తన కుమారుడు బండి భగీరథ్‌పై వచ్చిన ఆరోపణలపై చట్టంపై గౌరవంతో, లాయర్ల ద్వారా పోలీసుల విచారణకు అప్పగించారు.
Bandi Sanjay About Bandi Bhagirath: బండి భగీరథ్‌ను ముందే పోలీసులకు అప్పగిద్దామనుకున్నా.. కానీ: బండి సంజయ్
Bandi Bhageerath POCSO Case | తన కుమారుడు బండి భగీరథ్ ఏ తప్పు చేయలేదని, అయితే ఇప్పటికే జాప్యం జరిగిందని స్వయంగా తానే తీసుకొచ్చి పోలీసులకు అప్పగించానని బండి సంజయ్ తెలిపారు.

- కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పోలీసులకు లొంగిపోయారు.
- హైకోర్టు నుండి ముందస్తు బెయిల్ రాని నేపథ్యంలో లొంగుబాటు జరిగింది.
- మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో విచారణకు సహకరిస్తున్నారు.
- చట్టం ముందు అందరూ సమానమేనని బండి సంజయ్ స్పష్టం చేశారు.
Bandi Bhagirath Surrenders | హైదరాబాద్: తన కుమారుడు బండి భగీరథ్ పోలీసులకు లొంగుబాటుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. చట్టంపై ఉన్న గౌరవంతో లాయర్ల ద్వారా బండి భగీరథ్‌ను పోలీసుల విచారణకు అప్పగించినట్లు బండి సంజయ్ కుమార్ తెలిపారు. చట్టం ముందు తన బిడ్డయినా, సామాన్యుడైనా ఒకటేనని, అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. తన కుమారుడు ఏ తప్పు చేయలేదని పదేపదే చెబుతున్నాడని, వాస్తవానికి బాధితుల నుంచి ఫిర్యాదు రాగానే అతనిని పోలీస్ స్టేషన్‌లో అప్పగిద్దామని భావించినట్లు ఆయన పేర్కొన్నారు.
అయితే, ఈ లోపు లాయర్లను సంప్రదించి తమ వద్ద ఉన్న ఆధారాలను వారి ముందు ఉంచామని బండి సంజయ్ తెలిపారు. ఆ ఆధారాలను చూసిన లాయర్లు.. కేసు కొట్టేస్తారని, బెయిల్ తప్పకుండా వస్తుందని చెప్పడం వల్లే పోలీసుల ముందుకు రావడంలో కొంత జాప్యం జరిగిందని కేంద్ర మంత్రి వివరించారు. ఈ రోజు కూడా బెయిల్ వస్తుందని లాయర్లు చెబుతున్నప్పటికీ, ఇకపై మరింత ఆలస్యం చేయడం సరికాదనే ఉద్దేశంతోనే తన కుమారుడిని తీసుకొచ్చి న్యాయవాదుల ద్వారా పోలీసుల విచారణకు స్వయంగా అప్పగించినట్లు స్పష్టం చేశారు.
సోమవారం నాడు కోర్టు నుంచి కీలక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నప్పటికీ, న్యాయ వ్యవస్థపై ఉన్న సంపూర్ణ నమ్మకం, గౌరవంతోనే ముందే విచారణకు పంపించినట్లు బండి సంజయ్ పేర్కొన్నారు. న్యాయస్థానంలో తమకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పేట్‌బషీరాబాద్ పీఎస్‌లో లొంగిపోయిన బండి భగీరథ్!
బండి భగీరథ్ పోక్సో (POCSO) కేసులో శనివారం రాత్రి కీలక మలుపు చోటుచేసుకుంది. ఎలాంటి ముందస్తు బెయిల్ లేదా రక్షణ ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేయడంతో, భగీరథ్ శనివారం రాత్రి పేట్‌బషీరాబాద్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ముందే పోలీసులకు సమాచారం అందించి న్యాయవాదుల ద్వారా ఆయన సరెండర్ అయ్యారు. గత వారం రోజులుగా పరారీలో ఉన్న భగీరథ్ ఎట్టకేలకు పోలీసులకు దొరకడంతో ఈ కేసు విచారణ త్వరగా కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ లొంగుబాటుకు ముందు రాజకీయంగా, న్యాయపరంగా తీవ్ర నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కేంద్రమంత్రి బండి సంజయ్ పెద్దరికంతో వ్యవహరించి తన కుమారుడిని పోలీసులకు అప్పగించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం, ఆ వెంటనే హైకోర్టు సైతం ముందస్తు బెయిల్‌పై తీర్పును వచ్చే వారానికి వాయిదా వేయడంతో భగీరథ్‌కు చట్టపరమైన దారులు మూసుకుపోయాయి.
