అన్వేషించండి

Bandi Bhageerath Remand: పోక్సో కేసులో బండి భగీరథ్‌కు 14 రోజుల రిమాండ్ విధించిన మేజిస్ట్రేట్

Bandi Bhagirath Surrendered to Police | బండి భగీరథ్‌ను పోక్సో కేసులో విచారణ కోసం పోలీసులకు అప్పగించినట్లు బండి సంజయ్ తెలపగా.. తామే అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • బండి భగీరథ్ పోక్సో కేసులో పోలీసుల ముందు హాజరయ్యారు.
  • హైకోర్టు మధ్యంతర రక్షణ నిరాకరించడంతో కేసు తీవ్ర ఉత్కంఠ రేపింది.
  • భగీరథ్ స్వచ్ఛందంగా లొంగిపోలేదని, పోలీసులు పట్టుకున్నారని సమాచారం.
  • తండ్రి బండి సంజయ్ సూచన మేరకే విచారణకు సహకరించారని వెల్లడి.

Bandi Bhagirath POCSO Case | హైదరాబాద్: బండి భగీరథ్‌కు మేడ్చల్ మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్‌ను పేట్ బషీరాబాద్ పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా రెండు వారాలపాటు (మే 29 వరకు)  రిమాండ్ విధించగా.. అతడ్ని చర్లపల్లి జైలుకు తరలించారు. మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచడానికి ముందు సిట్ అధికారులు దాదాపు 2 గంటలపాటు భగీరథ్‌ను ప్రశ్నించారు. తరువాత మేడ్చల్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో మెడికల్ టెస్టులు నిర్వహించిన తరువాత కోర్టుకు తీసుకొచ్చారు పోలీసులు.

లొంగుబాటా? అదుపులోకి తీసుకున్నారా?

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న బండి భగీరథ్ పోక్సో (POCSO) కేసు ఇప్పుడు సరికొత్త మలుపులు తిరుగుతోంది. గత కొన్ని రోజులుగా పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ ఎట్టకేలకు పోలీసుల వద్దకు చేరుకున్నారు. అయితే, ఆయన పోలీసుల ముందుకు వచ్చిన తీరుపై ఇప్పుడు భిన్నమైన వాదనలు తెరపైకి రావడం విశేషం. హైకోర్టు మధ్యంతర రక్షణ ఇవ్వడానికి నిరాకరించిన నేపథ్యంలో ఈ కేసు ఉత్కంఠ రేపుతోంది.


Bandi Bhageerath Remand: పోక్సో కేసులో బండి భగీరథ్‌కు 14 రోజుల రిమాండ్ విధించిన మేజిస్ట్రేట్

ఈ ఎపిసోడ్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. తన కుమారుడు చట్టాన్ని గౌరవిస్తూ స్వచ్ఛందంగా పోలీసుల విచారణకు హాజరయ్యాడని స్పష్టం చేశారు. "నా కుమారుడు ఏ తప్పు చేయలేదని పదేపదే చెబుతున్నప్పటికీ.. చట్టం ముందు అందరూ సమానమే కాబట్టి, విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలని నేనే స్వయంగా సూచించాను" అని బండి సంజయ్ ట్వీట్ చేశారు. న్యాయవాదుల ద్వారా భగీరథ్‌ను విచారణ నిమిత్తం అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు.

Also Read: Bandi Bageerath Surrendered: పోక్సో కేసులో కీలక పరిణామం.. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన బండి భగీరథ్!

అయితే, ఈ వ్యవహారంలో పోలీసుల వెర్షన్ మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. బండి భగీరథ్ స్వచ్ఛందంగా లొంగిపోలేదని, తామే రంగంలోకి దిగి అప్పా (APPA) జంక్షన్ వద్ద ఆయనను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు పోలీసులు  చెబుతున్నారు. బండి భగీరథ్ కోసం ఇప్పటికే హైదరాబాద్, కరీంనగర్, ఢిల్లీలలో ప్రత్యేక పోలీస్ బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయని, పక్కా సమాచారంతోనే ఆయన్ను పట్టుకున్నామని వెల్లడించారు. ప్రస్తుతం భగీరథ్‌ను పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించగా.. వైద్య పరీక్షల అనంతరం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది.

Also Read: Bandi Sanjay About Bandi Bhagirath: బండి భగీరథ్‌ను ముందే పోలీసులకు అప్పగిద్దామనుకున్నా.. కానీ: బండి సంజయ్

మైనర్ బాలిక ఫిర్యాదు.. పోక్సో కేసు నమోదు..

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఫామ్‌హౌస్‌లో ఒక 17 ఏళ్ల మైనర్ బాలికపై బండి భగీరథ్ లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితురాలైన బాలిక మరియు ఆమె కుటుంబ సభ్యులు మే మొదటి వారంలో పోలీసులను ఆశ్రయించారు. బాలిక ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మే 8వ తేదీన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో భగీరథ్‌పై కేసు నమోదు అయింది. మైనర్ బాలిక కావడంతో పోలీసులు తీవ్రమైన పోక్సో (POCSO) చట్టంలోని సెక్షన్ 11, 12లతో పాటు, భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 74, 75 (మహిళలపై వేధింపులు, దాడి) కింద కేసు నమోదు చేశారు.

Frequently Asked Questions

బండి భగీరథ్ పోక్సో కేసులో తాజా పరిణామం ఏమిటి?

బండి భగీరథ్ పోక్సో కేసులో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతన్ని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

కేంద్రమంత్రి బండి సంజయ్ తన కుమారుడి హాజరుపై ఏమన్నారు?

తన కుమారుడు చట్టాన్ని గౌరవిస్తూ స్వచ్ఛందంగా పోలీసుల విచారణకు హాజరయ్యాడని, తప్పు చేయలేదని విశ్వసిస్తున్నానని బండి సంజయ్ తెలిపారు.

పోలీసులు బండి భగీరథ్ ను ఎలా పట్టుకున్నారు?

పోలీసులు పక్కా సమాచారంతో అప్పా జంక్షన్ వద్ద బండి భగీరథ్ ను అదుపులోకి తీసుకున్నారు. అతని కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.

బండి భగీరథ్ స్వచ్ఛందంగా లొంగిపోయారా?

పోలీసుల వెర్షన్ ప్రకారం, బండి భగీరథ్ స్వచ్ఛందంగా లొంగిపోలేదు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
Telangana Cabinet Decisions: హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget