అన్వేషించండి

Priyanka Gandhi Parliament Speech: వారేమైనా తీవ్రవాదులా? - లోక్‌సభలో కేంద్రాన్ని నిలదీసిన ప్రియాంకా గాంధీ

Priyanka Gandhi Attacks Modi Govt: విద్యార్థుల ఆందోళనలపై పోలీసుల బలప్రయోగం, రబ్బరు బుల్లెట్లు, లాఠీఛార్జ్‌ల వాడకంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ లోక్‌సభ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

Priyanka Gandhi Pellet Guns Speech Loksabha: విద్యార్థుల ఆందోళనలను అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం పోలీసు బలగాలను ఉపయోగించడంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా లోక్‌ సభలో  కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పేపర్ లీకేజీలు, విద్యా వ్యవస్థలోని లోపాలపై నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీఛార్జ్, బాష్పవాయు గోళాలు , వాటర్ క్యానన్లు ,  పెల్లెట్ తుపాకులు వాడటాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. విద్యార్థులు ఏమైనా తీవ్రవాదులా? వారిపై పెల్లెట్ తుపాకులు, ఏకే-47ల స్థాయిలో బలప్రయోగం ఎందుకు చేశారని  కేంద్ర ప్రభుత్వాన్ని నేరుగా నిలదీశారు.

 ఇది ఎవరి సొంత ఆస్తి కాదు.. పార్లమెంట్ ప్రజలది 

విద్యార్థుల  సంసద్ ఛలో  ర్యాలీపై జరిగిన అణచివేతపై ప్రియాంక తీవ్రంగా స్పందిస్తూ.. పార్లమెంట్ ఏ ఒక్కరి వ్యక్తిగత ఆస్తి కాదని, ఇది ఈ దేశ యువతదని స్పష్టం చేశారు. దేశ భవిష్యత్తు అయిన సొంత పిల్లలపై దాడి చేయించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, హక్కుల కోసం ప్రశ్నిస్తున్న నిరుద్యోగులపై లాఠీలు ఝళిపించడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి అద్దం పడుతోందని ఆరోపించారు. విద్యార్థుల ఆందోళన వెనుక ఉన్న నిజమైన ఆవేదనను గుర్తించి, ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా వారితో మాట్లాడాలని డిమాండ్ చేశారు.

 మహిళా నిరసనకారులపై వేధింపులు 

ఈ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థినుల పట్ల భద్రతా బలగాలు, యంత్రాంగం ప్రవర్తించిన తీరుపై ప్రియాంకా గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థినుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, తమ పిల్లలను ఎందుకు ఆందోళనలకు పంపారని వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ దేశంలో మహిళలకు, విద్యార్థినులకు నిరసన తెలిపే రాజ్యాంగ హక్కు లేదా అని ప్రశ్నించిన ఆమె, మహిళా ప్రాతినిధ్యాన్ని అణచివేసేలా ప్రభుత్వం ప్రవర్తిస్తోందని మండిపడ్డారు.   

 ప్రధాని మోదీ, అమిత్ షాల బాధ్యత 

దేశంలో ప్రతి చిన్న విజయానికీ క్రెడిట్ తీసుకునే ప్రధాని నరేంద్ర మోదీ, ఇప్పుడు విద్యార్థులు ఎదుర్కొంటున్న ఈ సంక్షోభానికి ,  వారిపై జరుగుతున్న దాడులకు కూడా పూర్తి బాధ్యత వహించాలని ప్రియాంక  డిమాండ్ చేశారు. విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయడం, వారిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం ఏ రకమైన న్యాయమని ప్రశ్నించారు. హోంశాఖ మంత్రి అమిత్ షా, ప్రధాని మోదీలు ఈ ఘటనలపై సభ వేదికగా సమాధానం చెప్పాలని, బాధిత విద్యార్థులపై నమోదు చేసిన తప్పుడు కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని గట్టిగా పట్టుబట్టారు.
  
సభలో ప్రతిపక్షాల ఆందోళనలు, సభ వెలుపల విద్యార్థుల నిరసనలతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. సమాజంలో ప్రతి రంగానికి సంబంధించిన విజయాలను తమ ఖాతాలో వేసుకునే ప్రభుత్వం, లక్షలాది మంది యువత ఆవేదనను, విద్యార్థుల జీవితాలను తృణీకరించడాన్ని సహించేది లేదని ప్రియాంకా గాంధీ హెచ్చరించారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు, పేపర్ లీకేజీలపై సమగ్ర చర్చ జరిపే వరకు పార్లమెంట్ లోపల, బయట కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
AP CM Chandrababu Speech: ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
El Nino ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
Shubman Gill Flying Catch:  నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..
నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..
Indian Spin Magic, SL Allout: భారత స్పిన్నర్ల మాయాజాలంలో చిక్కుకున్న లంక.. 284 ర‌న్స్ కే ఆలౌట్.. 178 పరుగుల భారీ ఆధిక్యంతో టీమిండియా..
భారత స్పిన్నర్ల మాయాజాలంలో చిక్కుకున్న లంక.. 284 ర‌న్స్ కే ఆలౌట్.. 178 పరుగుల భారీ ఆధిక్యంతో టీమిండియా..
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget