అన్వేషించండి

Heatwave In AP and Telangana: తెలుగు రాష్ట్రాల్లో భానుడి ఉగ్రరూపం.. వచ్చే వారం రోజులు అప్రమత్తంగా ఉండాలని IMD వార్నింగ్!

Heatwave In Andhra Pradesh | మే 19 నుంచి వారం రోజులపాటు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని, ఏపీ, తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • Telangana: IMD warns of 45°C heatwave, urges caution.
  • Red alert for 4 districts; 16 others on orange alert.
  • Andhra Pradesh faces heatwave in 28 mandals; light rain possible.
  • Stay hydrated, cover up, and avoid midday sun exposure.

Heatwave In Telangana | హైదరాబాద్: ఈ నెల 19 నుండి 24వ తేదీల మధ్య పగటి వేళల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. సగటు ఉష్ణోగ్రతలు ఏకంగా 45 డిగ్రీల సెల్సియస్ దాటే ప్రమాదం ఉందని , తీవ్రమైన వడగాలులు (Heat Waves) వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు ముఖ్యంగా ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల మధ్య అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని వాతావరణ నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు. సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లు తాగితే డీహైడ్రేషన్, వడదెబ్బ బారిన పడకుండా ఉంటారు. బయటకు వెళ్లేటప్పుడు గొడుగు తీసుకెళ్లాలని, లేకపోతే తలకు క్యాప్ ధరించాలని సూచించారు.
 
మొన్నటివరకూ అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఎండల తీవ్రత దృష్ట్యా తెలంగాణలోని ఆదిలాబాద్‌, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్‌, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, మరో 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 నుండి 44 డిగ్రీల వరకు ఉండగా.. వచ్చే వారం రోజులపాటు పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటవచ్చని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు , అనారోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. రేకుల ఇళ్లలో ఉండేవారు వేడిని తగ్గించుకోవడానికి ఇంటి రేకులపై ఎండుగడ్డి లేదా తడిపిన జనపనార సంచులు వేస్తే కాస్త ఉపశమనం ఉంటుంది. 

ఏపీలో ఈ మండలాల్లో తీవ్ర వడగాలులు

ఏపీలో మే 18న 28 మండలాల్లో వడగాలులు వీచనున్నాయి. మంగళవారం 84 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచనున్నాయి. సోమవారం నాడు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస, బూర్జ, నందిగం, పాతపట్నం, హిరమండలం, కంచిలి, సోంపేటలో.. విజయనగరం జిల్లాలో దత్తిరాజేరు, గంట్యాడ, బాడంగి, బొబ్బిలి, బొండపల్లి,  మెరకముడిదాం, రామభద్రాపురం, సంతకవిటి, తెర్లాం, వంగరలో, మన్యం జిల్లాలోని  జియ్యమ్మవలస, కొమరాడ, బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం,  కురుపాం, పాచిపెంట, పాలకొండ, సాలూరు, సీతంపేట, వీరఘట్టం మండలాల్లో వడగాలులు వీచనున్నాయి. ద్రోణి ప్రభావంతో మే 18న మన్యం, అల్లూరి, పోలవరం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ కేంద్రం అంచనా వేసింది.

Also Read: Kidney Damage Symptoms : కిడ్నీలు దెబ్బతింటే.. ఉదయాన్నే కనిపించే సంకేతాలు ఇవే, అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు

వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి?
సాధారణంగా వేసవిలో చెమట ఎక్కువగా వస్తుంది. వచ్చే వారం ఎండ వేడికి చెమట రూపంలో శరీరం నుంచి ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా పోతుంటాయి. దాంతో తీవ్రమైన అలసట మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. వీలైనంత ఎక్కువ నీరు తాగాలి. కొబ్బరి బొండం,  మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ (ORS), నిమ్మరసంలో కొద్దిగా ఉప్పు, చక్కెర కలుపుకుని తాగినా ప్రయోజనం ఉంటుంది. 

బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్త
ఎండలో ప్రయాణించాల్సి వస్తే, బయటకు వెళ్లాల్సి వస్తే వెంట గొడుగు తీసుకెళ్లాలి. లేకపోతే తలకు టోపీ లేదా తెల్లటి బట్ట  కట్టుకోవడం మంచిది. ముక్కు, చెవుల ద్వారా వేడి గాలి లోపలికి వెళ్లకుండా కర్చీఫ్‌ కట్టుకోవాలి. శరీరానికి గాలి ఆడేలా ఉండే వదులైన కాటన్ దుస్తులు ధరించడం ఎంతో మంచిది.

హైపర్‌టెన్షన్ బాధితులు
బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ కోసం కొన్ని రకాల మందులు వాడేవారిలో మూత్ర విసర్జన ఎక్కువగా ఉంటుంది. కనుక మూత్రం ద్వారా సోడియం, పొటాషియం బయటకు పోతాయి. ఇలాంటి  వారు  సాధారణం కంటే ఎక్కువ నీరు, పండ్ల రసాలు, ఇతర ద్రావణాలు తీసుకోవాలి.

గర్భిణులు, చిన్నారులు, వృద్ధులకు జాగ్రత్తలు
గర్భిణులు, పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ వారం రోజుల పాటు ఎండల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్పా మధ్యాహ్నం వేళ ఇళ్ల నుంచి బయటకు రాకపోవడం మంచిది.

ఒకవేళ వడదెబ్బ తగిలితే ఏం చేయాలి?
మే 19 నుంచి వారం రోజులపాటు వడగాలులు, మరోవైపు భానుడి ప్రతాపానికి ప్రజలు వడదెబ్బకు గురయ్యే అవకాశం అధికంగా ఉంటుంది. రోడ్డుపై కానీ, ఇంట్లో కానీ ఎవరైనా వడదెబ్బకు గురై అస్వస్థతకు లోనైతే.. వారిని వెంటనే చల్లటి ప్రదేశానికి తీసుకెళ్లాలి. శరీరాన్ని పూర్తిగా తడి గుడ్డతో తుడవాలి. వారికి గాలి బాగా ఆడేలా చూడాలి. ఓఆర్‌ఎస్‌ ద్రావణాన్ని తాగించి, అవసరమైతే హాస్పిటల్‌కు తీసుకెళ్లాలి. ఎవరికైనా వాంతులు, విరేచనాలు అవుతుంటే డాక్టర్ వద్దకు తీసుకెళ్లి చికిత్స చేయించాలి. తరువాత వైద్యుల సూచనలు పాటించి వారికి ఆహారం ఇవ్వాలి.

 

 

Frequently Asked Questions

తెలంగాణలో వడగాలుల తీవ్రత ఎంతవరకు ఉండవచ్చు?

ఈ నెల 19 నుంచి 24 వరకు తెలంగాణలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉంది. తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

వడదెబ్బ తగలకుండా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఎక్కువగా నీళ్లు తాగాలి. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్, నిమ్మరసం తాగడం మంచిది. బయటకు వెళ్లేటప్పుడు గొడుగు లేదా టోపీ ధరించాలి.

హైపర్‌టెన్షన్ బాధితులు వడగాల్పుల సమయంలో ఎలా జాగ్రత్త పడాలి?

రక్తపోటు మందులు వాడేవారు సాధారణం కంటే ఎక్కువ నీరు, పండ్ల రసాలు, ఇతర ద్రావణాలు తీసుకోవాలి. మూత్ర విసర్జన ఎక్కువగా ఉండటం వల్ల సోడియం, పొటాషియం నష్టపోకుండా చూసుకోవాలి.

ఒకవేళ ఎవరైనా వడదెబ్బకు గురైతే ఏం చేయాలి?

అస్వస్థతకు గురైన వారిని వెంటనే చల్లటి ప్రదేశానికి తీసుకెళ్లాలి. శరీరాన్ని తడి గుడ్డతో తుడవాలి. ఓఆర్ఎస్ ద్రావణం తాగించి, అవసరమైతే ఆసుపత్రికి తీసుకెళ్లాలి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Advertisement

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget