అన్వేషించండి

Bandi Bhageerath POCSO Case: బండి భగీరథ్ పోక్సో కేసులో మరో సిట్ ఏర్పాటు, నేడు కస్టడీకి కోరుతూ కోర్టులో పోలీసులు పిటిషన్

Bandi Bhageerath POCSO Case | బండి భగీరద్ పోక్సో వ్యవహారంలో మరో సిట్ ఏర్పాటు ఏర్పాటు చేసి కేసును సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • న్యాయమూర్తిపై దుష్ప్రచారం కేసులో SIT ఏర్పాటు చేశారు.
  • బండి భగీరథ్ కేసుపై విచారణ ముమ్మరం చేశారు.
  • నిందితుడు భగీరథ్ కస్టడీ కోసం పోలీసులు కోరనున్నారు.
  • భగీరథ్ పై కఠినమైన కొత్త బీఎన్ఎస్ సెక్షన్ చేర్చారు.

Bandi Bhagirath Case | హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన బండి భగీరథ్‌కు సంబంధించిన పోక్సో (POCSO) కేసు వ్యవహారంలో హైకోర్టు న్యాయమూర్తిపై సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారంపై దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. జడ్జిపై అనుచిత, అసత్య పోస్టులు పెట్టిన వ్యవహారాన్ని ఛేదించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు రాయసం దామోదర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా, ఈ వివాదంతో సంబంధం ఉన్న మరికొందరిపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నింటినీ సమగ్రంగా దర్యాప్తు చేసేందుకు జాయింట్ సీపీ శ్వేత నేతృత్వంలో ఈ SITను ఏర్పాటు చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ వివాదానికి గల కారణాలను పరిశీలిస్తే.. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌కు గనుక ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే, ఆ హైకోర్టు జడ్జి భర్తకు బార్ కౌన్సిల్ చైర్మన్ పదవి ఇస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేశారు. న్యాయవ్యవస్థ ప్రతిష్టను మసకబార్చేలా సాగిన ఈ ప్రచారంపై ఈ నెల 16న హైకోర్టు రిజిస్ట్రార్ చార్మినార్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం చార్మినార్ పీఎస్ నుండి ఈ కేసును సైబర్ క్రైమ్ విభాగానికి బదిలీ చేశారు. తాజాగా ఈ వ్యవహారంలో ఉన్న కుట్ర కోణాలను, ఇతర నిందితుల పాత్రను పూర్తిగా బయటపెట్టేందుకు జాయింట్ సీపీ శ్వేత ఆధ్వర్యంలోని 'సిట్' రంగంలోకి దిగారు.

Also Read: Bandi Bhageerath POCSO Case: నేరాన్ని అంగీకరించిన బండి భగీరథ్! ఇంతకీ లొంగిపోయాడా ! పోలీసులే పట్టుకున్నారా..?

భగీరథ్‌ను కస్టడీకి కోర్టును కోరనున్న పోలీసులు

బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు, ఆధారాలను సేకరించేందుకు నిందితుడు బండి భగీరథ్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. హై ప్రొఫైల్ కేసు కావడం, ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావడంతో ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ సీరియస్‌‌గా తీసుకుంది. ఈ కేసులో అన్ని కోణాలను లోతుగా విచారించాల్సి ఉన్నందున, భగీరథ్‌ను వారం రోజుల పాటు తమ పోలీసు కస్టడీకి అప్పగించాలని దర్యాప్తు అధికారులు కోర్టు కోరే అవకాశం ఉంది. కోర్టు అనుమతి లభిస్తే నిందితుడిని కస్టడీలోకి తీసుకుని సుదీర్ఘంగా విచారించనున్నారు.

భగీరథ్ స్నేహితుల్ని విచారించిన పోలీసులు
బండి భగీరథ్‌ స్నేహితులను పేట్‌ బషీరాబాద్‌ పీఎస్‌లో పోలీసులు సోమవారం నాడు విచారించారు. ఆ ఘటన జరిగిన రోజు అసలేం జరిగింది, ఎంత మంది ఉన్నారు, ఎందుకు కలిశారు అనే విషయాలపై ఆరా తీశారు. విచారణలో భాగంగా పోలీసులు వారి స్టేట్మెంట్స్ రికార్డు చేశారు.

నిందితుడు బండి భగీరథ్‌పై పోలీసులు మరింత కఠినమైన బీఎన్ఎస్ సెక్షన్‌ను చేర్చారు. ఒకరిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు అభియోగాలు ఉండటంతో పోలీసులు ఈ కొత్త సెక్షన్‌ను నమోదు చేశారు. బండి భగీరథ్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS) లోని 64(2)(m) సెక్షన్‌ను పోలీసులు అదనంగా చేర్చారు. తీవ్రమైన నేరాలకు సంబంధించిన ఈ సెక్షన్‌ను చేర్చడంతో నిందితుడికి చట్టపరంగా ఇబ్బందులు మరింత పెరగనున్నాయి. ఈ కొత్త సెక్షన్ ప్రకారం తప్పు చేసినట్లు రుజువైతే భగీరథ్‌కు 10 ఏళ్ల వరకు జైలుశిక్ష పడుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 

Frequently Asked Questions

బండి భగీరథ్ కేసులో సోషల్ మీడియా దుష్ప్రచారంపై పోలీసులు ఏం చేస్తున్నారు?

జడ్జిపై అనుచిత, అసత్య పోస్టులు పెట్టిన వ్యవహారంపై దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసు విచారణకు ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు.

సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడానికి గల కారణాలు ఏమిటి?

పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌కు ముందస్తు బెయిల్ ఇస్తే, ఆ హైకోర్టు జడ్జి భర్తకు బార్ కౌన్సిల్ చైర్మన్ పదవి ఇస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేశారు.

బండి భగీరథ్‌ను పోలీసులు కస్టడీకి ఎందుకు కోరుతున్నారు?

ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు, ఆధారాలు సేకరించడానికి నిందితుడిని కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. సుదీర్ఘ విచారణ కోసం వారం రోజుల కస్టడీని కోరే అవకాశం ఉంది.

బండి భగీరథ్‌పై ఏ కొత్త సెక్షన్‌ను చేర్చారు?

ఒకరిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు అభియోగాలు ఉండటంతో, భారతీయ న్యాయ సంహిత (BNS) లోని 64(2)(m) సెక్షన్‌ను పోలీసులు అదనంగా చేర్చారు. ఈ సెక్షన్ ప్రకారం రుజువైతే 10 ఏళ్ల వరకు జైలుశిక్ష పడుతుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget