Ram Pothineni: అరుదైన వ్యాధితో బాధ పడుతున్న అభిమాని... ఇంటికి వెళ్లిన రామ్ పోతినేని - రియల్ లైఫ్‌లోనూ హీరోయే
Ram Pothineni Meets Fan: రీల్ లైఫ్‌లో మాత్రమే కాదు... రియల్ లైఫ్‌లోనూ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరో అనిపించుకున్నారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని ఇంటికి వెళ్లారు.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) లైమ్ లైట్‌లో చాలా అంటే చాలా తక్కువ కనిపిస్తారు. సినిమాలు విడుదలకు సిద్ధమైన తరుణంలో కనిపిస్తారు. ఆ తర్వాత మాయం అవుతారు. కానీ, అభిమానులకు ఇబ్బంది అంటే వాళ్ళను కలవడానికి ఎప్పుడూ ముందుంటారు. తన అభిమాని ఒకరు అరుదైన వ్యాధితో బాధ పడుతుందని తెలిసి ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆ వివరాల్లోకి వెళితే....
రామ్ అభిమానికి ఫ్రెడ్రిచ్ అటాక్సియా
రామ్ పోతినేని అభిమాని ఒకరు ఫ్రెడ్రిచ్ అటాక్సియా (Friedreich's Ataxia) అనే అరుదైన వ్యాధితో బాధ పడుతున్నారు. అదొక జన్యుపరమైన రుగ్మత. ఆ వ్యాధి బారిన పడిన వ్యక్తులకు... మెదడు, వెన్నుపాము, నరాల వ్యవస్థ ప్రభావితం అవుతుంది. అది వస్తే శరీర సమన్వయం, నడక దెబ్బ తింటాయి. సుమారు 18 ఏళ్ళ నుంచి రామ్ అభిమాని ఈ అరుదైన వ్యాధితో బాధ పడుతున్నారు. అది తెలిసి ఆ అభిమాని ఇంటికి వెళ్లారు రామ్. రీల్ లైఫ్‌లో మాత్రమే కాదు... రియల్ లైఫ్‌లో కూడా హీరో అనిపించుకున్నారు.
A fan girl of Ram Pothineni battling Friedrich’s Ataxia for 18 years had one dream to meet @ramsayz once in her life. ❤️✨
— RAm POthineni Fc (@PothineniFc) May 18, 2026
After hearing her story, RAPO immediately decided to visit her home today and make her dream come true. 🥹🙏
A real hero, on and off screen #RamPothineni pic.twitter.com/pCyGlvqDcw
రామ్ దర్శకత్వంలో రామ్ హీరోగా...
Ram Pothineni Upcoming Movies: సినిమాల విషయానికి వస్తే... 'ఆంధ్రా కింగ్ తాలూకా'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు ఆయన దర్శకత్వం వహిస్తున్నారు. అందులో ఆయన హీరో. ఇటీవల సినిమా అనౌన్స్ చేశారు. రామ్ తొలిసారి మెగా ఫోన్ పడుతున్న సినిమా ఎలా ఉంటుందో అని ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఉన్నారు.
Also Read: Ravi Mohan Vs Kushboo - 'జయం' రవి కాపురంలో చిచ్చు పెట్టిందెవరు? ఖుష్బూ భుజాలు తడుముకోవడం ఎందుకు?
View this post on Instagram
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు





















