అన్వేషించండి

Shivam Bhaje Movie: శివం భజే... యంగ్ హీరో అశ్విన్ బాబు రౌద్ర రూపం చూశారా?

అశ్విన్ బాబు కథానాయకుడిగా గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా 'శివం భజే'. ఇటీవల ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

'రాజుగారి గది' సిరీస్ సినిమాలతో విజయాలు అందుకున్న కథానాయకుడు అశ్విన్ బాబు (Ashwin Babu). 'హిడింబ'తో మాస్ రూటులోకి వచ్చారు. ఆయన హీరోగా రూపొందుతున్న తాజా సినిమా 'శివం భజే' (Shivam Bhaje Movie). తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రమిది. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రమిది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?

రౌద్ర రూపంలో అశ్విన్ బాబు!
Ashwin Babu First Look From Shivam Bhaje: 'శివం భజే' టైటిల్ కొన్ని రోజుల క్రితం అనౌన్స్ చేసినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చిందని దర్శకుడు సంతోషం వ్యక్తం చేశారు. లేటెస్టుగా విడుదల చేసిన హీరో అశ్విన్ బాబు ఫస్ట్ లుక్ సైతం అందర్నీ ఆకట్టుకుంటోందని ఆయన చెప్పారు.

'శివం భజే' ఫస్ట్ లుక్ చూస్తే... ఒంటి కాలి మీద నిలబడటమే కాదు, ఒంటి చేత్తో ఓ మనిషిని పైకి ఎత్తిన అశ్విన్ బాబు రౌద్ర రూరంలో కనపడతారు. ఆయన వెనుక అఘోరాలు, త్రిశూలాలు, చీకట్లో కాగడాలు, ఆ వెనుక ఒక దేవుడి విగ్రహం కూడా కనిపించాయి. మరి, 'శివం భజే'లో ఆయన ఏం చూపించబోతున్నారు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కొన్ని రోజులు ఆగితే తప్ప ఈ లుక్ వెనుక రహస్యం ఏమిటి? అనేది రివీల్ కాదు.

Also Read: ఓటేసిన యువ తారలు ఏపీలో ఇద్దరు హీరోలు, పిఠాపురంలో ఓ దర్శకుడు, గుడివాడలో మరో దర్శకుడు... మరి హైదరాబాద్‌లో ఎవరెవరు?

'శివం భజే' ఫస్ట్ లుక్ విడుదల చేసిన సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ...  ''మా గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలో వైవిధ్యమైన కథతో అశ్విన్ బాబు హీరోగా ఈ సినిమా నిర్మిస్తున్నాం. కొత్త కథ, కథనాలతో దర్శకుడు అప్సర్ మంచి స్క్రిప్ట్ రెడీ చేశారు. ఇదొక న్యూ ఏజ్ ఫిల్మ్ అని చెప్పవచ్చు. దాశరథి శివేంద్ర అదిరిపోయే విజువల్స్ అందించారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేశాం. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. హై టెక్నికల్ స్టాండర్డ్స్ మైంటైన్ చేస్తూ రాజీ పడకుండా మూవీని ప్రొడ్యూస్ చేశాం. ప్రపంచవ్యాప్తంగా జూన్ నెలలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం'' అని చెప్పారు. దర్శకుడు అప్సర్ మాట్లాడుతూ... ''టైటిల్ కంటే ఎక్కువ స్పందన ఫస్ట్ లుక్, అశ్విన్ బాబుకు రావడం సంతోషంగా ఉంది. హీరో హీరోయిన్లతో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాత మహేశ్వర రెడ్డి గారి సహకారంతో అంచనాలకు మించి సినిమా రూపొందుతోంది. త్వరలో టీజర్, సాంగ్స్ రిలీజ్ గురించి అనౌన్స్ చేస్తాం'' అని చెప్పారు.

Also Read: మెగా డాటర్ నిహారిక కొణిదెల మాజీ భర్త చైతన్య సెన్సేషనల్ పోస్ట్... జనసేనకు ఆయన వ్యతిరేకమా?


'శివం భజే' సినిమాలో బాలీవుడ్ నటుడు, సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. ఇంతకు ముందు మెగాస్టార్ చిరంజీవి 'జై చిరంజీవా'తో పాటు రాజ్ తరుణ్ 'కిట్టూ ఉన్నాడు జాగ్రత్త' సినిమాలు తెలుగులో ఆయన చేశారు. ఈ సినిమాలో దిగంగనా సూర్యవంశీ కథానాయిక. 'హైపర్' ఆది, సాయి ధీన, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి,దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, 'షకలక' శంకర్, కాశీ విశ్వనాథ్, ఇనాయా సుల్తానా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కూర్పు: ఛోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్, సంగీత దర్శకుడు: వికాస్ బడిస, ఫైట్ మాస్టర్: పృథ్వీ - రామకృష్ణ, ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర, నిర్మాత: మహేశ్వర్ రెడ్డి మూలి, దర్శకత్వం: అప్సర్.

Also Read: అభిమాని గుండెలపై ఎన్టీఆర్ సంతకం - పోలింగ్ బూత్ వద్ద అరుదైన దృశ్యం

టాప్ హెడ్ లైన్స్

Adarsha Kutumbam: ఆదర్శ కుటుంబం నుంచి అర్థాంతరంగా తప్పించారు... త్రివిక్రమ్ సినిమాపై పూజిత పొన్నాడ సంచలన కామెంట్స్
ఆదర్శ కుటుంబం నుంచి అర్థాంతరంగా తప్పించారు... త్రివిక్రమ్ సినిమాపై పూజిత పొన్నాడ సంచలన కామెంట్స్
Sharwanand Dimple Hayathi : శర్వానంద్, డింపుల్‌పై ట్రోలింగ్స్ - డైరెక్టర్ సంపత్ నంది రియాక్షన్
శర్వానంద్, డింపుల్‌పై ట్రోలింగ్స్ - డైరెక్టర్ సంపత్ నంది రియాక్షన్
Ramayana Oscar : ఆస్కార్ బరిలో రామాయణ - హాలీవుడ్ మూవీస్‌కు పోటీగా...
ఆస్కార్ బరిలో రామాయణ - హాలీవుడ్ మూవీస్‌కు పోటీగా...
Ekalavya Series OTT : AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
Union Cabinet Decisions: ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
Telangana Congress Politics: తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
Dog Kills Leopard Cub: కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
Ekalavya Series OTT : AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
MyTDP App: 10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
Munagaku Pakodi : మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
Actor Venkatesh: డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
Embed widget