Madhuri Rathod Reaction : నన్ను బూతులు తిడుతూ అవమానించారు - ఈశ్వర్ సాయి భార్యపై మాధురి రాథోడ్ కంప్లైంట్
Eshwar Sai Madhuri Rathod : ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ పోలీసులను ఆశ్రయించారు. తనను ఈశ్వర్ సాయి భార్య బూతులు తిడుతూ అవమానించారని కంప్లైంట్ చేశారు.

Folk Dancer Madhuri Rathod Complaint Against Eshwar Sai Wife : ఫేమస్ ఫోక్ డ్యాన్సర్స్ ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. వేములవాడలోని ఓ హోటల్‌లో వీరిద్దరూ సన్నిహితంగా ఉండగా... ఈశ్వర్ సాయి భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన భర్తకు, తనకు ఎలాంటి గొడవలు లేవని... అంతా సెటిల్ చేసుకున్నట్లు చెప్పారు ఈశ్వర్ సాయి భార్య.
ఈశ్వర్ సాయి భార్యపై కంప్లైంట్
తాజాగా, ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్... ఈశ్వర్ సాయి భార్యపై పోలీసులకు కంప్లైంట్ చేశారు. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. 'ఈశ్వర్ సాయి భార్య నన్ను బూతులు తిడుతూ అకారణంగా చేయి చేసుకున్నారు. నా వీడియోస్ షూట్ చేయడమే కాకుండా, ఐఫోన్ కూడా దొంగిలించారు. ఇన్ స్టా, ఫేస్ బుక్, సోషల్ మీడియాలో నా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు.' అంటూ పోలీసులకు తెలిపారు.
ఈశ్వర్ సాయి భార్య సహా తన గురించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ... మాధురి రాథోడ్ వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : Chiranjeevi : చిరు పంచె అంచు కదలదు... ఏనుగును చూసి కుక్కలు మొరుగుతాయ్ - అన్నయ్య జోలికొస్తే...
ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్... ఇద్దరూ ఫేమస్ ఫోక్ డ్యాన్సర్స్. వీరిద్దరూ కలిసి నటించిన సాంగ్స్ యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా రాతిరి రాతిరి రాతిరిలో, సన్న సన్న బియ్యమే, సీటీ చీర, ప్రమీల, కళ్లకు కాటుక దిద్దినారో, అది అబ్బబ్బాగా పోరి, లయి లయి లబ్బరి బొమ్మ వంటి సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. 'బాసింగా బలాలే' సాంగ్‌తో ఈశ్వర్ సాయి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో ఈ పాటతో వేల కొద్దీ రీల్స్ పుట్టుకొచ్చాయి.
ఈశ్వర్ సాయి భార్య... మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయిని ఓ హోటల్‌లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో గత రెండు రోజులుగా సోషల్ మీడియా అంతా వీరి గురించే కోడై కూస్తోంది. ఈ వీడియోలు ట్రెండ్ అయ్యాయి. తన భర్తకు సపోర్ట్ చేసిన ఈశ్వర్ సాయి భార్య... తన భర్తతోనే కలిసి ఉంటానని... తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. చాలా మంది సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేస్తున్నట్లు ఆరోపించారు. తాజాగా, ఈశ్వర్ సాయి భార్యపైనే మాధురి రాథోడ్ కంప్లైంట్ ఇచ్చారు.
Also Read : Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
Before You Go
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
ట్రెండింగ్ వార్తలు






















