Anasuya Ari Movie: 'మిరాయ్'లో రాముడు... 'అరి'లో కృష్ణుడు - ట్రైలర్‌లో చివరి షాట్ గమనించారా?
Lord Sri Krishna In Ari: వెండితెరపై భగవంతుడు కనిపిస్తే సినిమా హిట్ అనే సెంటిమెంట్ బలపడుతోంది. 'హనుమాన్'లో ఆంజనేయుడు, 'మిరాయ్'లో శ్రీరాముడు ఉన్నారు. 'అరి'లో ఎవరు ఉన్నారో చూశారా?

వెండితెరపై భగవంతుడు అడుగు పెడితే సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అని ఓ సెంటిమెంట్ బలపడుతోంది. 'హను - మాన్'లో ఆంజనేయుడు ఉన్నారు. 'మిరాయ్'లో శ్రీరాముడు వచ్చారు. అంతకు ముందు 'కల్కి 2898 ఏడీ'లో కర్ణుడి పాత్ర ఉంది. రీసెంట్ పాన్ ఇండియా సక్సెస్ 'కాంతార ఛాప్టర్ 1'లోనూ పింజర్లి దేవుడు, ఈశ్వర గణాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ లిస్టులో 'అరి: మై నేమ్ ఈజ్ నోబడీ' (Ari My Name Is Nobody) కూడా చేరబోతోంది.
'అరి'లో శ్రీకృష్ణుడు... చూశారా?
'హను - మాన్', 'కల్కి 2898 ఏడీ', 'మిరాయ్', 'కాంతార ఛాప్టర్ 1' సినిమాలు గమనిస్తే, పతాక సన్నివేశాల్లో భగవంతుడిని తీసుకొచ్చారు దర్శక రచయితలు. 'అరి' చిత్ర దర్శకుడు జయశంకర్ సైతం అదే పని చేశారు. తన కథలో దైవత్వం ఉండేలా చూసుకున్నారు.
'అరి' ట్రైలర్ గమనించారా? 'భూలోకంలో జన్మించాలనే శ్రీ కృష్ణుని సంకల్పం...' అంటూ మొదలైంది. ఇక ట్రైలర్ చివరకు వచ్చేసరికి స్క్రీన్ మీద ఏకంగా శ్రీ కృష్ణుడిని చూపించారు. ఆయన నేల మీదకు దిగి వస్తున్నట్టు చూపించారు. మరి కథలో శ్రీకృష్ణుడికి ఎంత ప్రాముఖ్యం ఉందనేది సినిమా చూస్తే తెలుస్తుంది. ఈ శుక్రవారం (అక్టోబర్ 10న) థియేటర్లలోకి వస్తుందీ సినిమా.
Also Read: లిటిల్ హార్ట్స్ తండ్రి... 90s కూతురు... Zee5లో కనబడుటలేదు... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అరి చిత్రాన్ని అరిషడ్వర్గాల కాన్సెప్ట్ మీద తీసినట్టు దర్శకుడు జయశంకర్ చెప్పారు. ఈ సినిమా కోసం తాను ఏడేళ్లుగా పరిశోధన చేసినట్టు ఆయన తెలిపారు. పురాణ ఇతిహాసాల్లో అరిషడ్వార్గాల గురించి ఏం చెప్పారు? వాటికి పరిష్కారం ఏమిటి? అనేది సినిమాలో చూడాలి. ఆల్రెడీ కృష్ణుడి మీద రూపొందించిన 'చిన్నారి కిట్టయ్య...' పాట వైరల్ అయింది. 'అరి: మై నేమ్ ఈజ్ నోబడీ'లో వినోద్ వర్మ, అనసూయ, సాయి కుమార్, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. సురేష్ డిస్ట్రిబ్యూషన్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది.
Also Read: మాస్ మహారాజా కొత్త సినిమాకు క్లాస్ టైటిల్... భర్తలూ, ఇది మీ కోసమే!





