బండీ భగరీథ్‌పై లుకౌట్ నోటీసులు..
హైకోర్టు ఆదేశాలు, రాజకీయ విమర్శల నడుమ పోలీసులు భగీరథ్ చుట్టూ గట్టి వ్యూహాన్ని రచించారు. ఆయన దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేయడంతో పాటు.. హైదరాబాద్, ఢిల్లీ, కరీంనగర్ పరిధుల్లో ప్రత్యేక బృందాలతో విస్తృతంగా గాలింపు చేపట్టారు. భగీరథ్ స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో తనిఖీలు చేయడమే కాకుండా, చివరకు ఢిల్లీలోని కేంద్రమంత్రి అధికారిక నివాసంలోనూ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఇలా అన్ని వైపుల నుంచి గట్టి నిఘా పెట్టడం, ఎస్కేప్ అయ్యే ఛాన్స్ లేకపోవడంతో భగీరథ్ లొంగిపోక తప్పని పరిస్థితి ఏర్పడింది.
Also Read: Bandi Bhageerath: బండి భగీరథ్‌కు షాక్! ముందస్తు బెయిల్‌పై ఈ దశలో ఆర్డర్ ఇవ్వలేమన్న హైకోర్టు
మే 8న పోక్సో కేసు నమోదు..
ఈ కేసు నేపథ్యాన్ని పరిశీలిస్తే.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌లో భగీరథ్ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఒక 17 ఏళ్ల మైనర్ బాలిక ఫిర్యాదు చేయడంతో మే 8న పేట్‌బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు పోక్సో చట్టంలోని సెక్షన్ 11, 12లతో పాటు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 74, 75 కింద కఠినమైన కేసులు పెట్టారు. అయితే ఈ విచారణ సాగుతున్న క్రమంలోనే భగీరథ్ సరికొత్త అస్త్రాన్ని తెరపైకి తెచ్చారు. బాధిత బాలిక కుటుంబం తనను బ్లాక్‌మెయిల్ చేస్తూ భారీగా డబ్బు డిమాండ్ చేసిందని, ఈ కేసులో తానే బాధితుడినంటూ కరీంనగర్‌లో కౌంటర్ ఫిర్యాదు చేశారు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Frequently Asked Questions
బండి భగీరథ్ పోలీసుల విచారణకు ఎందుకు అప్పగించబడ్డారు?
బండి భగీరథ్ లొంగిపోవడానికి కారణం ఏమిటి?
హైకోర్టు ముందస్తు బెయిల్‌పై రక్షణ ఇవ్వలేమని స్పష్టం చేయడంతో, చట్టపరమైన దారులు మూసుకుపోవడంతో లొంగిపోయారు.
బండి భగీరథ్‌పై పోక్సో కేసు ఎప్పుడు నమోదు చేయబడింది?
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌లో భగీరథ్ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఒక మైనర్ బాలిక ఫిర్యాదు చేయడంతో మే 8న పేట్‌బషీరాబాద్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
బండి భగీరథ్‌పై వచ్చిన ఆరోపణలపై ఆయన కుటుంబం ఏమని చెబుతోంది?
బండి సంజయ్ తన కుమారుడు ఏ తప్పు చేయలేదని పదేపదే చెబుతున్నారు. బాధితుల నుంచి ఫిర్యాదు రాగానే పోలీస్ స్టేషన్‌లో అప్పగిద్దామని భావించినట్లు తెలిపారు.
ట్రెండింగ్ వార్తలు






















