అన్వేషించండి

Bandi Bhageerath POCSO Case: బండి భగీరథ్ కేసులో మరో ట్విస్ట్.. కొత్తగా మరో సెక్షన్ చేర్చిన పోలీసులు.. దోషిగా తేలితే 10 ఏళ్ల జైలు!

Bandi Bhagirath Case Updates | బండి భగరీథ్‌పై నమోదైన పోక్సో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విచారణ చేపట్టి పోలీసులు నిందితుడిపై మరో కఠినమైన సెక్షన్ చేర్చినట్లు తెలుస్తోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • బండి భగీరథ్‌పై పోక్సో కేసులో కొత్త బీఎన్ఎస్ సెక్షన్‌ను చేర్చారు.
  • ఒకే బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేశారనే అభియోగాలపై చర్యలు తీసుకున్నారు.
  • నిందితుడికి మద్దతుగా ప్రచారం చేసిన 14 మంది ఇన్‌ఫ్లూయెన్సర్లపై కేసులు నమోదయ్యాయి.
  • మైనర్ బాలిక వివరాలు, ఫోటోలు ప్రచురించడం చట్టరీత్యా నేరమని పోలీసులు తెలిపారు.

Bandi Bhageerath Case Latest News | హైదరాబాద్: బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసులో పోలీసులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దర్యాప్తు ముమ్మరం చేసిన కొద్దీ ఈ కేసులో రోజుకో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. తాజాగా ఈ కేసులో పోలీసులు నిందితుడు బండి భగీరథ్‌పై మరింత కఠినమైన బీఎన్ఎస్ సెక్షన్‌ను జోడించారు. ఒకే బాధితురాలిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు అభియోగాలు ఉండటంతో పోలీసులు ఈ కొత్త సెక్షన్‌ను నమోదు చేసినట్లు తెలుస్తోంది.

ఈ కేసుకు సంబంధించి బండి భగీరథ్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS) లోని 64(2)(m) సెక్షన్‌ను అదనంగా చేర్చారు. తీవ్రమైన నేరాలకు సంబంధించిన ఈ సెక్షన్‌ను జోడించడంతో నిందితుడికి చట్టపరంగా ఇబ్బందులు మరింత పెరిగే అవకాశం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఈ కొత్త కేసు ప్రకారం తప్పు చేసినట్లు రుజువైతే భగీరథ్‌కు 10 ఏళ్ల వరకు జైలుశిక్ష పడుతుందని తెలుస్తోంది. బాధితురాలి నుంచి సేకరించిన మరికొన్ని వివరాలు, సాంకేతిక ఆధారాల ప్రకారమే పోలీసులు ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం.

మరోవైపు, ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న బండి సాయి భగీరథ్‌ను కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. జైలు నిబంధనల ప్రకారం నేడు వారు చర్లపల్లి జైలుకు వెళ్లి ములాఖత్ ద్వారా భగీరథ్‌ను కలవనున్నారు. కఠినమైన సెక్షన్లు తోడవడంతో తదుపరి లీగల్ ప్రాసెస్, బెయిల్ పిటిషన్లపై ఈ ములాఖత్‌లో కుటుంబ సభ్యులు, న్యాయవాదులు చర్చించే అవకాశం ఉంది.

Also Read: Bandi Bhagirath: భగీరథ్ కేసులో రాజకీయం వర్సెస్ చట్టం - మైలేజ్‌ కోసం బీఆర్ఎస్ ప్రయత్నం - కాంగ్రెస్, బీజేపీ తిప్పికొట్టగలవా?

బండి భగీరథ్‌కు మద్దతుగా వీడియోలు.. 14 మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై కేసులు

బండి భగీరథ్ పోక్సో (POCSO) కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా నిందితుడికి మద్దతుగా విపరీతంగా ప్రచారం నిర్వహిస్తూ, అతడు నిర్దోషి అని చిత్రీకరించే ప్రయత్నం చేసిన పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారంలో మొత్తం 27 మంది ఇన్‌ఫ్లూయెన్సర్లపై ఫిర్యాదులు రాగా, ప్రాథమిక విచారణ అనంతరం అందులో 14 మందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మిగిలిన వారిపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే తదుపరి చర్యలు తీసుకుంటారని అధికారులు తెలిపారు. 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఈ కేసులో ఇన్‌ఫ్లూయెన్సర్లు జోక్యం చేసుకుని.. మైనర్ బాలిక వివరాలు వెల్లడించడం, ఆమె ఫొటోలు పబ్లిష్ చేసి తప్పిదాలు చేశారు. బండి భగీరథ్‌ను సమర్థిస్తూ వీడియోలు, పోస్ట్‌లు, ఫోటోలు పెట్టడానికి వీరంతా భారీగా డబ్బులు తీసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడు ఎలాంటి తప్పు చేయలేదని, కావాలనే అతడిని ఇరికించారంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వీరంతా కావాలనే కుట్రపూరితంగా ఈ కంటెంట్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేశారని బాధితుల తరపున ఫిర్యాదులు అందాయి.

పోక్సో చట్టం కింద తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి అనుకూలంగా సోషల్ మీడియా రూల్స్‌ను అతిక్రమించి మరీ పెయిడ్ ప్రమోషన్లు చేయడం చట్టరీత్యా నేరం. అంతేకాకుండా, నిందితుడిని వెనకేసుకొచ్చే క్రమంలో ఈ ఇన్‌ఫ్లూయెన్సర్లు పరోక్షంగా బాధితుల వివరాలను, వారి గుర్తింపును బయటపెట్టినట్లు సమాచారం. చట్టప్రకారం పోక్సో కేసుల్లో బాధితుల వివరాలను వెల్లడించడం తీవ్రమైన నేరం కావడంతో, నిబంధనలను ఉల్లంఘించిన ఈ 14 మంది ఇన్‌ఫ్లూయెన్సర్లపై పోలీసులు కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Frequently Asked Questions

బండి సాయి భగీరథ్ కేసులో పోలీసులు ఏ కొత్త సెక్షన్ జోడించారు?

ఒకే బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేశారనే ఆరోపణలపై, పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) లోని 64(2)(m) సెక్షన్‌ను అదనంగా చేర్చారు.

కొత్త సెక్షన్ జోడించడం వల్ల బండి భగీరథ్‌కు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి?

ఈ కొత్త సెక్షన్ ప్రకారం, నేరం రుజువైతే అతనికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.

బండి భగీరథ్ కుటుంబ సభ్యులు ఎప్పుడు, ఎక్కడ కలవనున్నారు?

బండి భగీరథ్ కుటుంబ సభ్యులు నేడు చర్లపల్లి జైలుకు వెళ్లి, జైలు నిబంధనల ప్రకారం ములాఖత్ ద్వారా అతన్ని కలవనున్నారు.

బండి భగీరథ్‌కు మద్దతుగా వీడియోలు చేసిన ఎంత మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లపై కేసులు నమోదయ్యాయి?

మొత్తం 27 మంది ఇన్‌ఫ్లుయెన్సర్‌లపై ఫిర్యాదులు రాగా, ప్రాథమిక విచారణ అనంతరం 14 మందిపై పోలీసులు FIR నమోదు చేశారు.

ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఎలాంటి తప్పులు చేశారు?

వారు మైనర్ బాలిక వివరాలు వెల్లడించడం, ఆమె ఫోటోలు పబ్లిష్ చేయడం, మరియు పోక్సో కేసులో బాధితుల వివరాలు బయటపెట్టడం వంటి చట్టవిరుద్ధ పనులు చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News:ఏపి సంపర్క్ క్రాంతి ట్రైన్ లో పొగలు- టెన్షన్ పడ్డ ప్రయాణికులు 
ఏపి సంపర్క్ క్రాంతి ట్రైన్ లో పొగలు- టెన్షన్ పడ్డ ప్రయాణికులు 
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Embed widget