ప్రపంచంలో కొన్ని దేశాలకు సొంత సైన్యం లేదని చెబితే మీరు నమ్ముతారా..

Published by: Shankar Dukanam
Image Source: pexels

పవర్‌ఫుల్ సైన్యం ఉంటే ఆ దేశంపై పొరుగు దేశాల దాడులు జరగవు. సరిహద్దు దేశాల్ని సైతం కొన్ని విషయాల్లో నియంత్రించవచ్చు.

Image Source: pexels

సైన్యం పని కేవలం యుద్ధం చేయడం మాత్రమే కాదు. విపత్తు సమయాల్లోనూ దేశ ప్రజలకు ఆర్మీ సహాయం చేస్తుంది.

Image Source: pexels

సైన్యం ఎంత అవసరమో తైవాన్ పరిస్థితిని చూస్తే అర్థం చేసుకోవచ్చు..

Image Source: pexels

ప్రపంచంలో కొన్ని దేశాలు సొంత సైన్యం లేకుండా ఉన్నాయి. దాంతో అక్కడ ఇతర దేశాల ఆర్మీని మోహరించారు.

Image Source: pexels

ప్రపంచంలోనే అతి చిన్న దేశమైన వాటికన్ సిటీకి సొంత సైన్యం లేదు. అక్కడ భద్రత కోసం స్విస్ గార్డ్, ఇటలీ సహాయం తీసుకుంటారు.

Image Source: pexels

కోస్టా రికా దేశంలో 1948లోనే సైన్యం ఉండటాన్ని రద్దు చేశారు. ప్రస్తుతం అక్కడ పోలీసులే దేశ భద్రతను చూసుకుంటున్నారు.

Image Source: pexels

ఐస్‌లాండ్ దేశానికి కూడా సైన్యం లేదు. తమకు అవసరమైనప్పుడు ఐస్‌లాండ్ మిత్ర దేశాలపై ఆధారపడుతుంది

Image Source: pexels

పనామాలో కూడా సైన్యంను 1990లో రద్దు చేశారు. అక్కడ కేవలం జాతీయ పోలీసు, భద్రతా సంస్థలు మాత్రమే ఉన్నాయి.

Image Source: pexels

మోనాకోలో కూడా సొంత సైన్యం లేదు. ఆ దేశం భద్రత కోసం ఫ్రాన్స్ మీద ఆధారపడుతుందని తెలిసిందే.

Image Source: pexels