అన్వేషించండి

Telangana Govt Jobs News: తెలంగాణ నిరుద్యోగులకు భారీ ఊరట! ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి 44కు పెంపు!

Telangana Govt Jobs News: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ట వయోపరిమితి మరో 10 ఏళ్లపాటు పెంచుతూ జీవో నెంబర్‌ 86ను జారీ చేసింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రభుత్వ ఉద్యోగ వయోపరిమితి పదేళ్లు పెంచింది ప్రభుత్వం.
  • ఓసీ అభ్యర్థులకు 44 ఏళ్ల వరకు దరఖాస్తు అవకాశం.
  • నిరుద్యోగ సమస్య, ఆలస్యం నేపథ్యంలో ఈ సడలింపు.
  • పోలీసు, యూనిఫామ్ ఉద్యోగాలకు ఈ పెంపు వర్తించదు.

Telangana Govt Jobs News: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న లక్షల మంది నిరుద్యోగులకు రేవంత్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్‌ల్లో ప్రత్యక్ష నియామకాల కోసం నిర్దేశించిన గరిష్ట వయోపరిమితిని మరో 10 ఏళ్లపాటు పెంచుతూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు జీవో జీవో నెంబర్‌ 86 నుంచి విడుదల చేశారు. 

44 ఏళ్ల వరకు ఓసీ అభ్యర్థులు ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు

ఈ నిర్ణయంతో ఇప్పటి వరకు 34 ఏళ్లుగా ఉన్న గరిష్ట వయోపరిమితి ఇప్పుడు 44 ఏళ్లకు చేరుకుంది. ఈ పెంపు కేవలం ఒక ఏడాదిపాటు అమలులో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.  ఇప్పుడు కొత్తగా వచ్చిన జీవో ప్రకారం ఓసీ అభ్యర్థులు 44 ఏళ్ల వరకు ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. మిగతా కేటగిరిల రిజర్వేషన్ బట్టి వారి వయోపరిమితి పెరుగుతుంది.   

వయపరిమితి పెంచడానికి కారణమేంటీ?

తెలంగాణ రాష్ట్ర అండ్‌ సబార్డినేట్‌ సర్వీస్‌‌ రూల్స్, 1996 ప్రకారం... ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 34 ఏళ్లుగా నిర్ణయించారు. అయితే రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్య, నోటిఫికేషన్ల జారీలో జరిగిన ఆలస్యం దృష్ట్యా, అభ్యర్థులు వయసు దాటిపోతున్నామనే ఆందోళనలో ఉన్నారు. దీనిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వ, రాబోయే ఒక ఏడాది కాలంలో ఇచ్చే నోటిఫికేషన్లకు పదేళ్ల వయసు అదనపు సడలింపును ప్రకటించింది. అంటే ఓపెన్ కేటగిరి అభ్యర్థులు 44 ఏళ్ల వయసు వరకు పోటీ పడవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర రిజర్వేషన్ వర్గాలకు ఈ 44 ఏళ్లకు అదనంగా వారి వారి కేటగిరి సడలింపు వర్తిస్తాయి. 

Also Read: చైన్ స్నాచర్లే కాదు చీరలెత్తి చూసే దరిద్రులూ ఉన్నారు - హైదరాబాద్‌లో జరిగిన ఈ సీసీటీవీ దృశ్యాలు చూస్తే అసహ్యం వేస్తుంది!

ఈ వయోపరిమితి పెంపునకు కారణాలు రెండు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షల మంది నిరుద్యోగ యువత, తాము వయోపరిమితి ముగిసే దశలో ఉన్నామని, గత కొన్నేళ్లుగా సరైన నోటిఫికేషన్లు లేకపోవడం వల్ల తమకు అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు పంపారు. వారి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

గతంలో 12 ఏళ్లకు పెంపు

గతంలో ఫిబ్రవరి 8, 2024న ప్రభుత్వం జీవో నంబర్‌ 30ని విడుదల చేసింది. ఆ సమయంలో వయోపరిమితిని పదేళ్లకు అదనంగా మరో రెండేళ్లు పెంచి మొత్తం 46 ఏళ్లకు పెంచారు. అయితే ఈ జీవో గడువు 2026 ఫిబ్రవరితో ముగిసింది. దీంతో వయోపరిమితి మళ్లీ ప్రాథమిక స్థాయి అయిన 34 ఏళ్లకు పడిపోయింది. ఈ గ్యాప్‌ను భర్తీ చేయడానికి, కొత్త నోటిఫికేషన్లలో అభ్యర్థులకు అవకాశం కల్పించడానికి ప్రభుత్వం కొత్త జీవోను తీసుకొచ్చింది. 

Also Read: బండి భగీరథ్ పోక్సో కేసులో మరో సిట్ ఏర్పాటు, నేడు కస్టడీకి కోరుతూ కోర్టులో పోలీసులు పిటిషన్

జీవో నెంబర్‌ 86 ప్రకారం, ఈ పదేళ్ల వయోపరిమితి సడలింపు ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచి ఒక ఏడాదిపాటు మాత్రమే అమలులో ఉంటాయి. ఈ ఏడాది కాలంలో వివిధ రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీలు విడుదల చేసే నోటిఫికేషన్లకు మాత్రమే ఈ సడలింపు వర్తిస్తుంది. 

ఈ సడలింపు అన్ని ప్రభుత్వం ఉద్యోగులకు వర్తించదు. ప్రభుత్వం స్పష్టంగా పేర్కొన్నట్టుగా, సివిల్ ఉద్యోగాలు, గ్రూప్స్‌, సెక్రటేరియట్‌ పోస్టులు ఇతర సాధారణ ప్రభుత్వ ఉద్యోగాలకు ఇది వర్తిస్తుంది. పోలీసు, ఎక్సైజ్‌, ఫైర్‌, జైళ్ల శాఖ వంటి యూనిఫామ్‌ సర్వీసులకు ఈ వయోపరిమితి పెంపు వర్తించదని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 

Also Read: జలమండలి జీఎం కుమార్ ఇళ్లపై ఏసీబీ దాడులు.. కుప్పలుగా నోట్ల కట్టలు, 100 కోట్ల ఆస్తులు గుర్తింపు !

Frequently Asked Questions

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి ఎంత పెంచారు?

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని మరో 10 ఏళ్లు పెంచారు. దీంతో ఓసీ అభ్యర్థులు 44 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు.

ఈ వయోపరిమితి పెంపు ఎంతకాలం అమలులో ఉంటుంది?

ఈ వయోపరిమితి పెంపు ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుండి ఒక ఏడాది పాటు మాత్రమే అమలులో ఉంటాయి. ఈ ఏడాదిలో విడుదలయ్యే నోటిఫికేషన్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

ఏయే ప్రభుత్వ ఉద్యోగాలకు ఈ వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది?

సివిల్ ఉద్యోగాలు, గ్రూప్స్, సెక్రటేరియట్ పోస్టులు, ఇతర సాధారణ ప్రభుత్వ ఉద్యోగాలకు ఈ వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.

పోలీసు, ఎక్సైజ్ వంటి యూనిఫాం సర్వీసులకు ఈ వయోపరిమితి పెంపు వర్తిస్తుందా?

లేదు, పోలీసు, ఎక్సైజ్, ఫైర్, జైళ్ల శాఖ వంటి యూనిఫాం సర్వీసులకు ఈ వయోపరిమితి పెంపు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget