అన్వేషించండి

India Hottest Cities: భగభగ మండుతున్న భారత్.. భూమిపై 50 వేడినగరాలు మనదేశంలోనే...!

భారత్‌ వేడెక్కుతోందా..? భూమిపైన అత్యంత వేడి ప్రదేశంగా మారుతోందా..? అంతర్జాతీయ వాతావరణ నివేదికలు అదే చెబుతున్నాయి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • భారతదేశంలోని టాప్-50 అత్యంత వేడి నగరాలు, వాతావరణ చరిత్రలో వింత.
  • ఉత్తరప్రదేశ్‌లోని బాందా 46.2°C తో అత్యంత వేడి ప్రాంతంగా రికార్డ్.
  • కాలుష్యం, కాంక్రీట్ భవనాలు, ఎల్ నినో ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణం.
  • భవిష్యత్తులో కొన్ని ప్రాంతాలు నివసించడానికి యోగ్యం కాదని నిపుణుల హెచ్చరిక.

భూమిమీద అత్యంత వేడి ప్రదేశాలంటే.. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ఆఫ్రికన్ దేశాలు అనేది ప్రతి ఒక్కరి భావన. కానీ భారత్ ఇప్పుడు దానిని మించి పోయింది. ఈ భూగ్రహం మీద అత్యంత వేడి ప్రదేశాలు ఇండియాలోనే ఉన్నాయి. ఏప్రిల్ 27న ప్రపంచ వాతావరణ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక వింత చోటుచేసుకుంది. ప్రపంచంలోని టాప్-50 అత్యంత వేడి నగరాల జాబితాలో అన్నీ మన దేశానికే చెందినవే ఉన్నాయి. ఈ షాకింగ్ డీటెయిల్స్ ఇండియాలో ఉష్ణోగ్రతలు పెరుగుదల ఏ రేంజ్‌లో ఉందో తెలియజేస్తున్నాయి. 

అసలేం జరిగింది? (The Shocking Data)
సాధారణంగా ఎండలు అనగానే మనకు ఆఫ్రికా దేశాలు లేదా మధ్యప్రాచ్య (Middle East) దేశాలు గుర్తొస్తాయి. కానీ ఈ ఏడాది ఏప్రిల్ 27న పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ప్లాట్‌ఫారమ్ AQI సేకరించిన డేటా ప్రకారం, ప్రపంచంలోని టాప్-1 నుండి టాప్-50 వరకు ఉన్న హాటెస్ట్ సిటీలన్నీ కేవలం భారతదేశంలోనే ఉన్నాయి. ఇందులో ఒక్క విదేశీ నగరం కూడా లేకపోవడం వాతావరణ నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనికి ఆధునిక వాతావరణ చరిత్రలో ఎటువంటి ముందస్తు ఉదాహరణలు లేవని నిపుణులు చెబుతున్నారు.

టాప్ లో ఉన్న ప్రాంతాలు ఇవే.. 

  • ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్‌లోని బాందా (Banda) పట్టణం  ప్రపంచంలోనే అత్యంత వేడి ప్రాంతంగా నిలిచింది. అక్కడ గరిష్ట ఉష్ణోగ్రత గరిష్ట ఉష్ణోగ్రత 46.2°C రికార్డయ్యింది. ఇక్కడ తెల్లవారుజామున కూడా ఉష్ణోగ్రత 34.7°C గా ఉంది.
  • కాన్పూర్ (UP)46.1°C గరిష్ట ఉష్ణోగ్రతతో నిప్పుల కొలిమిని తలపించింది.
  • మహరాష్ట్రలోని అమరావతి (MAH)- 44.3°C నమోదైంది. 
  • మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలోని అకోలా, యావత్మాల్, చంద్రపూర్ వంటి నగరాలు కూడా టాప్ జాబితాలో ఉన్నాయి.

ఈ 50 ప్రాంతాల జాబితాలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుండి 21  ఉన్నాయి. గంగా మైదాన ప్రాంతం కావడం, చెట్లు తక్కువగా ఉండటం వల్ల ఇక్కడ వేడి తీవ్రత ఎక్కువగా ఉంది. నోయిడా, ఢిల్లీ, గుర్గావ్ వంటి ఎన్‌సీఆర్ (NCR) ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు 44.1°C నుండి 44.9°C మధ్య నమోదయ్యాయి.

ముప్పు పొంచి ఉందా...? 

