మత్స్యకారుల సేవలో పథకం కింద అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రూ. 20,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది.
Matsyakarula Sevalo Scheme: మత్స్యకారుల ఖాతాల్లో రూ.20000 జమ చేసిన సీఎం చంద్రబాబు, జాబితాలో పేరు లేకపోతే ఏం చేయాలంటే!
Matsyakarula Sevalo Schme Amount | వేట నిషేధ సమయంలో ఏపీ ప్రభుత్వం మత్స్యకారుల సేవలో పథకంలో భాగంగా మత్స్యకారుల కుటుంబాలకు రూ.20 వేలు ఆర్థిక సాయం విడుదల చేసింది.

- కూటమి ప్రభుత్వం 1.30 లక్షల మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సాయం విడుదల చేసింది.
- వేట నిషేధ భృతిగా రూ.20 వేలు అర్హుల ఖాతాల్లో జమ చేశారు.
- మత్స్యకారుల సేవలో పథకం కింద రూ.262 కోట్లు పంపిణీ చేశారు.
- ఎన్టీఆర్ బాటలో మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది.
Matsyakarula Sevalo In Andhra Pradesh | కావలి: ఆంధ్రప్రదేశ్‌లోని మత్స్యకార కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. మత్స్యకారుల సేవలో పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,30,796 మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ భృతిగా రూ.20 వేల చొప్పున ఆర్థికసాయాన్ని ప్రభుత్వం మంగళవారం నాడు విడుదల చేసింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో జరిగే బహిరంగ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని, లబ్ధిదారుల ఖాతాల్లో మొత్తం రూ.262 కోట్లను జమ చేశారు. ఒకవేళ అర్హత ఉండి జాబితాలో పేరు లేని వారు మత్స్యశాఖ కార్యాలయాలను సంప్రదించి లబ్ధి పొందాలని సూచించింది. మత్స్యకారుల సేవలో కార్యక్రమానికి మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, అచ్చెన్నాయుడు, ఫరూఖ్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి తదితర ప్రముఖులు హాజరయ్యారు.
నేను సముద్రంలో వేటకు పోలేను.. మీకు ఆ ధైర్యం ఉంది..
కావలి మండలం తుమ్మలపెంటలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సముద్రంలోకి నేను వెళ్లలేను. కానీ మీకు ఆ ధైర్యం ఉంది. ఎంత పెద్ద అల వచ్చినా సమర్థంగా ఎదుర్కొని వేట కొనసాగించడం మీకు పుట్టుకతోనే వచ్చిందంటూ మత్స్యకారులను కొనియాడారు. మత్స్యకారులను పట్టించుకున్న మొదటి సీఎం ఎన్టీఆర్ అని, ఆయన బాటలో తమ ప్రభుత్వం నడుస్తుందన్నారు. వెయ్యి కిలోమీటర్ల తీరం ఉండటం మనకు వరం అన్నారు. నీళ్లు ఉన్నచోట నాగరికత అభివృద్ధి చెందింది. కృష్ణా నదితో విజయవాడ అభివృద్ధి చెంది. ఇక్కడ సోమశిల ఉండటంతో నెల్లూరు డెవలప్ అవుతోంది. గోదావరి నదితో రాజమండ్రి దిగ్విజయంగా ఉంది. తీర ప్రాంత జిల్లాలు, మత్స్యకారుల జీవితాల్లో మార్పు తీసుకురావాలని కూటమి ప్రభుత్వం పట్టుదలతో ఉంది.
ఎన్నికల హామీని నెరవేరుస్తూ, గతంలో ఉన్న సాయాన్ని భారీగా పెంచి, ఒక్కో అర్హత కలిగిన కుటుంబానికి రూ. 20,000 చొప్పున ప్రభుత్వం నేరుగా మత్స్యకారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. సముద్రంలో మత్స్య సంపద పెంపొందించేందుకు వీలుగా ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజులపాటు వేటపై నిషేధం విధిస్తారు. ఈ పథకం కింద మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లపై ఆధారపడే లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నగదు బదిలీ అవుతుంది.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Frequently Asked Questions
మత్స్యకారుల సేవలో పథకం కింద ఎంత ఆర్థిక సహాయం అందిస్తున్నారు?
వేట నిషేధ కాలం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది?
సముద్రంలో మత్స్య సంపదను పెంపొందించేందుకు ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు వేటపై నిషేధం విధిస్తారు.
ఈ పథకం కింద లబ్ధిదారులకు డబ్బు ఎలా జమ చేస్తున్నారు?
మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తున్నారు.
అర్హత ఉండి జాబితాలో పేరు లేని వారు ఏమి చేయాలి?
ఒకవేళ అర్హత ఉండి జాబితాలో పేరు లేని వారు మత్స్యశాఖ కార్యాలయాలను సంప్రదించి లబ్ధి పొందవచ్చు.
ట్రెండింగ్ వార్తలు






















