అన్వేషించండి

Rajinikanth-Latha 43rd Anniversary: సూపర్ స్టార్ లవ్ స్టోరీ: రజనీకాంత్ మామోలోడు కాదు, ఇంటర్వ్యూ చేసిన అమ్మాయినే పడేశాడు - ఆ బంధానికి 43 ఏళ్లు!

సూపర్ స్టార్ రజనీకాంత్, లత దంపతులు 43వ పెళ్లి రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కూతురు సౌందర్య రజనీకాంత్ ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

Rajinikanth, wife Latha Celebrate 43 Years Of Togetherness: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, ఆయన సతీమణి లత దంపతులు 43వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఫిబ్రవరి 27న కుటుంబ సభ్యులు ఈ వేడుకను నిర్వహించారు. అమ్మానాన్నలకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తూ వారి చిన్న కుమార్తె సౌందర్య రజనీకాంత్ సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటో షేర్ చేసింది. ఇందులో తమ పెళ్లి రోజు సందర్భంగా  రజనీకాంత్, లత ఉంగరాలు, చైన్ మార్చుకుంటూ కనిపించారు.  

43 ఏండ్ల నాటి చైన్, ఉంగరాలు మార్చుకున్న రజనీ దంపతులు

తల్లిదండ్రుల ఫోటోను షేర్ చేస్తూ, సౌందర్య ఆసక్తికర విషయాలను పంచుకుంది. “43 సంవత్సరాల వివాహ బంధంలో ప్రియమైన అమ్మ, నాన్న ఎప్పుడూ ఒకరికొకరు అండగా నిలబ్డారు. 43 సంవత్సరాల క్రితం వారు మార్చుకున్న చైన్, రింగులు ప్రతి ఏటా వారిని కలుపుతూనే ఉన్నాయి. ఈ ఏడాది కూడా నాటి చైన్, ఉంగరాలను మరోసారి మార్చుకున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది” అంటూ X(ట్విట్టర్)వేదికగా రాసుకొచ్చింది.   

ఇంటర్వ్యూ కోసం వచ్చిన కాలేజీ అమ్మాయితో రజనీకాంత్ ప్రేమాయణం

ఫిబ్రవరి 26న 1981లో రజనీకాంత్, లతను పెద్దల సమక్షంలో సంప్రదాయబద్దంగా పెళ్లి చేసుకున్నారు. వాస్తవానికి వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం. వీరి ప్రేమకథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 1980లో రజనీకాంత్ 'తిల్లు ముల్లు' షూటింగ్‌లో ఉన్నప్పుడు, ఒక విద్యార్థిని కాలేజీ మ్యాగజైన్ కోసం ఆయన్ని ఇంటర్వ్యూ  చేయడానికి వెళ్లింది. ఆ అమ్మాయి మరెవరో కాదు లతా రంగాచారి.

ఇంటర్వ్యూ సమయంలో వారిద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది. ఆమె వినయం, మాట్లాడే విధానం రజనీకాంత్ కు చాలా నచ్చింది. పెళ్లంటూ చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇంటర్వ్యూ కంప్లీట్ కాగానే, తన మనసులోని మాటను లతతో చెప్పేశారు. లత ఎలాంటి సమాధానం చెప్పకుండా, నవ్వుతూ, తన తల్లిదండ్రులతో మాట్లాడాలని చెప్పారు. అదే సమయంలో రజనీకాంత్ సన్నిహితుడు వై జి మహేంద్రన్‌ కు లతకు బంధువు అని తెలిసింది. ఈ విషయాన్ని లత తల్లిదండ్రులకు చేప్పారు. సినిమా పరిశ్రమలోని పలువురు పెద్దలు ఈ పెళ్లి కోసం లత పేరెంట్స్ తో మాట్లాడి ఒప్పించారు. దీంతో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో రజనీ, లతల పెళ్లి అట్టహాసంగా జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఒకరు ఐశ్వర్య, మరొకరు సౌందర్య.

