అన్వేషించండి

Heat Wave Alert : 40 డిగ్రీల ఎండలో ఉంటే గంట గంటకు శరీరంలో ఏమి జరుగుతుంది? హీట్ స్ట్రోక్ లక్షణాలు, జాగ్రత్తలు

Summer Heat Body Effects Telugu : ఎండ 40 డిగ్రీలు ఉన్నప్పుడు గంట గంటకు శరీరం అలసిపోతూ చివరకు ప్రమాదకర స్థితికి చేరుతుంది. కాబట్టి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 40 డిగ్రీల వేడిలో గంటకొకసారి శరీరంపై ప్రభావం మారుతుంది.
  • డీహైడ్రేషన్, అలసట, తలనొప్పి, కండరాల బలహీనత వంటివి కలుగుతాయి.
  • తీవ్రత పెరిగితే గుండె, మెదడుపై ప్రభావం, హీట్ స్ట్రోక్ వస్తాయి.
  • ఎండలో బయట తిరగకుండా, నీరు తాగి, జాగ్రత్తలు తీసుకోవాలి.

Body Changes in Extreme Heat : ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం పది తర్వాత బయటకు వెళ్లలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండ 40 డిగ్రీలు దాటేస్తుంది. ఇంత వేడి సాధారణ విషయం కాదు. ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటే.. శరీరంపై ప్రమాదకరమైన ప్రభావం చూపిస్తాయి. అలాంటి ఎండలో ఉంటే గంటగంటకు శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో తెలుసుకుందాం. 

40°C ఎండలో గంట గంటకి శరీరంలో జరిగే మార్పులు ఇవే..

మొదటి గంట : మీరు 40 డిగ్రీలు ఉన్న ఎండలో ఓ గంట ఉంటే శరీరంలో వేడి పెరగడం మొదలవుతుంది. చెమట ఎక్కువగా వస్తుంది. దాహం ఎక్కువగా అవుతుంది. ఈ సమయంలో శరీరం సహజంగా కూల్ అవ్వడానికి ట్రై చేస్తుంది. 

2వ గంట : రెండు గంటలు ఉంటే.. డీహైడ్రేషన్ స్టార్ట్ అవుతుంది. అలసట, బలహీనతగా అనిపించి.. తలపై భారంగా ఉంటుంది. ఈ సమయంలో నీరు తాగకపోతే పరిస్థితి మరింత దిగజారుతుంది. 

3వ గంట : బాడీ టెంపరేచర్ పెరుగుతుంది. తలనొప్పి, చిరాకు మొదలైపోతాయి. చెమట వల్ల శరీరంఎలక్ట్రోలైట్స్ కోల్పోతుంది. 

4వ గంట : నాలుగో గంటకు వచ్చేసరికి కండరాలు బలహీనంగా మారుతాయి. తల తిరగడం పెరుగుతుంది. శరీరం పూర్తిగా అలసిపోతుంది. 

5వ గంట : శరీరం అదుపు తప్పుతుంది. శ్వాస వేగంగా తీసుకోవాల్సి వస్తుంది. హార్ట్ రేట్ పెరుగుతుంది. ఫోకస్ తగ్గిపోతుంది.

6వ గంట : గందరగోళం పెరిగి.. నడవడం కష్టమవుతుంది. చెమట తగ్గిపోవచ్చు. ఇది ప్రమాదకరమైన సంకేతంగా చెప్తారు. 

ప్రమాదకరమైన మార్పులు ఇవే..

ఆ తర్వాత శరీరం కూల్ అవ్వడం ఆగిపోతుంది. చర్మం వేడిగా, డ్రైగా మారి బలహీనపడుతుంది. వాంతులు, తల తిరగడం వంటివి జరుగుతాయి. పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది. గుండె, మెదడు పై ప్రభావమై స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది. హీట్ స్ట్రోక్ రావచ్చు. శరీర ఉష్ణోగ్రత ప్రమాదకర స్థాయికి చేరుతుంది. చికిత్స తీసుకోకుంటే ప్రాణాలు కోల్పోవచ్చు. 

ఈ లక్షణాలు అందరిలోనూ ఒకేలా ఉండవు. ఈ మార్పులు వ్యక్తి నుంచి వ్యక్తికి భిన్నంగా ఉంటాయి. అలాగే వయసు, ఆరోగ్యం, నీరు తాగే అలవాటు వంటి అంశాలు ప్రభావం చూపిస్తాయి. 

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే.. 

ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లకూడదు. వెళ్లాల్సి వచ్చినప్పుడు మాత్రం తరచుగా నీరు తాగాలి. బయటికి వెళ్లేప్పుడు టోపీ, గాగుల్స్ పెట్టుకోండి. మధ్యాహ్నం 12–3 మధ్య బయటికి వెళ్లడం తగ్గించండి. ORS, కొబ్బరి నీరు తీసుకోండి. లైట్ ఫుడ్స్ తీసుకుంటే మరీ మంచిది. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి ఈ వేసవిలో జాగ్రత్తగా ఉండండి. నీరు తాగుతూ.. హైడ్రేటెడ్​గా ఉండండి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Embed widget