భారత్ లో కనిపిస్తున్న అసాధరణ వాతావరణ పరిస్థితులు భవిష్యత్ గురించి ఆందోళనకర సూచనలు ఇవస్తున్నాయి.ఏప్రిల్ నెలలో ఇన్ని రికార్డులు బద్దలు కావడం  ఎన్నడూ జరగలేదు. 2050 నాటికి భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు మనుషులు నివసించలేని (Survivability limit) స్థాయికి చేరుకోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇతర కారణాలు:
దేశంలో కాలుష్యం పెరుగుతుండటం కూడా వాతావరణంలో మార్పులకు ముఖ్యకారణం. ప్రపంచంలోని టాప్-100 కాలుష్య నగరాల్లో 66 మన దేశంలోనే ఉన్నాయి. ఘజియాబాద్‌లోని లోని (Loni) పట్టణం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య ప్రాంతంగా నిలిచింది.

నగరాల్లో కాంక్రీట్ భవనాలు, తారు రోడ్ల వల్ల పగటిపూట వేడి భూమిలో నిలిచిపోయి, రాత్రిపూట కూడా చల్లబడటం లేదు.
ఎల్ నినో (El Niño):వాతావరణంలో వస్తున్న మార్పులు, లా నినా నుండి ఎల్ నినోకి మారుతున్న క్రమం వల్ల ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్నాయి.

                      మరిన్ని ఆసక్తికరమైన కథనాలు, వాతావరణ అప్‌డేట్స్ కోసం 'ABP దేశం'ని ఫాలో అవ్వండి!

Frequently Asked Questions

ప్రపంచంలో అత్యంత వేడి ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి?

సాధారణంగా ఆఫ్రికా లేదా మధ్యప్రాచ్య దేశాలు అత్యంత వేడి ప్రదేశాలుగా భావిస్తారు. కానీ ఈ ఏడాది ఏప్రిల్ 27న, ప్రపంచంలోని టాప్-50 అత్యంత వేడి నగరాల జాబితాలో అన్నీ భారతదేశానివే ఉన్నాయి.

భారతదేశంలో అత్యంత వేడి నగరం ఏది?

ఉత్తరప్రదేశ్‌లోని బాందా పట్టణం ప్రపంచంలోనే అత్యంత వేడి ప్రాంతంగా నిలిచింది. అక్కడ గరిష్ట ఉష్ణోగ్రత 46.2°C రికార్డయ్యింది.

భారతదేశంలో వేడి తీవ్రత పెరగడానికి కారణాలు ఏమిటి?

గంగా మైదాన ప్రాంతంలో చెట్లు తక్కువగా ఉండటం, అధిక కాలుష్యం, నగరాల్లో కాంక్రీట్ భవనాలు, తారు రోడ్లు, ఎల్ నినో ప్రభావం వంటివి వేడి తీవ్రత పెరగడానికి కారణాలు.

భారతదేశంలో వాతావరణ మార్పుల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?

భారతదేశంలో కనిపిస్తున్న అసాధరణ వాతావరణ పరిస్థితులు భవిష్యత్తు గురించి ఆందోళనకర సూచనలు ఇస్తున్నాయి. 2050 నాటికి కొన్ని ప్రాంతాలు మనుషులు నివసించలేని స్థాయికి చేరుకోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Karnataka Police Constable Exam Controversy: కర్ణాటక కానిస్టేబుల్ ఉద్యోగ పరీక్షలపై అభ్యర్థుల తిరుగుబాటు - పలు చోట్ల బాయ్ కాట్ - అసలు కారణం ఫేక్ న్యూస్
కర్ణాటక కానిస్టేబుల్ ఉద్యోగ పరీక్షలపై అభ్యర్థుల తిరుగుబాటు - పలు చోట్ల బాయ్ కాట్ - అసలు కారణం ఫేక్ న్యూస్
Prashant Kishor Wins Bankipur Bypoll: పాట్నా కోటలో ప్రశాంత్ కిషోర్ ప్రభంజనం - బంకీపూర్ స్థానంలో గెలుపుతో బీహార్ రాజకీయం కొత్త మలుపు!
పాట్నా కోటలో ప్రశాంత్ కిషోర్ ప్రభంజనం - బంకీపూర్ స్థానంలో గెలుపుతో బీహార్ రాజకీయం కొత్త మలుపు!
Karnataka Cabinet Expansion: కర్ణాటక కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - మరి తెలంగాణలో మార్పు చేర్పులుంటాయా?
కర్ణాటక కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - మరి తెలంగాణలో మార్పు చేర్పులుంటాయా?
Breaking News:హైదరాబాద్‌లో నిరుద్యోగుల మెరుపు ధర్నా- 19వేల పోలీస్‌ ఉద్యోగాలతో నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ !
హైదరాబాద్‌లో నిరుద్యోగుల మెరుపు ధర్నా- 19వేల పోలీస్‌ ఉద్యోగాలతో నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ !
Advertisement

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Auqib Nabi Selection: జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
Eesha Rebba : గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
Embed widget