అన్వేషించండి

Varun Tej: ఆ టైమ్‌లో ఆడవాళ్లకు విశ్రాంతి ఇచ్చి, మేం వంట చేస్తాం - లావణ్య కోసం ఆ స్వీట్ చేశా: వరుణ్ తేజ్

‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీ ప్రమోషన్ లో వరుణ్ తేజ్ తన సతీమణి లావణ్య త్రిపాఠి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమెతో మరో సినిమా చేస్తారా? అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పారు.

Varun Tej About Lavanya Tripathi: మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్, మాజీ విశ్వసుందరి మానుషి చిల్లర్‌ జంటగా నటించిన తాజా ‘ఆపరేషన్ వాలంటైన్’. ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్స్ నేపథ్యంలో ఈ మూవీని డైరెక్టర్‌ శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. వైమానిక దాడులు, దేశభక్తి కలబోతగా ఒకేసారి తెలుగు, హిందీ భాషల్లో సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో  మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. త్వరలో ఈ సినిమా విడుదలకు రెడీ అవుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో వరుణ్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.     

లావణ్యతో మళ్లీ సినిమానా?: వరుణ్

తాజా ఇంటర్వ్యూలో తన సతీమణి లావణ్య గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సంక్రాంతి పండుగ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. మెగా ఫ్యామిలీ అంతా ఒక్కచోట చేరి సంతోషంగా గడుపుతామన్నారు. “మా కజిన్స్ కలిసినప్పుడు చాలా ఫన్ ఉంటుంది. పండుగల సందర్భంగా ఆడవాళ్లకు విశ్రాంతి ఇచ్చి, మేం వంట చేస్తాం. తాజాగా సంక్రాంతికి మేం అంతా కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడాం. సంక్రాంతి అంటే క్రికెట్ మ్యాచ్ ఆడాల్సిందే. సంక్రాంతి స్పెషల్ గా లావణ్యకు సున్నుండలు చేసి పెట్టాను. అంటే నేనొక్కడినే తయారు చేయలేదు. అందరం చేస్తుంటే నేను జాయిన్ అయ్యాను. రీల్ ఫెయిర్, రియల్ ఫెయిర్ అయ్యింది. మళ్లీ వెనక్కి వెళ్లకూడదు. ముందుకే వెళ్లాలి” అని వరుణ్ చెప్పుకొచ్చారు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వరుణ్, లావణ్య.. కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం బంధంలోకి అడుగు పెట్టారు.    

యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘ఆపరేషన్ వాలంటైన్’  

వ‌రుణ్ తేజ్ పెళ్ల‌య్యాక రిలీజ్ అవుతున్న మొద‌టి సినిమా ‘ఆప‌రేష‌న్ వాలంటైన్’. ఈ సినిమాలో వ‌రుణ్ తేజ్ పైలెట్ గా క‌నిపించ‌నున్నారు. భారత వైమానికి దాడులకు సంబంధించిన కొన్ని యథార్థ సంఘటనలను బేస్ చేసుకుని రూపొందిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. పాక్ ఉగ్ర స్థావరాలు, లాంఛ్ ప్యాడ్స్ మీద దాడులు చేస్తున్నట్లు కనిస్తోంది. దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన సర్జికల్ స్ట్రైక్స్, ఉరి దాడుల ఆధారంగా రూపొందించినట్లు అర్థం అవుతోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేస్తోంది.

మార్చి 1న ‘ఆపరేషన్ వాలంటైన్’ విడుదల

శక్తి ప్రతాప్ సింగ్ ఈ మూవీతోనే దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీ మార్చి 1న విడుదలకానుంది. చాలా కాలంగా హిట్ లేక ఇబ్బంది పడుతున్న వరుణ్ ఈ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కే అవకాశం కనిపిస్తోంది.

Read Also: సూపర్ స్టార్ లవ్ స్టోరీ: రజనీకాంత్ మామోలోడు కాదు, ఇంటర్వ్యూ చేసిన అమ్మాయినే పడేశాడు - ఆ బంధానికి 43 ఏళ్లు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Embed widget