’ టీమ్.. ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటోంది. తాజాగా ‘What is #ProjectK?’ పేరుతో టీషర్ట్‌లను అందుబాటులోకి తెచ్చింది. కామిక్-కాన్ వేడుకలో భాగంగా ‘ప్రోజెక్ట్-కె’ ఈ టీషర్టులను అందిస్తోంది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనేలా తమ సోషల్ మీడియా వేదికలపై దీన్ని ప్రమోట్ చేశారు. 

‘ప్రాజెక్ట్ కె’ టీషర్టులను ఎలా పొందాలి? 

‘What is #ProjectK?’ ప్రింట్‌తో కొన్ని టీషర్టులను ప్రాజెక్ట్-కె టీమ్ ఉచితంగానే అందిస్తోంది. అయితే, వాటిని సొంతం చేసుకోవాలంటే మాత్రం అభిమానులకు లక్ కూడా ఉండాలి. ఎందుకంటే.. చాలా తక్కువ పరిమితిలో లిమిటెడ్ ఎడిషన్‌లో వీటిని అందిస్తున్నారు. మొదటి విడతగా కేవలం 10 టీషర్టులు మాత్రమే పెట్టారు. వాటిని అలా ఆన్‌లైన్‌లో పెట్టారో లేదో.. 2 నిమిషాల్లోనే అన్నీ బుక్ అయిపోయాయి. మీకు కూడా వాటిని సొంతం చేసుకోవాలంటే వైజయంతి మూవీస్ ట్విట్టర్ లేదా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లోకి వెళ్లి.. వారు అందుబాటులో ఉంచిన లింక్ మీద క్లిక్ చేసి సబ్‌స్క్రైబ్ కావాల్సిందే. ఆ లింక్ మీద నొక్కగానే మీకు ‘ప్రాజెక్ట్-కె’ పోస్టర్ కనిపిస్తుంది. దాని పక్కనే ఉన్న వైజయంతి మూవీస్ లోగో మీద క్లిక్ చేయండి. అక్కడ మీకు సబ్‌స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే చాలు. అయితే, మీరు కొత్తగా వైజయంతి మూవీస్ యూట్యూబ్ వీడియోకు సబ్‌స్క్రైబ్ చేసుకుంటున్నట్లయితే మీ ఈమెయిల్ ఐడీ అడుగుతుంది. అల్రెడీ మీరు సబ్‌స్క్రైబ్ చేసుకుని ఉంటే మాత్రం మీకు వారి యూట్యూబ్ చానెల్ మాత్రమే కనిపిస్తుంది. అయితే, వారు ఆ టీషర్ట్‌లు అందుబాటులోకి తెచ్చే సమయాన్ని (డ్రాప్ టైమ్)ను ట్విట్టర్ ద్వారా  తెలియజేస్తారు. అప్పుడు క్లిక్ చేస్తే మీరు టీషర్ట్స్ సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే, లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి.. వాటిని పొందం కొంచెం కష్టమే. కానీ, ట్రై చేసి చూడండి.  

అంతర్జాతీయ వేదికపై గ్రాండ్‌గా టైటిల్ రిలీజ్

‘ప్రాజెక్ట్-కె’ మూవీ టైటిల్‌ను అంతర్జాతీయ వేదికపై గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు. ఈ నెల (జులై) 19 నుంచి అమెరికాలోని శాన్ డియాగోలో కామిక్ కాన్ వేడుకల జరగనున్నాయి. అక్కడే జులై 20న ప్రాజెక్ట్‌గా టైటిల్‌తోపాటు గ్లింప్స్ రిలీజ్ చేస్తారు. ఈ కార్యక్రమానికి ప్రభాస్‌తోపాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత అశ్వినీదత్ కూడా పాల్గొంటారు. ఈ సమాచారం తెలియగానే ప్రభాస్ అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. ప్రభాస్ నటిస్తోన్న ‘సలార్’ మూవీ టీజర్ గురువారం సోషల్ మీడియా వేదికగా విడుదలైన సంగతి తెలిసిందే. మరికొద్ది రోజుల్లోనే ‘ప్రాజెక్ట్-కె’ గ్లింప్స్ కూడా వస్తుందని తెలియడంతో ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. 

Read Also : దళపతి విజయ్ షాకింగ్ నిర్ణయం, సినిమాలకు మూడేళ్లు బ్రేక్? కారణం అదేనా?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
WhatsApp New Feature: వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Embed widget