By: ABP Desam | Updated at : 26 Apr 2023 08:07 PM (IST)
Image Credit: AnushkaShetty/Twitter
సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. పి మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ - ప్రమోద్ నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే 'నో నో నో' అనే ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోని రిలీజ్ చేసిన అనుష్క.. తాజాగా 'వద్దురా బాబు' అంటూ సరికొత్త ప్రోమోతో ముందుకు వచ్చింది.
'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాలో అన్విత రవళి శెట్టి అనే మాస్టర్ చెఫ్ గా అనుష్క నటిస్తే.. సిద్ధూ పోలిశెట్టి అనే స్టాండప్ కమెడియన్ పాత్రలో నవీన్ పోలిశెట్టి కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. అలానే ఉగాది స్పెషల్ గా వదిలిన పాట కూడా ఆకట్టుకుంది. ప్రేమ, పెళ్లి తర్వాత అమ్మాయి లైఫ్ లో వచ్చే కష్టాలని ఫన్నీగా ఈ సాంగ్ లో చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ రధాన్ కంపోజ్ చేసిన ఈ పాటను సింగర్ ఎంఎం మానసి పాడింది. అనంత్ శ్రీరామ్ దీనికి లిరిక్స్ అందించారు. అయితే అందులోని లిరిక్స్ తో ఇప్పుడు అనుష్క పెట్టిన ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షించింది.
“ప్రేమించే సమయం లేదే.. ప్రేమన్న ప్రశ్నే రాదే.. జన్మంతా జామై పోయే.. జంజాటంలో గుంజీలు వద్దే.. వద్దురా బాబూ” అని అన్విత శెట్టి చెబుతోంది అంటూ అనుష్క ఓ వీడియో షేర్ చేసింది. దీన్ని ఆమె రియల్ లైఫ్ కు లింక్ చేస్తూ నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే.. ఈ పాట ఎప్పుడో రిలైజైపోయింది. మరి, స్వీటి ఎందుకు సడన్‌గా ఆ పాటను ట్వీట్ చేసిందనేది నెటిజన్స్‌కు అర్థం కావడంలేదు. స్వీటీ ప్రస్తుత వయస్సు 41 ఏళ్ళు. అయినా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంటోంది. అందుకే ఇప్పుడు పోస్ట్ చేసిన వీడియోతో ఆమెకు ప్రేమించడానికి సమయం లేదని.. ప్రేమ వద్దని చెప్పకనే చెబుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఎలా అయితేనేం ఇది కూడా సినిమా పబ్లిసిటీకి హెల్ప్ అవుతోందని మరికొందరు అంటున్నారు.
నిజానికి 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' టీమ్ మొదటి నుంచీ వెరైటీగానే ప్రమోషన్లు చేస్తోంది. అనుష్క శెట్టి మరియు నవీన్ పోలిశెట్టిలోని పదాలను తీసుకునే టైటిల్ ను ఫిక్స్ చేసారు. ఇప్పుడు నాలుగు పదుల వయసు దాటినా పెళ్ళి గురించి ఆలోచించని అనుష్క పర్సనల్ లైఫ్ కి సింక్ అయ్యేలా సినిమాలో ఆమె పాత్రని డిజైన్ చేసారు. దానికి తగ్గట్టుగానే నో నో నో సాంగ్స్ పెట్టారు. మరి రానున్న రోజుల్లో ఎలాంటి డిఫరెంట్ ప్రమోషనల్ స్ట్రాటజీలతో వస్తారో చూడాలి.
కాగా, 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' అనుష్క కెరీర్ లో 48వ చిత్రం. ఇందులో అనుష్క - నవీన్ లతో పాటుగా సహజ నటి జయసుధ, నాజర్, మురళీ శర్మ, తులసి, హ్యాపీ డేస్ ఫేమ్ సోనియా దీప్తి, అభినవ్ గోమటం తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి రాజీవన్ ఆర్ట్ డైరెక్టర్ గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా విడుదల కాబోతోంది. మేకర్స్ త్వరలోనే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు. అనుష్క చాలా గ్యాప్ తర్వాత నటిస్తోన్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
LGM Teaser: ‘కచ్చితంగా నీ కథ ముగించేస్తారు’ - ధోని నిర్మిస్తున్న ‘ఎల్జీయం’ టీజర్ చూశారా!
Intinti Ramayanam Trailer: ‘ఇంటింటి రామాయణం’ ట్రైలర్ - ఇంతకీ, ఆ పని చేసింది ఇంటి దొంగేనా?
10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!
'గృహం' సీక్వెల్ రెడీ, అందుకే ‘బొమ్మరిల్లు-2’ తీయడం కష్టం: సిద్ధార్థ్
కోలీవుడ్ కాలింగ్ - శ్రీలీల డేట్స్ కోసం తమిళ నిర్మాతలు వెయిటింగ్
Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!
Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!
IND VS AUS: టీమిండియాకు ‘హెడ్’ షాట్ - ఫైనల్ తొలి రోజు ఆస్ట్రేలియాదే!
YS Viveka Case : వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి