Ice Cubes for Face : వేసవిలో ముఖంపై ఐస్ క్యూబ్ అప్లై చేయడం మంచిదేనా? లాభాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Ice Cubes for Face in Summer : సమ్మర్లో ముఖంపై ఐస్ క్యూబ్ అప్లై చేస్తే మంచిదేనా? దానివల్ల కలిగే బెనిఫిట్స్.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసేద్దాం.

- వేసవిలో ఐస్ క్యూబ్స్ చర్మానికి చల్లదనాన్ని, తాజాదనాన్ని అందిస్తాయి.
- ఇవి చర్మ రంధ్రాలను, మొటిమల వాపును, సూర్యతాపాన్ని తగ్గిస్తాయి.
- ముఖంపై రక్త ప్రసరణను మెరుగుపరిచి, చర్మపు మెరుపును పెంచుతాయి.
- ఐస్ ను నేరుగా కాకుండా వస్త్రంలో చుట్టి, పరిమితంగా వాడాలి.
Ice Cubes on Face in Summer Good or Bad : వేసవి కాలంలో చర్మం ఎక్కువగా చెమట పట్టడం, ఆయిల్ ఎక్కువగా రావడం, టాన్, పింపుల్స్ వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ సమయంలో చాలా మంది ఫేస్‌పై ఐస్ క్యూబ్స్ రాయడం ఒక సింపుల్ హోం రెమిడీగా భావిస్తారు. అయితే ఈ సింపుల్ హోం రెమిడీ నిజంగా మంచిదేనా? లేకపోతే ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఐస్ క్యూబ్ రాయడం మంచిదేనా?
ముఖంపై ఐస్‌క్యూబ్ సరైన విధంగా, పరిమితంగా ఉపయోగిస్తే మంచిదే. ఇది చర్మానికి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. కానీ నేరుగా, ఎక్కువగా ఉపయోగిస్తే కొన్ని సమస్యలు కూడా వస్తాయి. మరి ఐస్ క్యూబ్ అప్లై చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటో.. నష్టాలు ఏముంటాయో చూసేద్దాం.
ఐస్ క్యూబ్ అప్లై చేస్తే కలిగే లాభాలు
వేసవిలో వేడి వల్ల వచ్చే ఇరిటేషన్, రెడ్‌నెస్‌ను తగ్గించడానికి ఐస్‌క్యూబ్ మంచి హెల్ప్ చేస్తుంది. అలాగే ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. ఐస్ స్కిన్‌పై అప్లై చేయడం వల్ల స్కిన్ పోర్స్ తాత్కాలికంగా తగ్గుతాయి. ఓపెన్ పోర్స్ కంట్రోల్ అవుతాయి. వేడి, ఇన్‌ఫ్లమేషన్ తగ్గించి.. మొటిమల వాపును తగ్గిస్తుంది. ఆయిల్ స్కిన్ ఉన్నవారికి ఐస్ మంచి ఉపశమనం ఇస్తుంది. అలాగే సూర్యకిరణాల వల్ల వచ్చే బర్నింగ్, టాన్‌ను తగ్గించడంలో సహాయం చేస్తుంది.
కళ్ల కింద ఐస్ క్యూబ్ రాస్తే రక్తప్రసరణ మెరుగుపడి డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి. అలాగే సమ్మర్లో వేడి వల్ల స్కిన్‌పై బంప్స్ వస్తే తగ్గుతాయి. అంతేకాకుండా మేకప్ ముందు ఐస్ రాస్తే స్కిన్ స్మూత్‌గా కనిపిస్తుంది. రక్తప్రసరణ మెరుగవుతుంది. దీనివల్ల ముఖం సహజంగానే గ్లో అవుతుంది. స్కిన్ టోన్ ఫ్రెష్ అవుతుంది. ఫేస్ డల్‌గా ఉన్నప్పుడు అప్లై చేస్తే మంచిది. స్కిన్ రిలాక్స్ అవుతుంది.
ఐస్ క్యూబ్ ఎలా అప్లై చేయాలంటే..
ఐస్‌ను నేరుగా చర్మంపై అప్లై చేయకండి. ఏదైనా క్లాత్‌లో చుట్టి అప్లై చేయాలి. అలాగే ఎక్కువసేపు ఉంచకూడదు. 1 లేదా 2 నిమిషాలు సరిపోతుంది. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు జాగ్రత్తగా ఉపయోగించాలి. రోజుకు ఒకసారి వాడితే సరిపోతుంది. పింపుల్స్ లేదా గాయాలు ఉన్నప్పుడు రాయకండి. ఫేస్‌పై సున్నితంగా మసాజ్ చేస్తూ అప్లై చేయాలి. ఐస్ ఫేస్‌ని డ్రై చేసే అవకాశం ఉంది కాబట్టి వెంటనే మాయిశ్చరైజర్ వాడండి.
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























