Chaitanya Jonnalagadda: ఎలక్షన్ డే... మెగా డాటర్ నిహారిక మాజీ భర్త చైతన్య సెన్సేషనల్ పోస్ట్
Niharika Ex Husband Post: నిహారిక కొణిదెల మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ ఎన్నికల రోజున సోషల్ మీడియాలో సెన్సేషనల్ పోస్ట్ చేశారు. ఓటు హక్కు, రాజకీయ పార్టీ మద్దతు గురించి అందులో ఏమన్నారంటే?
తెలుగు చిత్రసీమ మద్దతు ఎవరికి ఉంది? ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టాలీవుడ్ ఎవరి వైపు నిలబడింది? వంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి పెద్దగా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం లేదు. జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan)కు మెజారిటీ జనాలు మద్దతు పలికారు. మెగా ఫ్యామిలీని పక్కన పెడితే... ఆయనతో పని చేసిన హీరోయిన్లు, దర్శకులు చాలా మంది సోషల్ మీడియా వేదికగా పవన్, జనసేన పార్టీకి ఓటు వేయమని పిలుపు ఇచ్చారు. మరి, మాజీ మెగా అల్లుడి మద్దతు ఎవరికి ఉంది? నిహారిక మాజీ భర్త ఏమని చెబుతున్నారు? అంటే... ఎన్నికల రోజు సోషల్ మీడియాలో ఆయన చేసిన పోస్ట్ చూడాలి.
వ్యతిరేకంగా ఓటు వేయమని చెప్పలేదు!
ఎన్నికల వేళ ప్రలోభాలకు, అసత్య ప్రచారాలకు ప్రభావితం కాకూడదని... నిజమే మార్గదర్శిగా, వాస్తవాలే వేదికగా పోలింగ్ బూత్ వైపు అడుగులు వేయమని... మీ ఓటు హక్కుకు ఉన్న శక్తి గట్టిగా వినిపించేలా నిర్ణయం తీసుకోమని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో నిహారిక కొణిదెల మాజీ భర్త వెంకట చైతన్య జొన్నలగడ్డ పేర్కొన్నారు. అది కాదు అసలు మ్యాటర్... ఆ తర్వాత కింద మరొక విషయం కూడా ఆయన స్పష్టం చేశారు.
''ఏదైనా పార్టీకి మద్దతుగా లేదా వ్యతిరేకంగా ఓటు వేయమని నేను ఎప్పుడూ అడగలేదు. ఆ విధంగా అడగను కూడా! ఎందుకంటే... ఓటు ఎవరికి వేయాలి? అనేది ప్రజల వ్యక్తిగత నిర్ణయం. అటువంటి నిర్ణయాలపై ప్రజలకు గానీ, ఆయా నియోజక వర్గానికి కూడా జవాబుదారీగా ఉండని వ్యక్తుల ప్రభావం ఉండకూడదు'' అని చైతన్య జొన్నలగడ్డ పేర్కొన్నారు.
జనసేన పార్టీకి వ్యతిరేకంగా లేదంటే మద్దతుగా ఆయన పోస్ట్ చేయలేదు. ఓటు హక్కు ప్రజలు తీసుకోవాల్సిన నిర్ణయం అని చెప్పారు. మాజీ భార్య నిహారిక తండ్రి నాగబాబు లేదంటే బాబాయ్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీద స్పందించలేదు.
Also Read: అభిమాని గుండెలపై ఎన్టీఆర్ సంతకం - పోలింగ్ బూత్ వద్ద అరుదైన దృశ్యం
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 2024 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలుస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేశం అవసరం లేదు. ఇంతకు ముందు కొన్ని ఎన్నికల్లో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు పోటీ పడ్డారు. అయితే, ఈసారి ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, ఆయన వైఎస్ఆర్‌సీపీ పార్టీకి వ్యతిరేకంగా స్వయంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, జగన్ సోదరి షర్మిల పోటీలో నిలబడ్డారు.
Also Read: చిరు, మోహన్ బాబు, జక్కన్న to ఎన్టీఆర్, బన్నీ... బాధ్యతగా ఓటేసిన ప్రముఖులను ఫోటోల్లో చూడండి!
సొంత అన్నయ్య జగన్ మీద రాజకీయ పరమైన విమర్శలు చేశారు షర్మిల. వైఎస్ వివేకానంద రెడ్డి (బాబాయ్) హత్య కేసు చుట్టూ ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎక్కువ శాతం నడిచాయి. చెల్లెలు అని చూడకుండా తన పార్టీ కార్యకర్తల చేత సోషల్ మీడియాలో దారుణంగా బూతులు తిట్టించారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా ఆయన అల్లుడు వీడియోలు విడుదల చేశారు. టీడీపీ, జనసేన పార్టీలకు కుటుంబ సభ్యుల నుంచి అటువంటి పరిస్థితి తలెత్తలేదని చెప్పవచ్చు.