D/O Prasad Rao Kanabadutaledu: లిటిల్ హార్ట్స్ తండ్రి... 90s కూతురు... Zee5లో కనబడుటలేదు... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
రాజీవ్ కనకాల, ఉదయ భాను, వసంతిక ప్రధాన పాత్రల్లో పోలూరు కృష్ణ దర్శకత్వం వహించిన సిరీస్ 'డాటరాఫ్ ప్రసాద్ రావు: కనబడుటలేదు'. ZEE5లో ఈ తెలుగు ఒరిజినల్ సిరీస్ ఎప్పట్నించి స్ట్రీమింగ్ అవుతుందంటే?

రీసెంట్ బ్లాక్ బస్టర్ సినిమా 'లిటిల్ హార్ట్స్' సినిమాలో హీరో మౌళి తండ్రిగా ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల మెప్పించారు. ఇప్పుడు మరోసారి ఆయన తండ్రిగా యాక్ట్ చేశారు. అయితే ఈసారి ఓ అమ్మాయికి తండ్రిగా నటించారు. '90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్'లో కుమార్తెగా నటించిన వసంతిక మరోసారి కూతురి పాత్రలో సందడి చేయనున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ జీ5 కోసం వీళ్ళిద్దరూ తండ్రీ కుమార్తెలుగా నటించారు.
డాటరాఫ్ ప్రసాద్ రావు: కనబడుటలేదు!
రాజీవ్ కనకాల, వసంతిక తండ్రీ కుమార్తెలుగా నటించిన వెబ్ సిరీస్ 'డాటరాఫ్ ప్రసాద్ రావు: కనబడుటలేదు'. టైటిల్ బట్టి కథ ఏమిటి? అనేది సులభంగా ఊహించవచ్చు. ప్రసాద్ రావు (రాజీవ్ కనకాల) కుమార్తె స్వాతి (వసంతిక) మిస్ అవుతుంది. తన కూతురు ఎక్కడ ఉందో తెలుసుకోవడం కోసం తండ్రి ఏం చేశాడు? ఆయనకు పోలీసుల నుంచి ఎటువంటి సహకారం లభించింది? అనేది సిరీస్ కథాంశం. ఇందులో పోలీస్ అధికారిగా ఒకప్పటి స్టార్ యాంకర్, నటి ఉదయభాను కీలక పాత్ర చేశారు.
జీ5 ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
D/O Prasad Rao Kanabadutaledu Streaming Date: వీక్షకులకు ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కంటెంట్ అందించాలని తపనపడే ఓటీటీల్లో 'జీ5' ఒకటి. ఆ సంస్థ కోసం రూపొందిన ఒరిజినల్ సిరీస్ 'డాటరాఫ్ ప్రసాద్ రావు: కనపడుట లేదు'. 'రెక్కీ', 'విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్' సిరీస్‌ల తర్వాత జీ5 కోసం సౌత్ ఇండియన్ స్క్రీన్స్ సంస్థ రూపొందించిన సిరీస్ ఇది. పోలూరు కృష్ణ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 31వ తేదీ నుంచి జీ 5లో స్ట్రీమింగ్ కానుంది.
Also Read: మాస్ మహారాజా కొత్త సినిమాకు క్లాస్ టైటిల్... భర్తలూ, ఇది మీ కోసమే!
ప్రేమ, మోసం, బాధ వంటి అంశాల మేళవింపుతో 'డాటరాఫ్ ప్రసాద్ రావు: కనబడుటలేదు' సిరీస్ రూపొందించామని దర్శక నిర్మాతలు చెప్పారు. తెలుగు జీ5 బిజినెస్ హెడ్ అనురాధ గూడూరు మాట్లాడుతూ... ''ప్రతి మనిషిలోనూ ఎమోషన్స్ ఉంటాయి. వాటి నుంచి శక్తివంతమైన కథలు వస్తాయని మా నమ్మకం. అటువంటి కథే 'డాటరాఫ్ ప్రసాద్ రావు: కనపడుట లేదు'. కుమార్తెపై తండ్రి ప్రేమను తెరపై దర్శక రచయితలు అందంగా ఆవిష్కరించారు. కుటుంబ సభ్యులు అందరికీ కనెక్ట్ అయ్యే కథాంశమిది. వీక్షకులను ఉత్కంఠకు గురి చేసేలా దర్శకుడు చక్కగా తెరకెక్కించారు. ఇదొక ఫ్యామిలీ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ సిరీస్ అని చెప్పవచ్చు. రాజీవ్ కనకాల, ఉదయభాను వసంతిక అద్భుతమైన నటన సిరీస్ హైలైట్స్‌లో ఒకటి'' అని అన్నారు.
Also Read: నయా 'లేడీ సూపర్ స్టార్'... నయనతార కాదు, ఈవిడ ఎవరో తెలుసా?

రాజీవ్ కనకాల మాట్లాడుతూ... ''కథలోని ఎమోషన్స్ నాకు బాగా నచ్చాయి. ఇదొక మిస్టీరియస్, సస్పెన్స్‌ఫుల్ సిరీస్. 'డాటరాఫ్ ప్రసాద్ రావు: కనపడుటలేదు'లో ఓ తండ్రీ, కూతురు మధ్య అనుబంధాన్ని, ప్రేమను చక్కగా ఆవిష్కరించారు. ప్రసాద్ రావు పాత్రలో నటించేటప్పుడు తండ్రిగా ఫీలయ్యాను. యూనివర్సల్ పాయింట్ ఉన్న సిరీస్ ఇది'' అని చెప్పారు. ఉదయభాను మాట్లాడుతూ... ''సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ సిరీస్ అయినప్పటికీ... బలమైన ఎమోషన్స్ ఉన్నాయి. నేను ఇద్దరు అమ్మాయిలకు తల్లిని. అందువల్ల, కథతో ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యా'' అని చెప్పారు.





















