అన్వేషించండి

Telangana Rains: ద్రోణి ప్రభావంతో తెలంగాణలో 2 రోజులపాటు వర్షాలు.. మరోవైపు దంచికొడుతున్న ఎండలు

Hyderabad Rains | తెలంగాణలో ఓవైపు ఎండల తీవ్రత అధికంగా ఉండగా, మరోవైపు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Telangana Rains Latest News | హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు కీలక సూచనలు చేశారు. అల్పపీడన ద్రోణి, ఉపరితల చక్రవాత ఆవర్తనం ప్రభావంతో రాగల  రోజుల పాటు (ఇవాళ, రేపు, ఎల్లుండి) పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ సైతం తెలిపారు. 

ఈ జిల్లాల్లో రెండు, మూడు రోజులు వర్షాలు
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎండలతో ఇబ్బంది పడుతున్న రాష్ట్ర ప్రజలకు వర్షాలతో కాస్త ఉపశమనం కలగనుంది. ప్రధానంగా హైదరాబాద్‌తో పాటు నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

Also Read: Heatwave In AP and Telangana: తెలుగు రాష్ట్రాల్లో భానుడి ఉగ్రరూపం.. వచ్చే వారం రోజులు అప్రమత్తంగా ఉండాలని IMD వార్నింగ్!

మరోవైపు, రాష్ట్రంలో ఒకే సమయంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు తలెత్తనున్నాయి. మంగళవారం (మే 19) నుంచి తెలంగాణవ్యాప్తంగా ఎండల తీవ్రత విపరీతంగా పెరగనుందని, వారం రోజులపాటు అదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు హెచ్చరించారు. ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పలు జిల్లాలకు అత్యంత ప్రమాదకరమైన రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్‌, జగిత్యాల జిల్లాలకు ఈ హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఓవైపు ఎండల తీవ్రత, మరోవైపు వర్షాలు
ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, అందువల్ల ఆయా ప్రాంతాలకు కూడా రెడ్ అలర్ట్ వర్తిస్తుందని పేర్కొన్నారు. వీటికి తోడు రేపు కుమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు (Heatwaves) వీచే అవకాశముందని, ప్రజలు మధ్యాహ్న సమయంలో బయటకు వచ్చేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.

కేరళ నైరుతి రుతుపవనాల రాకపై అప్‌డేట్
కేరళ ప్రాంతంలో నైరుతి రుతుపవనాల విస్తరణకు అవసరమైన తీరుగా వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి. కేరళంలో రుతుపవనాల రాకకు నిర్దేశించిన ఈ ప్రమాణాలు మే 29 తర్వాత మాత్రమే పూర్తి కానున్నాయి. తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా ప్రకారం కేరళలోకి నైరుతి రుతుపవనాలు మే 30కి రెండు రోజుల ముందు లేదా తరువాత  ప్రవేశించే అవకాశం ఉంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy America Tour Cancelled: తెలంగాణ సీఎం అమెరికా పర్యటన రద్దు! కేంద్రం నిరాకరించడానికి కారణం ఏంటి? రేవంత్ ఏమన్నారు? 
తెలంగాణ సీఎం అమెరికా పర్యటన రద్దు! కేంద్రం నిరాకరించడానికి కారణం ఏంటి? రేవంత్ ఏమన్నారు? 
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Embed widget