అటు రజనీ సినిమాల విషయానికి వస్తే, ఇటీవలే ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో ‘లాల్ సలాం’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో అంతగా సక్సెస్ కాలేకపోయింది. తాజాగా మరో సినిమాలో రజనీ నటించేందుకు సిద్ధమయ్యారు. బాలీవుడ్‌ సీనియర్‌ నిర్మాత సాజిద్‌ నడియాడ్‌వాలాతో ఓ సినిమా చేయబోతున్నారు. తాజాగా వీరిద్దరు కలిసి ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. “దిగ్గజ నటుడు రజనీకాంత్‌తో కలిసి పని చేయడం నాకొక గౌరవం. మర్చిపోలేని మా ప్రయాణం మొదలు కానున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపై అంచనాలు ఆకాశాన్ని అంటడం ఖాయం’ అంటూ సాజిద్‌ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Read Also: నల్ల పిల్లగా ఇలియానా - ‘కార్తీక దీపం’ కాన్సెప్ట్‌తో ‘తేరా క్యా హోగా లవ్లీ’ మూవీ, ఇదిగో ట్రైలర్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan new movies: డిప్యూటీ సీఎంగానే కాదు హీరోగానూ పవన్ బాధ్యతలు - రాజకీయంగా నైతికమేనా?
డిప్యూటీ సీఎంగానే కాదు హీరోగానూ పవన్ బాధ్యతలు - రాజకీయంగా నైతికమేనా?
Amaravati Land Pooling: అమరావతి లో రెండోదశ పూలింగుకు ఏర్పాట్లు- ఏడు గ్రామాల్లో తొమ్మిది యూనిట్లు రెడీ
అమరావతి లో రెండోదశ పూలింగుకు ఏర్పాట్లు- ఏడు గ్రామాల్లో తొమ్మిది యూనిట్లు రెడీ
Eluru Crime News: లవ్ మ్యారేజ్.. 18 గంటల్లో యువతి కిడ్నాప్ కేసు సుఖాంతం, నిందితుల అరెస్ట్.. ఏలూరులో ఘటన
లవ్ మ్యారేజ్.. 18 గంటల్లో యువతి కిడ్నాప్ కేసు సుఖాంతం, నిందితుల అరెస్ట్.. ఏలూరులో ఘటన
CM Revanth Reddy: అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు
అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు

వీడియోలు

Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam
Antarvedi Thar Tragedy | అంతర్వేది బీచ్‌లో సముద్రంలోకి కొట్టుకుపోయిన థార్.. ఒకరి మృతి | ABP Desam
Rohin Uttappa about Rohit Virat Retirement | రో - కో టెస్ట్ రిటైర్మెంట్ పై మాజీ ప్లేయర్ వ్యాఖ్యలు
Sarfaraz Khan in Vijay Hazare Trophy | రోహిత్ రికార్డు బద్దలు కొట్టిన సర్ఫరాజ్
Devdutt Padikkal Vijay Hazare Trophy | సూపర్ ఫామ్‌లో దేవ్‌దత్ పడిక్కల్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan new movies: డిప్యూటీ సీఎంగానే కాదు హీరోగానూ పవన్ బాధ్యతలు - రాజకీయంగా నైతికమేనా?
డిప్యూటీ సీఎంగానే కాదు హీరోగానూ పవన్ బాధ్యతలు - రాజకీయంగా నైతికమేనా?
Amaravati Land Pooling: అమరావతి లో రెండోదశ పూలింగుకు ఏర్పాట్లు- ఏడు గ్రామాల్లో తొమ్మిది యూనిట్లు రెడీ
అమరావతి లో రెండోదశ పూలింగుకు ఏర్పాట్లు- ఏడు గ్రామాల్లో తొమ్మిది యూనిట్లు రెడీ
Eluru Crime News: లవ్ మ్యారేజ్.. 18 గంటల్లో యువతి కిడ్నాప్ కేసు సుఖాంతం, నిందితుల అరెస్ట్.. ఏలూరులో ఘటన
లవ్ మ్యారేజ్.. 18 గంటల్లో యువతి కిడ్నాప్ కేసు సుఖాంతం, నిందితుల అరెస్ట్.. ఏలూరులో ఘటన
CM Revanth Reddy: అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు
అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు
Vande Bharat Sleeper Train: రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
Bullet train: బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
Jogi Ramesh: కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam
Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam
Embed widget